US Green Card Rules | అమెరికా గ్రీన్ కార్డ్ ఆశావహులకు భారీ షాక్.. స్వదేశానికే వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి
అమెరికాలో ఉంటూనే గ్రీన్ కార్డ్ కోసం అప్లై చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ కొత్త రూల్స్ మీకోసమే. హెచ్1బీ, స్టూడెంట్ వీసాదారులకు యూఎస్‌సీఐఎస్ భారీ షాక్ ఇచ్చింది.
International | Published On May 23, 2026, 4.31 pm IST
- ఇకపై అమెరికాలో ఉంటూ గ్రీన్ కార్డ్ (Adjustment of Status) కు దరఖాస్తు చేసుకోవడం కష్టం
- తాత్కాలిక వీసాలపై (స్టూడెంట్, టూరిస్ట్, వర్క్) ఉన్నవారు తమ సొంత దేశం నుంచే గ్రీన్ కార్డ్ కోసం అప్లై చేసుకోవాలి
- కేవలం అత్యవసర, అసాధారణ (extraordinary) పరిస్థితుల్లో మాత్రమే యూఎస్‌సీఐఎస్ అమెరికా నుంచి దరఖాస్తుకు అనుమతిస్తుంది
- వీసా గడువు ముగిశాక ఇల్లీగల్‌గా అమెరికాలో ఉండిపోయే వారిని (overstays) తగ్గించడానికే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు అధికారుల స్పష్టీకరణ
US Green Card Rules | త్రినేత్ర.న్యూస్ : అమెరికాలో స్థిరపడాలని కలలు కంటున్న భారతీయులకు, ముఖ్యంగా విద్యార్థులు, తాత్కాలిక ఉద్యోగులకు అమెరికా పౌరసత్వ, వలసల సేవల సంస్థ (USCIS) భారీ షాక్ ఇచ్చింది. గ్రీన్ కార్డ్ (Green Card) లేదా శాశ్వత నివాసం (Permanent residency) దరఖాస్తు విధానంలో కీలక మార్పులు చేస్తూ కొత్త పాలసీని ప్రకటించింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం.. ఇకపై అమెరికాలో ఉంటూ గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి వీల్లేదు. దరఖాస్తుదారులు తిరిగి తమ సొంత దేశానికి వెళ్లి, అక్కడి నుంచే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
'అడ్జస్ట్‌మెంట్ ఆఫ్ స్టేటస్' కు బ్రేక్
గతంలో స్టూడెంట్, టూరిస్ట్, వర్క్ వీసాలపై (Temporary visas) అమెరికాలో ఉన్నవారు.. ఇక్కడే ఉంటూ 'అడ్జస్ట్‌మెంట్ ఆఫ్ స్టేటస్' (Adjustment of Status - AOS) అనే ప్రక్రియ ద్వారా గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండేది. లక్షలాది మంది వలసదారులు ఈ విధానాన్నే ఆశ్రయించేవారు.
కానీ, తాజా పాలసీతో ఈ ప్రాసెస్‌కు బ్రేక్ పడింది. ఇకపై AOS ను "ఎక్స్‌ట్రార్డినరీ ఫామ్ ఆఫ్ రిలీఫ్" (extraordinary form of relief) గా పరిగణిస్తామని USCIS స్పష్టం చేసింది. అంటే, కేవలం అత్యంత అరుదైన, అత్యవసర కేసుల్లో మాత్రమే అమెరికా నుంచి దరఖాస్తు చేసుకునేందుకు అనుమతి ఇస్తారు.
ఎవరిపై ప్రభావం పడుతుంది?
తాజా నిర్ణయంతో తాత్కాలిక నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాలపై ఉన్న ప్రతి ఒక్కరిపైనా ప్రభావం పడనుంది. ఉన్నత చదువుల కోసం వెళ్లిన స్టూడెంట్స్ (F1 Visa), హెచ్1బీ (H1B) లాంటి వర్క్ వీసాలపై ఉన్న ఉద్యోగులు, టూరిస్టులు.. వీరంతా తమ వీసా గడువు ముగియగానే స్వదేశానికి తిరిగి వెళ్లాల్సిందే. గ్రీన్ కార్డ్ కావాలంటే సొంత దేశంలోని అమెరికన్ కాన్సులేట్ (US Consulate) ద్వారానే డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ కు అప్లై చేసుకోవాలి.
ఈ మార్పు ఎందుకు చేశారు?
వీసా గడువు ముగిసిన తర్వాత కూడా ఇల్లీగల్‌గా అమెరికాలో ఉండిపోయే వారి (Illegal Overstays) సంఖ్యను అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు USCIS ప్రతినిధి జాక్ కహ్లెర్ తెలిపారు. వలస చట్టాల అసలు ఉద్దేశాన్ని కాపాడేందుకే ఈ మార్పులు చేశామన్నారు.
"చాలామంది గ్రీన్ కార్డ్ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యాక, తిరిగి వెళ్లకుండా అమెరికాలోనే అక్రమంగా తలదాచుకుంటున్నారు. ఇలాంటి వారిని గుర్తించి వెనక్కి పంపడం ఇమ్మిగ్రేషన్ అధికారులకు సవాలుగా మారింది. ఇకపై అలాంటి లొసుగులకు (loopholes) తావు లేదు." అని USCIS ప్రతినిధి జాక్ కహ్లెర్ స్పష్టం చేశారు.
దరఖాస్తులను విదేశాల్లోని కాన్సులేట్లకు మళ్లించడం ద్వారా.. మానవ అక్రమ రవాణా బాధితులు, సిటిజన్‌షిప్ దరఖాస్తులు లాంటి ఇతర ముఖ్యమైన ప్రాధాన్యతలపై దృష్టి సారించే అవకాశం USCIS కు దొరుకుతుందని అధికారులు భావిస్తున్నారు.
దీనిపై డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (Homeland Security) కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించింది. "తాత్కాలిక వీసాలపై ఉన్నవారు గ్రీన్ కార్డ్ కావాలంటే సొంత దేశానికి వెళ్లి తీరాలి. మన దేశ ఇమ్మిగ్రేషన్ సిస్టమ్‌ను దుర్వినియోగం చేసే రోజులు ఇక పోయాయి" అని ఘాటుగా ట్వీట్ చేసింది.
An alien who is in the U.S. temporarily and wants a Green Card must return to their home country to apply.
This policy allows our immigration system to function as the law intended instead of incentivizing loopholes.
The era of abusing our nation’s immigration system is over. https://t.co/ofyEYGPDLC
— Homeland Security (@DHSgov) May 22, 2026
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Yellamma First Look | పర్షి వచ్చేశాడు - ఎల్లమ్మ మూవీ నుంచి దేవిశ్రీప్రసాద్ ఫస్ట్ లుక్ రిలీజ్
- ●Tanvi Sharma | తైపీ ఓపెన్‌లో తన్వి శర్మ సంచలనం.. 17 ఏళ్లకే చరిత్ర సృష్టించిన భారత షట్లర్
- ●IND Vs SL | బుమ్రా ఫిట్..! టీమిండియాకు ఊరట..
- ●Bandi Sanjay | రేవంత్‌ను ఎదురించాల్సిందే.. బండి సంజయ్ పిలుపు
- ●RTC Retired Employees Association | ఈనెల 4న రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల చలో బస్సు భవన్
- ●Explosion in Moscow restaurant | మాస్కోలోని రెస్టారెంట్లో పేలుడు.. ముగ్గురు మృతి

Yellamma First Look | పర్షి వచ్చేశాడు - ఎల్లమ్మ మూవీ నుంచి దేవిశ్రీప్రసాద్ ఫస్ట్ లుక్ రిలీజ్

Tanvi Sharma | తైపీ ఓపెన్‌లో తన్వి శర్మ సంచలనం.. 17 ఏళ్లకే చరిత్ర సృష్టించిన భారత షట్లర్

IND Vs SL | బుమ్రా ఫిట్..! టీమిండియాకు ఊరట..

Bandi Sanjay | రేవంత్‌ను ఎదురించాల్సిందే.. బండి సంజయ్ పిలుపు





