Samantha | పుట్టబోయే బిడ్డ కోసం షాపింగ్ చేసిన సమంత – అమ్మతనంపై ఆసక్తికర కామెంట్లు
మాతృత్వపు బంధంపై హీరోయిన్ సమంత ఆసక్తికర కామెంట్లు చేసింది. తల్లిగా మారే క్షణాల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్లు ప్రకటించింది. పుట్టబోయే బిడ్డ కోసం షాపింగ్ చేసినట్లు చెప్పింది. ఇందుకు సంబంధించిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది.
Entertainment | Published On Aug 29, 2026, 10.44 am IST
Samantha | మాతృత్వపు బంధంలోకి అడుగుపెట్టే క్షణాల కోసం ఎదురుచూస్తోంది సమంత. తాను తల్లి కాబోతున్నట్లు ఇటీవలే మా ఇంటి బంగారం ప్రమోషన్స్‌లో వెల్లడించింది. ప్రెగ్నెన్సీ కారణంగా షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చింది. ఈ గ్యాప్‌లో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో ముచ్చటించింది. అమ్మతనంపై ఆసక్తికర కామెంట్లు చేసింది.
ల్యాప్‌ట్యాప్ స్టాండ్....
పుట్టబోయే బిడ్డ కోసం షాపింగ్ పూర్తిచేసినట్లు సమంత చెప్పింది. "బేబీ కోసం అవసరమైన వస్తువులన్నీ కొనేశాను. వాటిని ప్యాక్ చేసి ఓ బాక్స్‌లో పెట్టాను. ఆ బాక్స్‌ను ప్రస్తుతం ల్యాప్‌ట్యాప్ స్టాండ్‌గా వాడుతున్నా" అంటూ సమంత చెప్పింది. ఆ బాక్స్ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
ఆత్రుతగా ఎదురుచూస్తున్నా..
ప్రెగ్నెన్సీ కారణంగా తాను పదకొండు కేజీల బరువు పెరిగినట్లు సమంత తెలిపింది. "తల్లిగా మారే క్షణాల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నా. అదొక అందమైన, అనిర్వచనీయమైన అనుభూతి" అని చెప్పింది. మీ బేబీకి పేరు సెలెక్ట్ చేశారా అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమంత రిప్లై ఇచ్చింది. "పేరును సెలెక్ట్ చేయడం చాలా కష్టం. అందరి హెల్ప్ తీసుకొని ఓ మంచి పేరును నిర్ణయించాలని అనుకుంటున్నా" అని సమంత అన్నది.
మా ఇంటి బంగారంతో కమ్‌బ్యాక్....
ఇటీవలే మా ఇంటి బంగారం మూవీతో పెద్ద విజయాన్ని అందుకుంది సమంత. దాదాపు మూడేళ్ల తర్వాత హీరోయిన్‌గా ఈ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో హీరోయిన్‌గా, ప్రొడ్యూసర్‌గా డబుల్ సక్సెస్‌ను అందుకుంది. భర్త రాజ్ నిడిమోరుతో కలిసి సమంత మా ఇంటి బంగారం సినిమాను నిర్మించింది. కేవలం 30 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ థియేటర్లలో వంద కోట్లకుపైగా వసూళ్లను దక్కించుకుంది. తెలుగులో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన లేడీ ఓరియెంటెడ్ మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది.

సంబంధిత వార్తలు

Kajal Aggarwal | డబ్బు, స్టేటస్ కాదు .. అదే ముఖ్యం – వైవాహిక జీవితంపై కాజల్ పోస్ట్
సెప్టెంబర్ 13, 2026

Siima Awards 2026 | సైమా అవార్డ్స్ వేడుకలో సందడి చేసిన హీరోయిన్లు – స్పెషల్ అట్రాక్షన్‌గా రుక్మిణి వసంత్
సెప్టెంబర్ 13, 2026

Irumudi OTT | అఫీషియల్ – థియేటర్లలో ఆడుతోండగానే ఓటీటీలోకి రవితేజ ఇరుముడి – నిర్మాతలపై ఫ్యాన్స్ ఫైర్
సెప్టెంబర్ 13, 2026
తాజావార్తలు
- ●RGV on Artificial Intelligence | జేబులో చిల్లిగవ్వ లేనప్పుడు ఎదురుగా నగదుతో నిండిన పెద్ద లాకర్ ఉంటే దాన్ని తెరవకుండా ఎంతసేపు ఉండగలరు?
- ●TG Weather | మరో మూడురోజులు తెలంగాణలో భారీ వర్షాలు.. ఐఎండీ వార్నింగ్..!
- ●Rashmika Mandanna | ఆనంద్ దేవరకొండ ఎపిక్‌కు రష్మిక మందన్న రివ్యూ - కన్నీళ్లు పెట్టుకున్నా విజయ్ దేవరకొండ
- ●iPhone 17 Pro Max | ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌పై భారీ డిస్కౌంట్ ఆఫర్.. రూ.రూ.74,990కే ఫోన్..!
- ●Pawan Kalyan Keralam Visit | 'థాంక్యూ కేరళం': ఆయుర్వేద చికిత్స ముగిశాక పవన్ కల్యాణ్ ఎమోషనల్ పోస్ట్.. కేరళ సీఎం ఏమన్నారంటే?
- ●Konda Surekha | నేన్ గెలవంగనే నా ఎనకాల్నే టీఆర్ఎస్లకొచ్చిండు.. ఆ జెండాతోటి మళ్ల ఇటొచ్చిండు

RGV on Artificial Intelligence | జేబులో చిల్లిగవ్వ లేనప్పుడు ఎదురుగా నగదుతో నిండిన పెద్ద లాకర్ ఉంటే దాన్ని తెరవకుండా ఎంతసేపు ఉండగలరు?

TG Weather | మరో మూడురోజులు తెలంగాణలో భారీ వర్షాలు.. ఐఎండీ వార్నింగ్..!

Rashmika Mandanna | ఆనంద్ దేవరకొండ ఎపిక్‌కు రష్మిక మందన్న రివ్యూ - కన్నీళ్లు పెట్టుకున్నా విజయ్ దేవరకొండ

iPhone 17 Pro Max | ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌పై భారీ డిస్కౌంట్ ఆఫర్.. రూ.రూ.74,990కే ఫోన్..!



