Janhvi Kapoor | జాన్వీ చేతిపై బాయ్‌ఫ్రెండ్ పేరు – లవ్ స్టోరీని కన్ఫర్మ్ చేసినట్లేనా?
తన లవ్‌స్టోరీపై బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ మరోసారి హింట్ ఇచ్చేసింది. మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్‌కుమార్ షిండే మనవడు శిఖర్ పహారియాతో జాన్వీ ప్రేమలో ఉన్నట్లు బాలీవుడ్‌లో చాలా కాలంగా రూమర్లు వినిపిస్తున్నాయి. వీరిద్దరు కలిసి టూర్లు,రెస్టారెంట్లకు వెళ్లిన ఫొటోలు పలుమార్లు వైరల్ అయ్యాయి.
Naresh N
Entertainment | Published On Jul 9, 2026, 5.24 pm IST

తాజాగా శిఖర్‌తో ప్రేమిస్తున్నట్లుగా మరోసారి చెప్పకనే చెప్పేసింది జాన్వీ.

జాన్వీ కపూర్ సోదరి అన్షులా కపూర్ పెళ్లి ఇటీవల గ్రాండ్‌గా జరిగింది. ఈ పెళ్లి వేడుకలకు జాన్వీ కపూర్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.

వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో చేతికి మెహందీ డిజైన్‌తో జాన్వీ కనిపించింది. శిఖు అంటూ మెహందీతో జాన్వీ చేతిపై పేరు రాసి ఉండటం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.

ప్రియుడు శిఖర్ పహారియాను ముద్దుగా జాన్వీ శిఖు అని పిలుస్తుందని సమాచారం. ఆ ముద్దు పేరునే తన చేతిపై మెహందీతో డిజైన్‌గా జాన్వీ వేసుకుందని అంటున్నారు.

శిఖర్ పహారియాతో జాన్వీ లవ్‌స్టోరీ ఇప్పటిది కాదట. వారి ప్రేమాయణం పదేళ్లుగా సాగుతున్నట్లు సమాచారం. వీరి బంధం గురించి ఇరు కుటుంబసభ్యులకు తెలుసునని అంటున్నారు.

శిఖర్ పహారియాను జాన్వీ పెళ్లి చేసుకోబోతున్నట్లు చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రేమ, పెళ్లి వార్తలపై మాత్రం ఈ జంట ఇప్పటివరకు పెద్దవి విప్పలేదు.

శిఖర్ పహారియా గేమింగ్, కన్సల్టెన్సీ వ్యాపారాలు నిర్వహిస్తున్నాడు.
తాజావార్తలు
- ●Reverse Waterfall | రివర్స్ వాటర్‌ఫాల్.. ఆ అద్భుత దృశ్యం చూస్తే పులకించిపోవాల్సిందే..
- ●Hyderabad | ఎగ్జామ్ ప్యాడ్‌ను విసిరేసిన టీచర్.. తెగిపోయిన విద్యార్థిని చెవి
- ●White Cobra | నిర్మల్ జిల్లాలో అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం..
- ●Hyderabad | కలిసి మద్యం సేవించారు.. స్నేహితుడిని హత్య చేశారు..
- ●Sreeleela | లెనిన్ రిలీజ్ వేళ - శ్రీలీలను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు - ఎందుకంటే?
- ●Nora Fatehi | ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌లో మొరాకో ఓటమి - కన్నీళ్లు పెట్టుకున్న నోరా ఫతేహి - కారణం ఇదే!

Reverse Waterfall | రివర్స్ వాటర్‌ఫాల్.. ఆ అద్భుత దృశ్యం చూస్తే పులకించిపోవాల్సిందే..

Hyderabad | ఎగ్జామ్ ప్యాడ్‌ను విసిరేసిన టీచర్.. తెగిపోయిన విద్యార్థిని చెవి

White Cobra | నిర్మల్ జిల్లాలో అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం..

Hyderabad | కలిసి మద్యం సేవించారు.. స్నేహితుడిని హత్య చేశారు..


