త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

WCL Recruitment | డిప్లొమా అర్హ‌త‌తో డ‌బ్ల్యూసీఎల్‌లో 444 మైనింగ్ సిర్దార్‌, ఎల‌క్ట్రిక‌ల్ సూప‌ర్‌వైజ‌ర్ పోస్టులు

WCL Recruitment | ప్ర‌భుత్వ‌రంగ సంస్థ కోల్ ఇండియా (Coal India Limited) అనుబంధ కంపెనీ అయిన వెస్ట‌ర్న్ కోల్‌ఫీల్డ్స్ (WCL) మైనింగ్ సిర్దార్‌, అసిస్టెంట్ ఫోర్‌మెన్ (Mining Sirdar), ఎల‌క్ట్రిక‌ల్ సూప‌ర్‌వైజ‌ర్ (Electrical Supervisor) పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది.

G

National | Published On Jul 18, 2026, 8.39 am IST

WCL Recruitment | డిప్లొమా అర్హ‌త‌తో డ‌బ్ల్యూసీఎల్‌లో 444 మైనింగ్ సిర్దార్‌, ఎల‌క్ట్రిక‌ల్ సూప‌ర్‌వైజ‌ర్ పోస్టులు
Advertisement

WCL Recruitment | త్రినేత్ర‌.న్యూస్‌: ప్ర‌భుత్వ‌రంగ సంస్థ కోల్ ఇండియా (Coal India Limited) అనుబంధ కంపెనీ అయిన వెస్ట‌ర్న్ కోల్‌ఫీల్డ్స్ (WCL) మైనింగ్ సిర్దార్‌, అసిస్టెంట్ ఫోర్‌మెన్ (Mining Sirdar), ఎల‌క్ట్రిక‌ల్ సూప‌ర్‌వైజ‌ర్ (Electrical Supervisor) పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. మొత్తం 444 ఖాళీల‌కు నియామ‌క ప్ర‌క్రియ (WCL Recruitment) చేప‌ట్టింది. ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తులు ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్నాయి. అర్హ‌త‌ క‌లిగిన‌వారు ఆగ‌స్టు 4 వ‌ర‌కు అప్ల‌య్ www.westerncoal.inలో చేసుకోవ‌చ్చు. రాత‌ప‌రీక్ష ద్వారా అభ్య‌ర్థుల‌ను ఎంపిక‌చేస్తారు. ఉద్యోగం పొందిన‌వారు మ‌హారాష్ట్ర‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని గ‌నుల్లో ప‌నిచేయాల్సి ఉంటుంది. ప్ర‌తినెల రూ.47,330 జీతం అందుకోవ‌చ్చు.

మొత్తం పోస్టులు: 444
ఇందులో మైనింగ్ సిర్దార్‌- 220, అసిస్టెంట్ ఫోర్‌మెన్ ఎల‌క్ట్రిక‌ల్‌ (ట్రైనీ), ఎల‌క్ట్రిక‌ల్ సూప‌ర్‌వైజ‌ర్ 224 చొప్పున ఖాళీలు ఉన్నాయి.

అర్హ‌త‌లు: మైనింగ్ ఇంజినీరింగ్‌లో డిప్లా చేయాలి లేదా గ్యాస్ టెస్టింగ్ స‌ర్టిఫికెట్ ఉండి మూడేండ్ల అనుభ‌వం త‌ప్ప‌నిస‌రి. ఎల‌క్ట్రిక‌ల్ పోస్టుల‌కు ఎల‌క్ట్రిక‌ల్ ఇంజినీరింగ్‌లో మూడేండ్ల డిప్లొమా ఉండాలి. 2026 ఆగ‌స్టు 10 నాటికి అభ్య‌ర్థులు 18 నుంచి 30 ఏండ్ల వ‌య‌స్సు క‌లిగి ఉండాలి.

ఎంపిక విధానం
కంప్యూట‌ర్ ఆధారిత‌ రాత‌ప‌రీక్ష ద్వారా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు. ప‌రీక్ష 100 మార్కుల‌కు ఉంటుంది. జ‌న‌ర‌ల్ ఆప్టిట్యూడ్ 20, టెక్నీక‌ల్ 80 ప్ర‌శ్న‌లు అడుగుతారు. 90 నిమిషాల్లో ప‌రీక్ష పూర్తిచేయాలి.

మైనింగ్ సిర్దార్ పోస్టుల‌కు ఆరు నెల‌ల ప్రొబీష‌న్, అసిస్టెంట్ ఫోర్‌మెన్‌, ఎల‌క్ట్రిక‌ల్ సూప‌ర్‌వైజ‌ర్ పోస్టుల‌కు రెండేండ్ల ట్రైనింగ్ ఉంటుంది.

అప్లికేష‌న్ ఫీజు: రూ.11800
ద‌ర‌ఖాస్తులు ప్రారంభం: జూలై 20
ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ: ఆగ‌స్టు 4
వెబ్‌సైట్‌: www.westerncoal.in

Advertisement
Advertisement