Nitin Nabin | బీజేపీ కొత్త సారథి ఎన్నిక ఏకగ్రీవం.. ఎవరీ నితిన్ నబీన్..?
Nitin Nabin | భారతీయ జనతా పార్టీ కొత్త సారథిగా నితిన్ నబీన్ సిన్హా( Nitin Nabin Sinha ) ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. అత్యంత చిన్న వయసులో అంటే 46 ఏండ్లకు బీజేపీ( BJP ) 12వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్న నితిన్ నబీన్ గురించి సర్వత్రా చర్చ జరుగుతుంది.
Nitin Nabin | త్రినేత్ర.న్యూస్ : భారతీయ జనతా పార్టీ కొత్త సారథిగా నితిన్ నబీన్ సిన్హా( Nitin Nabin Sinha ) ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డా( JP Nadda ) పదవీకాలం ముగియడంతో.. ఈ ఎన్నిక జరిగింది. ఏకగ్రీవంగా ఎన్నికైన నితిన్ నబీన్.. మంగళవారం ఉదయం 11 గంటలకు బీజేపీ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. గతేడాది డిసెంబర్‌లో అనూహ్యంగా నితిన్ నబీన్‌ను బీజేపీ( BJP ) జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించారు. దాంతో తదుపరి అధ్యక్షుడిగా ఆయనే ఎన్నికవుతారని అందరూ ఊహించినట్లుగానే ఎన్నిక ఏకగ్రీవమైంది. అత్యంత చిన్న వయసులో అంటే 46 ఏండ్లకు బీజేపీ 12వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్న నితిన్ నబీన్ గురించి సర్వత్రా చర్చ జరుగుతుంది.
రాంచీలో జన్మించిన నితిన్..
నితిన్ నబీన్ 1980 మే 23న జార్ఖండ్ రాజధాని రాంచీలో జన్మించారు. నితిన్ తండ్రి నబీన్ కిశోర్ ప్రసాద్ సిన్హా. ఈయన బీజేపీ సీనియర్ లీడర్. బీహార్‌లోని పాట్నా వెస్ట్ అసెంబ్లీ నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు కిశోర్ ప్రసాద్. నితిన్ తల్లి మీరా సిన్హా.. ఈమె గృహిణి.
నితిన్ విద్యాభ్యాసం.. పాట్నా టు ఢిల్లీ
నితిన్ నబీన్ 1996లో పది పాసయ్యారు. పాట్నాలోని సెయింట్ మిచ్చెల్ హై స్కూల్ నుంచి సీబీఎస్ఈ సిలబస్‌లో పది పూర్తి చేశారు. ఢిల్లీలోని సీఎస్‌కేఎం పబ్లిక్ స్కూల్ నుంచి 1998లో ఇంటర్మీడియట్ పాసయ్యారు. నితిన్ దీప్‌మాలా శ్రీవాత్సవను వివాహమాడారు. ఈ దంపతులకు ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు.
రాజకీయ నేపథ్యం ఇదే..
తన తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న నితిన్ నబీన్ భారతీయ జనతా పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. ఆర్ఎస్ఎస్ నేపథ్యం కలిగిన నితిన్.. బీజేపీలో ఎన్నో పదవులను అలంకరించారు. బీజేపీ యూత్ వింగ్‌లో క్రియాశీలక పాత్ర పోషించారు. భారతీయ జనతా యువ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. బీజేవైఎం బీహార్ స్టేట్ ప్రెసిడెంట్‌గా కూడా సేవలందించారు. జమ్మూ కాశ్మీర్‌లో నిర్వహించిన జాతీయ ఐక్యతా యాత్రతో పాటు, 1965 యుద్ధంలో వీరమరణం పొందిన అమరవీరులకు నివాళులర్పిస్తూ గౌహతి నుండి తవాంగ్ వరకు చేపట్టిన పాదయాత్ర వంటి కార్యక్రమాలలో ఆయన చురుకుగా పాల్గొన్నారు.
తండ్రి మరణంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి..
బీహార్‌లోని పాట్నా వెస్ట్ నుంచి ఒకసారి, బంకీపూర్ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు నితిన్. పాట్నా వెస్ట్ నుంచి బీహార్ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న నితిన్ తండ్రి కిశోర్ ప్రసాద్ 2006లో మరణించారు. దీంతో ఆ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. తప్పని పరిస్థితుల్లో బీజేపీ అగ్ర నాయకత్వం సూచన మేరకు తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగారు. పాట్నా వెస్ట్ ఉప ఎన్నికల్లో పోటీ చేసి.. తొలిసారే గెలుపు విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. నియోజకవర్గాల పునర్విభనతో తన నియోజకవర్గం బంకీపూర్‌కు మారింది. 2010, 2015, 2020, 2025 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా నితిన్ గెలుపొందారు. 2025 ఎన్నికల్లో నితిన్ తన ప్రత్యర్థి ఆర్జేడీ అభ్యర్థి రేఖా కుమారిపై 51 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
బీహార్ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు
నితీశ్ కుమార్ ప్రభుత్వంలో నితిన్ నబీన్ కీలక బాధ్యతలు నిర్వర్తించారు. 2021 ఫిబ్రవరి నుంచి 2022 ఆగస్టు వరకు రహదారుల నిర్మాణ శాఖ మంత్రిగా సేవలందించారు. మళ్లీ ఇదే శాఖకు మంత్రిగా 2025 ఫిబ్రవరి నుంచి 2025 డిసెంబర్ వరకు బాధ్యతలు నిర్వర్తించారు. 2024 మార్చి నుంచి 2025 ఫిబ్రవరి మధ్యకాలంలో పట్టణాభివృద్ధి శాఖ, గృహ నిర్మాణ శాఖ, న్యాయ శాఖ మంత్రిగా పని చేశారు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






