త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TTD | 8.34 ల‌క్ష‌ల మంది భ‌క్తుల‌కు వైకుంఠ ద్వార దర్శనం.. టీటీడీ వెల్ల‌డి

TTD | డిసెంబర్ 20 నుంచి 29 వరకు 8.34 లక్షల మంది భక్తులకు దర్శనం కల్పించేలా టీటీడీ ప్రణాళికలు సిద్ధం చేసింది. భక్తుల సౌకర్యం, ఉద్యోగుల సంక్షేమం, వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

S

National | Published On Nov 19, 2026, 9.00 am IST

TTD | 8.34 ల‌క్ష‌ల మంది భ‌క్తుల‌కు వైకుంఠ ద్వార దర్శనం.. టీటీడీ వెల్ల‌డి
Advertisement

TTD | త్రినేత్ర న్యూస్ : డిసెంబర్ 20 నుంచి 29 వరకు 8.34 లక్షల మంది భక్తులకు దర్శనం కల్పించేలా టీటీడీ ప్రణాళికలు సిద్ధం చేసింది. భక్తుల సౌకర్యం, ఉద్యోగుల సంక్షేమం, వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

వైకుంఠ ఏకాద‌శికి సామాన్య భ‌క్తుల‌కు శ్రీ‌వారి ద‌ర్శనం క‌ల్పించేందుకు వైకుంఠ ఏకాద‌శి, ద్వాద‌శి రోజుల‌కు సంబంధించి ఎస్‌ఎస్‌డీ టోకెన్లను ఆన్‌లైన్‌లో విడుద‌ల చేస్తామన్నారు. తొలి రెండు రోజులు స‌ర్వ ద‌ర్శనం ఉండ‌దని, త‌ర్వాత 8 రోజులు భ‌క్తుల‌కు స‌ర్వ ద‌ర్శనం అమ‌లు చేస్తామని వివరించారు.

అలిపిరి ఎస్.వి. జూ పార్క్ రోడ్డుకు స‌మీపంలోని టీటీడీ స్థలంలో రూ.2,750 కోట్ల శ్రీవాణి ట్రస్ట్ నిధులతో నిర్మించ‌నున్న యాత్రికుల టౌన్‌షిప్ కోసం డీపీఆర్, డిజైన్ల తయారీ, ప్రాజెక్టు పర్యవేక్షణ కోసం కన్సల్టెన్సీ సంస్థను ఎంపిక చేయ‌నున్నారు. టీటీడీ ఉద్యోగుల‌కు ఇంటి స్థలాలు కేటాయింపులో భాగంగా సీనియారిటీ జాబితా 2007 ఆధారంగా ఫేజ్-IIIలో రిటైర్డ్ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి వారసులకు పల్లం గ్రామంలో ప్లాట్లు కేటాయించడానికి ఆమోదం తెలిపారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ కార్యదర్శి కె. కన్నబాబు, ఆర్థిక శాఖ కార్యదర్శి వి. వినయ్‌చంద్, టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి, జేఈవోలు ,పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement