త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nirmala Sitharaman | నిర్మ‌ల‌మ్మ బ‌డ్జెట్ చీర‌పై విప‌రీతంగా చ‌ర్చ‌.. ఆర్థిక మంత్రి ఏమ‌న్నారంటే..?

Nirmala Sitharaman | ప్ర‌తి ఏటా బ‌డ్జెట్ స‌మ‌యంలో ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ (Nirmala Sitharaman) పేరు మార్మోగిపోతుంటుంది.

D

National | Published On Feb 2, 2026, 12.46 pm IST

Nirmala Sitharaman | నిర్మ‌ల‌మ్మ బ‌డ్జెట్ చీర‌పై విప‌రీతంగా చ‌ర్చ‌.. ఆర్థిక మంత్రి ఏమ‌న్నారంటే..?
Advertisement

Nirmala Sitharaman | ప్ర‌తి ఏటా బ‌డ్జెట్ స‌మ‌యంలో ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ (Nirmala Sitharaman) పేరు మార్మోగిపోతుంటుంది. అందుకు కార‌ణం ఆమె రికార్డులే. దేశంలో వ‌రుస‌గా ఎక్కువ రోజులు ఆర్థిక మంత్రిగా ప‌నిచేసిన నేత‌గా నిర్మ‌ల‌మ్మ‌కు రికార్డు ఉంది. అంతేకాదు, అత్య‌ధిక బ‌డ్జెట్‌లు ప్ర‌వేశ‌పెట్టిన ఆర్థిక మంత్రిగా, ఎక్కువ స‌మ‌యం బ‌డ్జెట్ ప్ర‌సంగం చేసిన మంత్రిగా రికార్డు ఉంది. ఇక బడ్జెట్ స‌మ‌యంలో నిర్మ‌ల‌మ్మ ధ‌రించే చీర కూడా ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తుంటుంది. బ‌డ్జెట్ అంటే చాలు కేటాయింపుల కంటే.. నిర్మ‌ల‌మ్మ ధ‌రించే చీర గురించే ఎక్కువ‌గా చ‌ర్చ జ‌రుగుతుంటుంది. ఈసారి కూడా బ‌డ్జెట్ వేళ ప్ర‌త్యేక చీర‌లో క‌నిపించారు ఈ తెలుగింటి కోడ‌లు. దీనిపై కూడా తీవ్రంగా చ‌ర్చ జ‌రుగుతోంది.

ఈ చ‌ర్చ‌పై నిర్మ‌లా సీతారామ‌న్ తాజాగా స్పందించారు. ఈ మేర‌కు తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. ‘ప్ర‌తి సంవ‌త్స‌రం బ‌డ్జెట్ రోజున నేను ఏం చీర ధ‌రిస్తానో అన్న ప్ర‌శ్న‌లు ఓ స‌వాల్‌గా మారాయి. నేను ధ‌రించే చీరను కూడా బ‌డ్జెట్‌లో ఓ కీల‌క అంశంగా మార్చేస్తున్నారు. నా చీర‌పై తీవ్రంగా చ‌ర్చ జ‌రుగుతోంది. ఎందుకు ఇలా..? అదే బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టేది మెన్ మినిస్ట‌ర్స్ అయితే..? వారిని కూడా ఇలానే ప్ర‌శ్నిస్తారా..?’ అంటూ నిర్మ‌ల‌మ్మ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఈ సారి నిర్మ‌ల‌మ్మ శారీ స్పెష‌ల్ ఇదే..

బ‌డ్జెట్ వేళ ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ మ‌రోసారి త‌న మార్క్‌ను చూపించారు. వ‌రుస‌గా తొమ్మిదోసారి బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెడుతున్న నిర్మ‌ల‌మ్మ ఈ సారి కూడా ప్ర‌త్యేకమైన చీర‌లో మెరిశారు. త‌న సొంత రాష్ట్ర‌మైన త‌మిళ‌నాడు సాంస్కృతి, వార‌స‌త్వం ఉట్టిప‌డేలా చేనేత ప‌ట్టుచీర ధ‌రించారు. లైట్ గోల్డెన్ బ్రౌన్ చెక్స్‌తో ఉన్న మెరూన్ క‌ల‌ర్ కాంజీవ‌రం చీర‌లో క‌నిపించారు. మ‌రికొన్ని నెల‌ల్లో త‌మిళ‌నాడులో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న విషయం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆ రాష్ట్రానికి ప్రాముఖ్య‌త‌ను ఇస్తూ నిర్మ‌ల‌మ్మ కాంజీవ‌రం చీర‌ను ఎంపిక చేసుకున్న‌ట్లు రాజకీయ వ‌ర్గాల్లో విప‌రీతంగా టాక్ న‌డుస్తోంది. త‌మిళ‌నాడులో త‌యారుచేసే ఈ చేనేత ప‌ట్టుచీర‌ల‌కు 2005లో భౌగోళికంగా గుర్తింపు ల‌భించింది.

Advertisement
Advertisement