Sugar Exports | చక్కెర ఎగుమతులపై నిషేధం.. ఆ రెండు దేశాలకు మినహా..
Sugar Exports | కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకున్నది. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల నేపథ్యంలో చమురు వినియోగాన్ని తగ్గించాలని, ఖర్చులు తగ్గించుకుని పొదుపు చర్యలు పాటించాలని ప్రధాని మోదీ దేశ ప్రజలకు ఇటీవల సూచించారు.
Sugar Exports | త్రినేత్ర.న్యూస్: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకున్నది. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల నేపథ్యంలో చమురు వినియోగాన్ని తగ్గించాలని, ఖర్చులు తగ్గించుకుని పొదుపు చర్యలు పాటించాలని ప్రధాని మోదీ దేశ ప్రజలకు ఇటీవల సూచించారు. బుధవారం నుంచి ప్రధాని దానిని అమలు చేస్తున్నారు. తన కాన్వాయ్‌ని రెండు వాహనాలకు కుదించుకున్నారు. తాజాగా చక్కెర ఎగుమతులపై (Sugar Exports) కేంద్ర ప్రభుత్వం నిషేధం (Ban) విధించింది. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. సెప్టెంబర్ వరకు ఎగుమతులపై నిషేధం విధించిస్తున్నట్లు ప్రకటించింది. దేశీయ మార్కెట్‌లో చక్కెర ధరలు పెరగకుండా, సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అమెరికా, యూరప్‌కు ఇది వర్తించబోదని తెలిపింది.

దేశవ్యాప్తంగా ఎందలు దంచికొడుతుండటం, వర్షాభావ పరిస్థితులతో పంట ఉత్పత్తి తగ్గింది. దీంతో నిల్వలు పడిపోతుండటంతో దేశీయ మార్కెట్‌లో ధరలు పెరుగుతున్నాయి. వచ్చేది పండుగల సీజన్ కావడంతో వినియోగం అధికమై ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు చర్యల్లో భాగంగా ముడి, తెల్ల, శుద్ధి చేసిన చక్కెర ఎగుమతులను నిలిపివేసింది.
ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు లేదా తదుపరి ఆదేశాలు జారీ అయ్యేవరకు ఈ నిషేధం కొనసాగుతుందని తెలిపింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ పరిధిలోని విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఈ ఉత్తర్వులకు ముందే లోడింగ్ ప్రారంభమైనా, చక్కెర నిల్వలను కస్టమ్స్‌కు అప్పగించినా వాటి ఎగుమతులకు అనుమతిస్తామని వెల్లడించింది.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






