Hyderabad | కొత్త కారుకు పూజచేయించాడు.. అదే కారు కింద పడి వ్యక్తి మృతి
Hyderabad | హైదరాబాద్ (Hyderabad) పెద్దమ్మగుడి వద్ద విషాదం చోటుచేసుకుంది. కొత్త కారుకు పూజ చేయించేందుకు వచ్చిన ఓ వ్యక్తి.. అదే కారుకింద పడి మృతిచెందారు.
Hyderabad | త్రినేత్ర.న్యూస్: కొత్త కారుకు పూజ చేయించేందుకు కుటుంబ సభ్యులతో కలిసి గుడికి వెళ్లిన ఓ వ్యక్తి.. అదే కారు కింద పడి మరణించిన ఘటన హైదరాబాద్ (Hyderabad) జూబ్లీహిల్స్‌లో చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండకు చెందిన తుమ్మలపల్లి రామచంద్రరావు (70) తన భార్య గంగాభవానితో కలిసి వైద్య పరీక్షల కోసం హైదరాబాద్ వచ్చారు. మియాపూర్‌లో ఉంటున్న తన మేనల్లుడు సాయి కుమార్ ఇంటికి వెళ్లారు.
అయితే సాయికుమార్ కొత్త కారు కొనుగోలు చేశారు. దీంతో కారు పూజ చేయించేదుకు అంతా కలిసి జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడికి (Peddamma Temple) వెళ్లారు. పూజ సమయంలో కారును కొద్దిగా ముందుకు కదిలించాలని పూజరి చెప్పడంతో.. సాయి కుమార్ బ్రేక్‌కు బదులు ఎక్సలేటర్ తొక్కారు. దీంతో అది ఒక్కసారిగా ముందుకు దూసుకెళ్లింది. అదే సమయంలో కారుకు ముందు నిల్చున్న రామచంద్రరావును అది ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన అతడిని కుటుంబసభ్యులు ఆటోలో గచ్చిబౌలిలోని ఏఐజీ దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతిచెందారు. వైద్య పరీక్షల కోసం వచ్చి.. మేనల్లుడి కొత్తకారు కింద పడి చనిపోవడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సంబంధిత వార్తలు

Travel Bus | అనంతపురంలో ట్రావెల్స్ బస్సు దగ్ధం.. తప్పిన ప్రాణ నష్టం
సెప్టెంబర్ 4, 2026

JNTU | జేఎన్టీయూలో ఘర్షణ.. కర్రలతో విచక్షణారహితంగా కొట్టుకున్న విద్యార్థులు
సెప్టెంబర్ 4, 2026

BJP Malka Komaraiah | ఫీజులు అడిగితే అరెస్టులు చేస్తారా? విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం వద్దు
సెప్టెంబర్ 3, 2026
తాజావార్తలు
- ●NIC Recruitment | నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్లో టెక్నికల్ అసిస్టెంట్లు..
- ●JNTU | జేఎన్టీయూలో ఘర్షణ.. కర్రలతో విచక్షణారహితంగా కొట్టుకున్న విద్యార్థులు
- ●ISRO | నింగిలోకి నిఘానేత్రం.. విజయవంతంగా జీఎస్ఎల్వీ-ఎఫ్17 ప్రయోగం
- ●Bomb Blast | కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత ఇంటి వద్ద పేలిన బాంబు.. హత్యాయత్నం జరిగిందా?
- ●వెయ్యి రోజుల సంబరాల వేళ.. కాంగ్రెస్‌కు ‘కొండంత’ నొప్పి!
- ●Horoscope | సెప్టెంబర్ 4 రాశిఫలాలు.. ఈ రాశి వారికి ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి!

NIC Recruitment | నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్లో టెక్నికల్ అసిస్టెంట్లు..

JNTU | జేఎన్టీయూలో ఘర్షణ.. కర్రలతో విచక్షణారహితంగా కొట్టుకున్న విద్యార్థులు

ISRO | నింగిలోకి నిఘానేత్రం.. విజయవంతంగా జీఎస్ఎల్వీ-ఎఫ్17 ప్రయోగం

Bomb Blast | కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత ఇంటి వద్ద పేలిన బాంబు.. హత్యాయత్నం జరిగిందా?



