త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ashu Reddy | ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అషురెడ్డి? – స‌డెన్ షాకిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ – ఫొటోలు వైర‌ల్‌

బిగ్‌బాస్ బ్యూటీ అషురెడ్డి పెళ్లిపీట‌లు ఎక్క‌బోతుంది. ఎంగేజ్‌మెంట్ చేసుకుంది. ఈ ఎంగేజ్‌మెంట్ ఫొటోల‌ను సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌తో పంచుకుంది. ఇటీవ‌లే ఎన్ఆర్ఐని పెళ్లి పేరుతో మోసం చేసిందంటూ అషురెడ్డిపై చీటింగ్ కేసు న‌మోదు అయ్యింది.

N

Entertainment | Published On May 8, 2026, 5.40 pm IST

Ashu Reddy | ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అషురెడ్డి? – స‌డెన్ షాకిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ – ఫొటోలు వైర‌ల్‌
Advertisement

Ashu Reddy |ధ‌ర్మేంద్ర అనే ఎన్ఆర్ఐని పెళ్లి పేరుతో మోసం చేసిన‌ట్లు బిగ్‌బాస్ బ్యూటీ అషురెడ్డిపై ఇటీవ‌ల కేసు న‌మోదు అయ్యింది. ప్ర‌స్తుతం ఈ కేసు విచార‌ణ‌లో ఉండ‌గానే మ‌రొ వ్య‌క్తితో పెళ్లిపీట‌లు ఎక్క‌బోతుంది అషురెడ్డి. సైలెంట్‌గా ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకుంది ఈ బిగ్‌బాస్ బ్యూటీ. నిశ్చితార్థ వేడుక తాలూకు ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్నాయి. త‌న‌కు కాబోయే భ‌ర్త ఎవ‌ర‌న్న‌ది మాత్రం అషురెడ్డి రివీల్ చేయ‌లేదు.

ఎంగేజ్‌మెంట్ రింగ్‌...

ఇన్‌స్టాగ్రామ్‌లో త‌న నిశ్చితార్థ వేడుక తాలూకు ఫొటోల‌ను అభిమానుల‌తో పంచుకుంది అషురెడ్డి. ఓ ఫొటోలో లంగా వోణీలో త‌న ఎంగేజ్‌మెంట్ రింగ్‌ను చూస్తూ మురిసిపోతూ అషురెడ్డి క‌నిపిస్తోంది. మ‌రో ఫొటోలో కాబోయే భ‌ర్త చేతిని ప‌ట్టుకొని క‌నిపించింది. జీవిత భాగ‌స్వామి వివ‌రాల‌ను మాత్రం రివీల్ చేయ‌లేదు అషురెడ్డి. అత‌డి ఫొటోల‌ను షేర్ చేయ‌లేదు. రెండు రోజుల క్రిత‌మే ఈ నెల 6న అషురెడ్డి ఎంగేజ్‌మెంట్ జ‌రిగిన‌ట్లు ఆమె షేర్ చేసిన ఫొటోల్లో క‌నిపిస్తోంది. ఈ బిగ్‌బాస్ బ్యూటీ పెళ్లి చేసుకోబోతున్న‌ది ఎవ‌రిన‌న్న‌ది టాలీవుడ్ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌రంగా మారింది.
కుటుంబ‌స‌భ్యులు, అతి కొద్ది మంది స‌న్నిహితుల స‌మ‌క్షంలో అషురెడ్డి ఎంగేజ్‌మెంట్ వేడుక‌లు జ‌రిగిన‌ట్లు స‌మాచారం. అభిమానులు ఆమెకు శుభాకాంక్ష‌లు చెబుతున్నారు.

చీటింగ్ కేసు...

ఇటీవ‌లే ధ‌ర్మేంద్ర అనే ఎన్ఆర్ఐని పెళ్లి చేసుకుంటాన‌ని మోసం చేసిందంటూ అత‌డి తండ్రి స‌త్య‌నారాయ‌ణ అషురెడ్డిపై చీటింగ్ కేసు పెట్టారు. త‌మ నుంచి తొమ్మిదిన్న‌ర్ల కోట్లు వ‌సూలు చేసిందంటూ ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వివాదానికి సంబంధించి అషురెడ్డి మాట్లాడిన‌ట్లుగా చెబుతోన్న కొన్ని ఆడియో ఫైల్స్ సోష‌ల్ మీడియాలో తెగ చ‌క్క‌ర్లు కొట్టాయి.

హైకోర్టు షాక్‌...

ధ‌ర్మేంద్ర ఫిర్యాదుపై అషురెడ్డి కూడా హైకోర్టును అశ్ర‌యించింది. త‌నపై నిరాధార‌మైన ఆరోప‌ణ‌లు చేస్తూ ప‌రువుకు భంగం క‌లిగిస్తున్నారంటూ ఫిర్యాదు చేసింది. ఈ కేసు విచార‌ణ‌ను నిలిపివేయాలంటూ కూడా మ‌రో పిటిష‌న్‌ను హైకోర్టులో దాఖ‌లు చేసింది. అషురెడ్డి అభ్య‌ర్థ‌న‌ను హైకోర్టు తోసిపుచ్చింది. పోలీసుల విచార‌ణ‌లో తాము జోక్యం చేసుకోలేమంటూ హైకోర్టు వెల్ల‌డించింది. కోర్టు తీర్పుతో ఈ కేసు విచార‌ణ‌కు అషురెడ్డితో పాటు ఆమె కుటుంబ‌స‌భ్యులు హాజ‌రు కావాల్సిందేన‌ని అంటున్నారు.

బిగ్‌బాస్‌తో పాపుల‌ర్‌...

బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 3లో ఓ కంటెస్టెంట్‌గా పాల్గొన్న‌ది అషురెడ్డి.ఈ షో ద్వారా పాపుల‌ర్ అయ్యింది. ఏవం, త్రిముఖ‌, బాయ్ ఫ్రెండ్ ఫ‌ర్ హైర్‌తో పాటు మ‌రికొన్ని తెలుగు సినిమాల్లో న‌టించింది.

 

Advertisement
Advertisement