త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sarampally Malla Reddy | రైతు సంఘం నేత సారంపల్లి మల్లారెడ్డి కన్నుమూత.. హ‌రీశ్ రావు, కూనంనేని సంతాపం

Sarampally Malla Reddy | రైతు సంఘం నేత సారంపల్లి మల్లారెడ్డి (Sarampally Malla Reddy) కన్నుమూశారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న‌ హైదరాబాద్‌ నిమ్స్ ద‌వాఖాన‌లో చికిత్సపొందుతూ తుది శ్వాస విడిచారు.

G

Telangana | Published On Aug 24, 2026, 10.11 am IST

Sarampally Malla Reddy | రైతు సంఘం నేత సారంపల్లి మల్లారెడ్డి కన్నుమూత.. హ‌రీశ్ రావు, కూనంనేని సంతాపం
Advertisement

Sarampally Malla Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: రైతు సంఘం నేత సారంపల్లి మల్లారెడ్డి (Sarampally Malla Reddy) కన్నుమూశారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న‌ హైదరాబాద్‌ నిమ్స్ ద‌వాఖాన‌లో చికిత్సపొందుతూ తుది శ్వాస విడిచారు. అభిమానుల సందర్శనార్ధం మంగళవారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం వరకు ఎంబీ భవన్‌లో మల్లారెడ్డి పార్థివదేహాన్ని ఉంచనున్నారు. మల్లారెడ్డి స్వస్థలం వరంగల్‌ జిల్లా నర్సంపేట. అఖిల భారత కిసాన్ సభ ఉపాధ్యక్షుడిగా ఉన్న మల్లారెడ్డి, దశాబ్దాలుగా రైతుల సమస్యలపై పోరాడారు.

నిబ‌ద్ధ‌త గ‌ల క‌మ్మూనిస్టు నాయ‌కుడు..

సీపీఎం సీనియర్ నాయకులు, అఖిల భారత రైతు సంఘం (Rythu Sangam) నాయకులు సారంపల్లి మల్లారెడ్డి మృతి పట్ల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (Kunamneni Sambasiva Rao) సంతాపం తెలిపారు. ఆయ‌న అన్ని అంశాలపై పట్టు ఉన్న మేధావి అని, ముఖ్యంగా వ్యవసాయం, సాగునీటి ప్రాజెక్టులపై పూర్తి అవగాహన ఉంద‌ని చెప్పారు. మ‌ల్లారెడ్డి నిబద్ధత గల కమ్యూనిస్టు నాయకుడ‌న్నారు. ఆయ‌న‌ మరణం కమ్యూనిస్టు ఉద్యమానికి, రైతాంగ ఉద్యమానికి తీరని లోటని వెల్ల‌డించారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు త‌న‌కు గాని, జూలకంటి రంగారెడ్డిని గాని, కమ్యూనిస్టులు ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు తన సూచనలు, సలహాలు ఎంతగానో ఉపయోగపడేవని చెప్పారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

స్ఫూర్తినిచ్చే మ‌ల్లారెడ్డి పోరాటం

కమ్యూనిస్టు ఉద్యమంలో సీనియర్ నాయకుడిగా, రైతు సమస్యలపై నిరంతరం పోరాడిన రైతు సంఘం నాయకుడిగా సారంపల్లి మల్లారెడ్డి చేసిన సేవలు చిరస్మరణీయమని బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్ రావు (Harish Rao) అన్నారు. ఆయ‌న మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. రైతుల హక్కులు, సంక్షేమం కోసం ఆయన జీవితాంతం చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ప్రజా ఉద్యమాల్లో ఆయన పోషించిన కీలక పాత్రను ఎప్పటికీ గుర్తుంచుకుంటామన్నారు. మల్లారెడ్డి కుటుంబ సభ్యులకు, అభిమానులకు, సహచరులకు త‌న ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

Advertisement
Advertisement