GST Council | జీఎస్టీలో మరోసారి భారీ మార్పులు..? అక్టోబర్ 7 భేటీలో కీలక చర్చ..
GST Council | జీఎస్‌టీలో మరోమారు భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయా.. అంటే అందుకు అవుననే సమాధానం వినిపిస్తోంది. అయితే ఈ మార్పులు ఇప్పటికప్పుడు ఉండకపోవచ్చని సమాచారం. వాటిపై అక్టోబర్ 7వ తేదీన జరగనున్న తదుపరి జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశంలో కీలకంగా చర్చించనున్నారని తెలిసింది.
GST Council | జీఎస్టీలో మరోమారు భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయా.. అంటే అందుకు అవుననే సమాధానం వినిపిస్తోంది. అయితే ఈ మార్పులు ఇప్పటికప్పుడు ఉండకపోవచ్చని సమాచారం. వాటిపై అక్టోబర్ 7వ తేదీన జరగనున్న తదుపరి జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశంలో కీలకంగా చర్చించనున్నారని తెలిసింది. కానీ పలు రంగాల్లో రానున్న రోజుల్లో కీలకమార్పులు ఉంటాయని తెలుస్తోంది. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. ఇటీవల చేపట్టిన జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణ అమలు తీరును సమీక్షించడంతోపాటు, ప్రక్రియాపరమైన సంస్కరణలపై ఈ సమావేశంలో ప్రధానంగా దృష్టి సారించే అవకాశం ఉందని పేర్కొన్నాయి.
కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..?
గతేడాది కాలంలో జీఎస్టీ రేట్లలో చేపట్టిన మార్పులు క్షేత్రస్థాయిలో ఎలా అమలయ్యాయి, వాటి వల్ల ఎదురైన సమస్యలు ఏమిటి, రేట్ల హేతుబద్ధీకరణ ప్రభావం ఎలా ఉంది అనే అంశాలను కౌన్సిల్ సమీక్షించనుంది. మరోసారి విస్తృత స్థాయిలో జీఎస్టీ రేట్లను తగ్గించే దిశగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అమలులో తలెత్తిన సమస్యలను పరిష్కరించడం, ఇప్పటికే తీసుకున్న నిర్ణయాల ప్రభావాన్ని అంచనా వేయడం ప్రధాన అంశాలుగా ఉండనున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గతంలోనే అక్టోబర్ 7న జరిగే సమావేశంలో జీఎస్టీ 2.0 కింద ప్రక్రియాపరమైన సంస్కరణలపై చర్చిస్తామని తెలిపారు. ఇందులో ఈ-ఇన్‌వాయిసింగ్, ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ నిబంధనలు వంటి అంశాలు ఉన్నాయి. గత సమావేశంలో జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణకు ప్రాధాన్యం ఇవ్వడంతో, ప్రక్రియాపరమైన సంస్కరణలపై చర్చను అక్టోబర్ సమావేశానికి వాయిదా వేశారు.
జీఎస్టీ రేట్లలో మార్పులు ఉంటాయా..
దీంతో అక్టోబర్ 7 సమావేశానికి ముందు మరోసారి భారీ స్థాయిలో జీఎస్టీ రేట్లలో మార్పులు వస్తాయన్న అంచనాలు ఉన్నాయి. రేట్ల హేతుబద్ధీకరణ అమలైన తొలి ఏడాది అనుభవాన్ని కౌన్సిల్ పరిశీలించి, అవసరమైతే మరిన్ని మార్పులు చేయాలా అనే అంశాన్ని కూడా చర్చించే అవకాశం ఉంది. కాగా బ్యాంకింగ్ రంగానికి సంబంధించి ఐదు రోజుల పని విధానాన్ని అమలు చేయడంపై ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి హామీ ఇవ్వలేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. ఐదు రోజుల బ్యాంకింగ్ వారాన్ని అమలు చేయాలన్నది బ్యాంకు ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్‌గా కొనసాగుతోంది. అయితే ఈ అంశంపై ప్రభుత్వం, బ్యాంకు ఉద్యోగ సంఘాల మధ్య ఇప్పటివరకు ఎలాంటి ఒప్పందం కుదరలేదు. దీంతో యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు మూడు రోజుల దేశవ్యాప్త సమ్మెకు ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. ఐదు రోజుల పని విధానంపై ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉద్యోగ సంఘాలు, బ్యాంకు యాజమాన్యాలతో చర్చలు కొనసాగిస్తోంది. అయితే ఈ అంశం ఇంకా పరిశీలనలోనే ఉందని ప్రభుత్వం చెబుతోంది. సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఉద్యోగులను కోరుతోంది.
బ్యాంకు ఖాతాదారులు, వినియోగదారులపై సమ్మె ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు సెప్టెంబర్ 27 ఆదివారం రోజును పని దినంగా ఆమోదించింది. దీంతో వరుసగా వచ్చే సమ్మె రోజుల్లో బ్యాంకింగ్ సేవలపై ప్రభావాన్ని కొంత మేర తగ్గించే ప్రయత్నం చేస్తోంది.
తాజావార్తలు
- ●Taapsee | అతడికంటే మంచోడు దొరకలేదు - సీక్రెట్ మ్యారేజ్‌పై తాప్సీ కామెంట్స్
- ●Supreme Court | సుప్రీంకోర్టులో హిందీని అధికారిక భాషగా చేయండి
- ●Tata Aeris | టాటా కొత్త సెడాన్ ఏరిస్.. ప్రారంభ ధర రూ.5.29 లక్షలు..
- ●Chamala | జ్ఞానేశ్ కుమార్‌ను వెంటనే సీఈసీ పదవి నుంచి తొలగించాలి
- ●Kohinoor Gated Community | కోహినూర్ గేటెడ్ కమ్యూనిటీలో రికార్డు ధర పలికిన వినాయక లడ్డూ.. ఎంతంటే..
- ●kaaka | జోరు మీదున్న కాకా - డబ్బింగ్ పనులు మొదలు - ఐదు నెలల్లోనే షూటింగ్ కంప్లీట్

Taapsee | అతడికంటే మంచోడు దొరకలేదు - సీక్రెట్ మ్యారేజ్‌పై తాప్సీ కామెంట్స్

Supreme Court | సుప్రీంకోర్టులో హిందీని అధికారిక భాషగా చేయండి

Tata Aeris | టాటా కొత్త సెడాన్ ఏరిస్.. ప్రారంభ ధర రూ.5.29 లక్షలు..

Chamala | జ్ఞానేశ్ కుమార్‌ను వెంటనే సీఈసీ పదవి నుంచి తొలగించాలి






