త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TVK Vijay | విజ‌య్ ప్ర‌భుత్వ ఏర్పాటుకు లైన్ క్లియ‌ర్.. శ‌నివారం ఉ. 11 గంట‌ల‌కు సీఎంగా ప్ర‌మాణం

TVK Vijay | త‌మిళ‌నాట‌ నాలుగు రోజులుగా సాగుతున్న రాజ‌కీయ అనిశ్చితికి తెర‌ప‌డింది. విజ‌య్ ప్ర‌భుత్వ ఏర్పాటుకు లైన్ క్లియ‌ర్ అయ్యింది. విడుతలై చిరుతైగల్ కట్చి, సీపీఎం, సీపీఐ పార్టీలు టీవీకేకి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించాయి. దీంతో విజ‌య్ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మార్గం సుగ‌మైంది.

D

National | Published On May 8, 2026, 7.42 pm IST

TVK Vijay | విజ‌య్ ప్ర‌భుత్వ ఏర్పాటుకు లైన్ క్లియ‌ర్.. శ‌నివారం ఉ. 11 గంట‌ల‌కు సీఎంగా ప్ర‌మాణం
Advertisement
  • టీవీకేకి మ‌ద్ద‌తిచ్చిన వీసీకే, వామ‌ప‌క్షాలు
  • మిత్ర‌ప‌క్షాల‌కు కేబినెట్‌లో చోటు
  • మూడోసారి గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసిన కాబోయే సీఎం విజ‌య్‌
  • ప్రజాస్వామ్యం గెలిచిందన్న కాంగ్రెస్‌

త్రినేత్ర న్యూస్ : ఎన్నిక‌ల్లో 108 స్థానాల్లో గెలిచి అతిపెద్ద పార్టీగా అవ‌త‌రించిన విజ‌య్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగంకు (TVK) అడ్డంకులు తొలిగిపోయాయి. ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవ‌స‌ర‌మైన మెజారిటీ ల‌భించింది. వీసీకే (VCK), వామ‌ప‌క్షాలు విజ‌య్‌కు (TVK Vijay) అధికారికంగా మ‌ద్ద‌తు ప్ర‌క‌టించాయి. ఈ మేర‌కు ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశాయి. దీంతో విజ‌య్‌ సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేసేందుకు లైన్ క్లియ‌రైంది. 118 మంది ఎమ్మెల్యేల సంత‌కాల‌తో కూడిన లేఖ‌తో విజ‌య్ గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిశారు. ప్ర‌భుత్వం ఏర్పాటు చేసేందుకు, అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకునేందుకు అవ‌కాశం ఇవ్వాల‌ని కోరారు. మెజారిటీ ఉండ‌టంతో గ‌వ‌ర్న‌ర్ కూడా సానుకూలంగా స్పందించిన‌ట్లు తెలుస్తోంది.

పూర్తి మెజారిటీ..

త‌మిళ‌నాడులో 234 అసెంబ్లీ స్థానాల‌కు గానూ విజ‌య్ నేతృత్వంలోని టీవీకే పార్టీ 108 స్థానాల్లో గెలుపొందింది. విజయ్ రెండు నియోజకవర్గాల్లో గెలవడంతో ఒక సీటు వదులుకోవాలి. దీంతో పార్టీ బలం 107కి తగ్గుతుంది. కాంగ్రెస్ 5 ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించడంతో సంఖ్య 112కి చేరింది. ఇప్పుడు వీసీకే (2), సీపీఐ (2), సీపీఎం (2) మ‌ద్ద‌తుతో మెజారిటీకి అవ‌స‌ర‌మైన 118 మంది ఎమ్మెల్యేల మ‌ద్ద‌తు ల‌భించిన‌ట్లైంది.

మిత్ర‌ప‌క్షాల‌కు కేబినెట్‌లో చోటు

ప్ర‌భుత్వ ఏర్పాటుకు మ‌ద్ద‌తిచ్చిన‌ పార్టీలకు మంత్రి ప‌ద‌వులు ఇవ్వాల‌ని విజ‌య్ నిర్ణ‌యించిన‌ట్లు తెలిసింది. మొత్తం 35 మందితో మంత్రి వ‌ర్గాన్ని ఏర్పాటు చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇందులో కాంగ్రెస్‌కు రెండు, వీకేసీ, సీపీఎం, సీపీఐకి ఒక్కో మంత్రి ప‌ద‌వి ఇవ్వాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం.

ప్రజాస్వామ్యం గెలిచింది..

టీవీకేకి వామ‌ప‌క్షాలు, వీసీకే స‌పోర్ట్ ఇవ్వ‌డంపై కాంగ్రెస్ స్పందించింది. తమిళనాడులో "ప్రజాస్వామ్యం గెలిచింది" అంటూ ఆ పార్టీ ఎంపీ ఎస్. జోతిమణి పేర్కొన్నారు. ఈ మేర‌కు ఎక్స్‌లో పోస్టు పెట్టారు.

రేపే ప్ర‌మాణ‌స్వీకారం..

ముఖ్య‌మంత్రిగా విజ‌య్ శ‌నివారం ఉద‌యం 11 గంట‌ల‌కు ప్ర‌మాణ స్వీకారం చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. నెహ్రూ స్టేడియంలో ప్రమాణస్వీకారోత్స‌వ కార్య‌క్ర‌మానికి టీవీకే ఏర్పాట్లు చేస్తోంది. ఈ కార్య‌క్ర‌మానికి పెద్ద సంఖ్య‌లో అభిమానులు త‌ర‌లివ‌చ్చే అవ‌కాశం ఉంది. కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ కూడా హాజ‌ర‌వుతార‌ని స‌మాచారం.

గ‌వ‌ర్న‌ర్‌కు స్టాలిన్ కీల‌క విజ్ఞ‌ప్తి

మ‌రోవైపు గ‌వ‌ర్న‌ర్ రాజేంద్ర అర్లేకర్‌కు ఆప‌ద్ధ‌ర్మ ముఖ్మ‌మంత్రి ఎంకే స్టాలిన్ కీల‌క విజ్ఞ‌ప్తి చేశారు. తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో చొరవ చూపాల‌ని కోరారు. ప్ర‌భుత్వ ఏర్పాటుకు త‌గిన చర్య‌లు తీసుకోవాల‌న్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఎన్నికైన శాసనసభ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయడానికి, రాష్ట్ర సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావ‌డం అనేది అవ‌స‌రం మాత్ర‌మే కాద‌ని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం యొక్క‌ అత్యంత ముఖ్యమైన బాధ్య‌త అని గుర్తు చేశారు. ప్రభుత్వ ఏర్పాటులో ఎలాంటి జాప్యం జ‌ర‌గ‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు.

Also Read..

బెంగాల్ తదుప‌రి సీఎంగా సువేందు.. 'అధికారి'కంగా ప్ర‌క‌టించిన అమిత్ షా

చేనేత బ్రాండ్ అంబాసిడర్‌గా రష్మీ ఠాగూర్.. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఇక్క‌త్ వ‌స్త్రాల ప్ర‌ద‌ర్శ‌న‌

ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అషురెడ్డి? - స‌డెన్ షాకిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ - ఫొటోలు వైర‌ల్‌

ట్యాగ్స్:

Advertisement
Advertisement