త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Suvendu Adhikari | బెంగాల్ తదుప‌రి సీఎంగా సువేందు.. ‘అధికారి’కంగా ప్ర‌క‌టించిన అమిత్ షా

Suvendu Adhikari | ప‌శ్చిమ బెంగాల్ నూత‌న ముఖ్య‌మంత్రిగా బీజేపీ నేత‌ సువేందు అధికారి బాధ్య‌త‌లు చేప‌ట్ట‌బోతున్నారు. నేడు కోల్‌క‌తాలో అమిత్‌షా స‌మ‌క్షంలో జ‌రిగిన‌ బీజేపీ శాస‌న‌స‌భాప‌క్ష స‌మావేశం సువేందును బీజేపీ శాస‌న‌స‌భాప‌క్ష నేత‌గా ఎన్నుకున్నారు. రేపు ఆయ‌న సీఎంగా ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌నున్నారు.

D

National | Published On May 8, 2026, 5.10 pm IST

Suvendu Adhikari | బెంగాల్ తదుప‌రి సీఎంగా సువేందు.. ‘అధికారి’కంగా ప్ర‌క‌టించిన అమిత్ షా
Advertisement

Suvendu Adhikari | ప‌శ్చిమ బెంగాల్‌లో కొత్త ప్ర‌భుత్వం కొలువుదీర‌బోతోంది. ఆ రాష్ట్ర‌ త‌దుప‌రి ముఖ్య‌మంత్రిగా బీజేపీ (BJP) నేత సువేందు అధికారి (Suvendu Adhikari) బాధ్య‌త‌లు చేప‌ట్ట‌బోతున్నారు. సువేందు పేరును కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికారికంగా ప్ర‌క‌టించారు. నేడు కోల్‌క‌తాలో అమిత్‌షా స‌మ‌క్షంలో బీజేపీ శాస‌న‌స‌భాప‌క్ష స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశంలో బీజేపీ శాస‌న‌స‌భాప‌క్ష నేత‌గా సువేందు అధికారి ఎన్నిక‌య్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమిక్ భట్టాచార్య.. సువేందు అధికారి పేరును ప్రతిపాదించగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) బ‌ల‌ప‌రిచారు.

కాగా, తాజా ఎన్నిక‌ల్లో భ‌వానీపూర్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మ‌మ‌తా బెన‌ర్జీపై సువేందు అధికారి పోటీ చేశారు. దీదీపై ఘ‌న విజ‌యం సాధించారు. దీదీని సువేందు ఓడించ‌డం ఇది రెండోసారి. ఇక బెంగాల్ రాష్ట్రంలో క‌మ‌లం పార్టీ తొలిసారి ప్ర‌భుత్వ ఏర్పాటు చేయ‌బోతోంది. దీంతో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన‌ తొలి బీజేపీ నేతగా ఆయన చరిత్ర సృష్టించనున్నారు.

ప్ర‌తిప‌క్షాల కంచుకోటను బీజేపీ (BJP) బ‌ద్ద‌లు కొట్టింది. 15 ఏళ్ల టీఎంసీ పాలనకు కాషాయ పార్టీ ఘనంగా ముగింపు పలికింది. 294 అసెంబ్లీ స్థానాల‌కు గానూ ఏకంగా 206 స్థానాల్లో జ‌య‌భేరి మోగించి అఖండ విజ‌యాన్ని సొంతం చేసుకుంది. ఫ‌లితంగా బెంగాల్‌లో బీజేపీ తొలిసారి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌బోతోంది. నోబెల్ బ‌హుమ‌తి గ్ర‌హీత ర‌వీంద్ర‌నాథ్ ఠాగూర్ (Rabindranath Tagore) జ‌యంతిని పురస్కరించుకుని మే 9వ తేదీన కోల్‌క‌తాలో ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఆ రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు స‌మిక్ భ‌ట్టాచార్య‌ (Samik Bhattacharya) ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు.

Also Read..

ఆరుట్ల పాఠశాల తెలంగాణ విద్యా విధానానికి రోల్ మోడల్

జన నాయగన్ రెమ్యూనరేష‌న్లు....ద‌ళ‌ప‌తి విజయ్ 220 కోట్లు..పూజా హెగ్డేకు మాత్రం మూడు కోట్లేన‌ట‌!

స్థానిక సంస్థలు ఆదాయ వనరులు పెంచుకోవాలి : ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ రాజయ్య సిరిసిల్ల

Advertisement
Advertisement