త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ola Electric | ఓలా ఎల‌క్ట్రిక్‌కు కేంద్రం భారీ ఊతం.. రూ.95.81 కోట్ల ప్రోత్సాహకం..

Ola Electric | ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.95.81 కోట్ల ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) ప్రోత్సాహకం లభించింది. ఆటోమొబైల్ రంగానికి సంబంధించిన పీఎల్ఐ పథకం కింద ఈ ప్రోత్సాహకాన్ని ఓలా ఎలక్ట్రిక్ పొందినట్లు ఈటీ నౌ వెల్లడించింది.

S

Business | Published On Aug 29, 2026, 11.13 am IST

Ola Electric | ఓలా ఎల‌క్ట్రిక్‌కు కేంద్రం భారీ ఊతం.. రూ.95.81 కోట్ల ప్రోత్సాహకం..
Advertisement

Ola Electric | ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.95.81 కోట్ల ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) ప్రోత్సాహకం లభించింది. ఆటోమొబైల్ రంగానికి సంబంధించిన పీఎల్ఐ పథకం కింద ఈ ప్రోత్సాహకాన్ని ఓలా ఎలక్ట్రిక్ పొందినట్లు ఈటీ నౌ వెల్లడించింది. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీని ప్రోత్సహించడంతోపాటు అధునాతన ఆటోమోటివ్ టెక్నాలజీ ఉత్పత్తులకు ఊతమివ్వాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పీఎల్ఐ-ఆటో పథకాన్ని అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఓలా ఎలక్ట్రిక్‌కు లభించిన రూ.95.81 కోట్ల ప్రోత్సాహకం సంస్థ తయారీ కార్యకలాపాలకు, దేశీయ ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో దాని స్థాయిని మరింత బలోపేతం చేయడానికి దోహదపడే అవకాశం ఉంది.

కీల‌క సంస్థ‌గా ఓలా ఎల‌క్ట్రిక్‌..

ఓలా ఎలక్ట్రిక్ ఇప్పటికే దేశీయ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్లో కీలక సంస్థగా కొనసాగుతోంది. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలతో దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సామర్థ్యం, స్థానిక ఉత్పత్తి, సాంకేతిక అభివృద్ధి మరింత పెరగడానికి అవకాశం ఏర్పడుతోంది. అలాగే ఓలా ఎలక్ట్రిక్‌కు పీఎల్ఐ-ఆటో పథకం కింద వరుసగా మూడోసారి ప్రోత్సాహకం లభించినట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. గతంలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ.73.74 కోట్లు, 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.366.78 కోట్ల ప్రోత్సాహకాన్ని సంస్థ పొందింది. తాజా రూ.95.81 కోట్లతో కలిపి ఓలా ఎలక్ట్రిక్‌కు ఇప్పటివరకు మంజూరైన పీఎల్ఐ-ఆటో ప్రోత్సాహకాల మొత్తం సుమారు రూ.536.3 కోట్లకు చేరింది. దేశీయ తయారీ, విడిభాగాల స్థానికీకరణతోపాటు బ్యాటరీ, సెల్ తయారీ సామర్థ్యాన్ని విస్తరించే సమయంలో ఈ నిధులు సంస్థకు కీలకంగా మారనున్నాయి.

Advertisement
Advertisement