Vijay | తమిళనాడు సీఎంగా విజయ్.. 10 గంటలకు ప్రమాణ స్వీకారం
Vijay | తమిళనాడులో (Tamil Nadu) ఎట్టకేలకు రాజకీయ ఉత్కంఠకు తెరపడింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా (chief minister) టీవీకే చీఫ్ సీ.జోసెఫ్ విజయ్ (Vijay) నియమితులయ్యారు. ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకారం (Swearing Ceremony) చేయనున్నారు.
Vijay | త్రినేత్ర.న్యూస్: తమిళనాడులో (Tamil Nadu) ఎట్టకేలకు రాజకీయ ఉత్కంఠకు తెరపడింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా (chief minister) టీవీకే చీఫ్ సీ.జోసెఫ్ విజయ్ (Vijay) నియమితులయ్యారు. ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకారం (Swearing Ceremony) చేయనున్నారు. దీనికోసం చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ముస్తాబయ్యింది. సీఎం సహా కొందరు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో 1967 తర్వాత డీఎంకే, అన్నాడీఎంకే ఏతర తొలి ముఖ్యమంత్రిగా విజయ్ నిలిచారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ నెల 4న వెలువడిన విషయం తెలిసిందే. మొత్తం 234 సీట్లకు విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే మెజార్టీ మార్కుకు 10 సీట్ల దూరంలో నిలిచిపోయింది. ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ రాకపోవడం, విజయ్‌కి మద్దతిచ్చేందుకు కాంగ్రెస్ మినహా మిగిలిన పార్టీలు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్ఠంభన ఏర్పడింది. తన పార్టీతోపాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను గవర్నర్ ఆర్లేకర్‌కు విజయ్ సమర్పించగా సరైన సంఖ్యా బలం లేదంతూ ఆయన తిరస్కరించారు. దీంతో మ్యాజిక్ ఫిగర్‌ను క్రాస్ చేసేందుకు కమ్యూనిస్టులతోపాటు డీఎంకే కూటమిలోని వీసీకే, ఐయూఎంఎల్‌కు టీవీకే లేఖ రాసింది. తీవ్ర తర్జనల భర్జనల నడుమ ఆ నాలుగు పార్టీలు విజయ్‌కి మద్దతు ప్రకటించాయి. దీంతో టీవీకేను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానానికి మూడు సార్లు తిరస్కరించిన గవర్నర్.. చివరికి శనివారం సాయంత్రం ఓకే చేశారు.
ఎట్టకేలకు వీడిన ఉత్కంఠ
తనకు మద్దతిచ్చే పార్టీల సమ్మతి లేఖలతో నాలుగోసారి గవర్నర్ ఆర్లేకర్‌ను కలిసిన విజయ్ శనివారం సాయంత్రం కలిశారు. సుమారు గంటన్నరపాటు చర్చల అనంతరం ‘రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 ప్రకారం విజయ్‌ను ముఖ్యమంత్రిగా నియమిస్తున్నాను’ అంటూ విజయ్‌కు గవర్నర్ ఉత్తర్వు ప్రతిని అందించారు. ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకునేలా అనుమతిచ్చారు. ఈ నెల 13 నాటికి అసెంబ్లీలో బలనిరూపణ ద్వారా మెజారిటీ చూపాలని విజయ్‌కి గడువిచ్చారు.
చర్చోపచర్చలు
108 స్థానాలు దక్కించుకున్న టీవీకే.. సీపీఐ, సీపీఎం, వీసీకే, ఐయూఎంఎల్ పార్టీలతో చర్చోపచర్చల తర్వాత శనివారం మధ్యాహ్నానినికి మ్యాజిక్ ఫిగర్ (118) దాటి 120 మంది ఎమ్మెల్యేల బలాన్ని కూడగట్టుకుంది. విజయ్ పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ రెండు స్థానాల్లో గెలవడంతో ఒకే వ్యక్తిగా లెక్కించడంతో టీవీకే వాస్తవబలం 107గా ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ 5, సీపీఐ 2, సీపీఎం 2, వీసీకే 2, ఐయూఎంఎల్ 2 సీట్లతో ప్రభుత్వ ఏర్పాటుకు సహకరిస్తామని లేఖ ఇచ్చింది. దీంతో విజయ్ బలం 120కి పెరిగింది. కాంగ్రెస్ మినహా మిగిలిన పార్టీలన్నీ బయటి నుంచి మద్దతిస్తూ డీఎంకే కూటమిలోనే కొనసాగనున్నాయి.
93 మంది తొలిసారి ఎన్నిక
కాగా, టీవీకే గెలుపొందిన 107 మందిలో విజయ్ సహా 93 మంది తొలిసారి గెలుపొందినవారే కావడం గమనార్హం. ఇక ఆ పార్టీ ఎమ్మెల్యేల సరాసరి వయస్సు 45 ఏండ్లు. 40 ఏండ్ల లోపువారు 41 మంది ఉండగా, 60, ఆపై వయస్స్కులు 10 మాత్రమే ఉన్నారు. ఇక అతిపిన్న వయస్సు 28 ఏండ్లు.

సంబంధిత వార్తలు

Vijay Cabinet | విజయ్ సర్కార్ కేబినెట్ విస్తరణ.. 23 మంది కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం
మే 21, 2026

Niranjan Reddy | గోదావరి – కావేరి అనుసంధానానికి ఎలా ఒప్పుకుంటారు?: మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి
మే 21, 2026

TVK | రెబల్ ఎమ్మెల్యేలకు కేబినెట్లో చోటు.. సీపీఎం హెచ్చరికలతో ప్రచారానికి చెక్‌పెట్టిన టీవీకే
మే 20, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



