త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vijay | త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రిగా విజ‌య్ ప్ర‌మాణ స్వీకారం..

Vijay | తమిళనాడు (Tamil Nadu) ముఖ్యమంత్రిగా సినీ నటుడు చంద్రశేఖర్‌ జోసెఫ్ విజయ్ (Vijay) ప్రమాణస్వీకారం చేశారు. చెన్నైలోని జవహర్‌లాల్‌ నెహ్రూ ఇండోర్‌ స్టేడియంలో విజయ్‌తో గవర్నర్‌ రాజేంద్ర ఆర్లేకర్ సీఎంగా విజ‌య్‌తో  ప్రమాణం చేయించారు.

G

National | Published On May 10, 2026, 10.26 am IST

Vijay | త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రిగా విజ‌య్ ప్ర‌మాణ స్వీకారం..
Advertisement

Vijay | త్రినేత్ర‌.న్యూస్‌: తమిళనాడు (Tamil Nadu) ముఖ్యమంత్రిగా సినీ నటుడు చంద్రశేఖర్‌ జోసెఫ్ విజయ్ (Vijay) ప్రమాణస్వీకారం చేశారు. చెన్నైలోని జవహర్‌లాల్‌ నెహ్రూ ఇండోర్‌ స్టేడియంలో విజయ్‌తో గవర్నర్‌ రాజేంద్ర ఆర్లేకర్ సీఎంగా విజ‌య్‌తో  ప్రమాణం చేయించారు. ఆయ‌న‌తోపాటు తొమ్మిది మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.

విజయ్‌ ప్రమాణస్వీకారోత్సవానికి కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​గాంధీ, విజ‌య్ త‌ల్లిదండ్రులు, రాయ‌కీయ, సినీ ప్ర‌ముఖులు హాజరయ్యారు. ఈ కార్య‌క్ర‌మంలో సినీన‌టి త్రిష ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. స్టేడియం న‌లుదిక్కులా అభిమానుల‌కు చేయి ఊపుతూ అభివాదం చేశారు. పెద్ద సంఖ్య‌లో అభిమానులు త‌ర‌లిరావ‌డంతో స్టేడియం వ‌ద్ద కోలాహ‌లం నెల‌కొన్న‌ది.

కాగా, నాలుగు రోజుల ఉత్కంఠ తర్వాత టీవీకేకు మద్దతు ప్రకటిస్తూ గ‌వ‌ర్న‌ర్‌కు వీసీకే లేఖ అందించింది. కాసేప‌టికే ఐఎంయూఎల్​ కూడా విజయ్‌కు మద్దతు ప్రకటించింది. దీంతో కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే, ఐఎంయూఎల్​ మద్దతుతో టీవీకే బలం 120కి చేరింది. శ‌నివారం సాయంత్రం గవర్నర్‌ను కలిసిన విజయ్ మ‌ద్ద‌తు లేఖలు సమర్పించారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇచ్చిన గవర్నర్‌, తమిళనాడు సీఎంగా విజయ్‌ను నియమిస్తూ లేఖ ఇచ్చారు. ఈ నేప‌థ్యంలో తమిళనాడులో 69 ఏండ్ల తర్వాత డీఎంకే, అన్నాడీఎంకే ఏతర ప్రభుత్వం కొలువుదీరింది.

9 మంది మంత్రులు వీరే..

ఇక విజయ్‌తో పాటు మరో తొమ్మిది మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వారిలో ఏడుగురు టీవీకే, ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ జాబితాలో ఒక మహిళ కూడా ఉన్నారు.

ఎన్. ఆనంద్, ఆదవ అర్జున, కేఏ. సెంగోటియన్, ఎస్‌. కీర్తన, కేజీ. అరుణ్‌ రాజ్, పీ. వెంకటరమణన్, సీఆర్‌. నిర్మల్ కుమార్, రాజ్‌మోహన్, టీకే. ప్రభు మంత్రులుగా ప్ర‌మాణం చేశారు. దీంతో మంత్రివ‌ర్గంలో అతిపిన్న వ‌య‌స్కురాలిగా కీర్త‌న రికార్డుల్లో నిలిచారు.

Advertisement
Advertisement