Rashmi Thakur | చేనేత బ్రాండ్ అంబాసిడర్‌గా రష్మీ ఠాగూర్.. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఇక్కత్ వస్త్రాల ప్రదర్శన
Rashmi Thakur | మిస్ ఇండియా స్టార్ యూనివర్స్ 2018 రష్మీ ఠాగూర్‌ను తెలంగాణ రాష్ట్ర చేనేత ఉత్పత్తుల బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు చేనేత అభివృద్ధి కమిషనర్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
Rashmi Thakur | మిస్ ఇండియా స్టార్ యూనివర్స్ 2018 రష్మీ ఠాగూర్‌ను తెలంగాణ రాష్ట్ర చేనేత ఉత్పత్తుల బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు చేనేత అభివృద్ధి కమిషనర్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 17 నుంచి 21 వరకు ఫ్రాన్స్‌లో జరగనున్న అంతర్జాతీయ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్–2026లో రష్మీ ఠాగూర్ తెలంగాణ చేనేత ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు. ముఖ్యంగా జీఐ ట్యాగ్ పొందిన పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలు ఈ వేదికపై ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. భారత జౌళి మంత్రిత్వ శాఖ, చేనేత అభివృద్ధి కమిషనర్ కార్యాలయం, హైదరాబాద్ చేనేత సేవా కేంద్రం సహకారంతో ‘హౌస్ ఆఫ్ వెండోమ్ పారిస్’ సంయుక్తంగా నిర్వహించే అంతర్జాతీయ ఫ్యాషన్ షోలో ఆమె పాల్గొంటారని చేనేత సేవా కేంద్రం డైరెక్టర్ డాక్టర్ ఎస్ అరుణ్‌కుమార్ తెలిపారు.
ఇక రష్మీ ఠాగూర్‌కు విషయానికి వస్తే.. కరీంనగర్ జిల్లాకు చెందిన ఆమె 2014లో మిస్ ఆంధ్రప్రదేశ్ టైటిల్‌ను గెలుచుకున్నారు. అనంతరం మిస్ క్వీన్ ఇండియా పోటీల్లో మిస్ బ్యూటిఫుల్ ఐస్ (2015), మిస్ పర్ఫెక్ట్ (2015) సబ్ టైటిళ్లను సొంతం చేసుకున్నారు. 2016లో టర్కీలో జరిగిన మిస్ ప్లానెట్ ఇండియా టైటిల్ గెలుచుకోగా, 2017లో మలేషియాలో జరిగిన మిస్ ఆసియా పసిఫిక్ ఇంటర్నేషనల్ పోటీల్లో పాల్గొన్నారు. 2018లో అమెరికాలో జరిగిన మిస్ ఇండియా స్టార్ యూనివర్స్ టైటిల్‌ను గెలుచుకున్నారు. వివిధ రంగాల్లో ఆమెకు ఉన్న గుర్తింపుతో పాటు ఇప్పటికే పలు బాధ్యతల్లోనూ రష్మీ ఠాగూర్ కొనసాగుతున్నారు. తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా, కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ హ్యాండ్లూమ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా, సైకియాట్రిస్ట్ సొసైటీకి బ్రాండ్ అంబాసిడర్‌గా, యాంటీ సూసైడ్ కమిటీకి అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు.
అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆమెకు గుర్తింపు లభించింది. కర్నాటకలో డాక్టరేట్ పొందిన ఆమెకు యంగ్ అచీవర్ అవార్డు లభించింది. ప్రస్తుతం వరల్డ్ ఉమెన్ ఫెడరేషన్ అధ్యక్షురాలిగా, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ సంస్థ సభ్యురాలిగా, హ్యాండ్లూమ్ వీవర్స్ రైట్స్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. అదేవిధంగా అబ్దుల్ కలాం స్మృతి గుడ్‌విల్ అంబాసిడర్‌గా, గ్లోబల్ పీస్ ఇంటర్ జనరేషనల్ డైలాగ్ కన్వీనర్‌గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ చేనేత ఉత్పత్తులకు అంతర్జాతీయ వేదికపై మరింత ప్రాచుర్యం కల్పించేందుకు ఆమె నియామకం కీలకంగా మారనుందని భావిస్తున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Minister Uttam Kumar Reddy | రైతుల ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యం.. ప్రతీ గింజకూ లెక్క చెప్పాల్సిందే : మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి
ఆగస్టు 4, 2026

Harish Rao | డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్‌కు పూర్తి స్థాయి అధికారిని నియమించాలి.. హరీశ్ రావు డిమాండ్
ఆగస్టు 4, 2026

Minister Ponnam Prabhakar | పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై అభిప్రాయ సేకరణ చేపట్టిన మంత్రి పొన్నం ప్రభాకర్
ఆగస్టు 4, 2026
తాజావార్తలు
- ●Minister Uttam Kumar Reddy | రైతుల ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యం.. ప్రతీ గింజకూ లెక్క చెప్పాల్సిందే : మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి
- ●Kaloji Health University | విద్యార్థులకు అలర్ట్.. ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన కాళోజీ హెల్త్ యూనివర్సిటీ
- ●Faridabad Teacher | 30 సెకన్లలో 34 కత్తిపోట్లు.. స్కూల్ టీచర్‌పై వ్యక్తి పైశాచిక దాడి
- ●Penny Stocks | కాసుల వర్షం కురిపిస్తున్న పెన్నీ స్టాక్స్.. 6 నెలల్లో 198 శాతం లాభాలు..
- ●Harish Rao | డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్‌కు పూర్తి స్థాయి అధికారిని నియమించాలి.. హరీశ్ రావు డిమాండ్
- ●Minister Ponnam Prabhakar | పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై అభిప్రాయ సేకరణ చేపట్టిన మంత్రి పొన్నం ప్రభాకర్

Minister Uttam Kumar Reddy | రైతుల ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యం.. ప్రతీ గింజకూ లెక్క చెప్పాల్సిందే : మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి

Kaloji Health University | విద్యార్థులకు అలర్ట్.. ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన కాళోజీ హెల్త్ యూనివర్సిటీ

Faridabad Teacher | 30 సెకన్లలో 34 కత్తిపోట్లు.. స్కూల్ టీచర్‌పై వ్యక్తి పైశాచిక దాడి

Penny Stocks | కాసుల వర్షం కురిపిస్తున్న పెన్నీ స్టాక్స్.. 6 నెలల్లో 198 శాతం లాభాలు..



