ACB Raids | జలమండలి మేనేజర్ కుమార్ నివాసంలో ఏసీబీ సోదాలు.. భారీగా నగదు, ఆస్తులు..!
ACB Raids | హైదరాబాద్ జలమండలి (jalmandali) జనరల్ మేనేజర్ కుమార్ నివాసంలో ఏసీబీ సోదాలు (ACB Raids) నిర్వహిస్తున్నది. మంగళవారం తెల్లవారుజాము నుంచి మల్లాపూర్‌లోని ఆయన నివాసంలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు.
ACB Raids | త్రినేత్ర.న్యూస్: హైదరాబాద్ జలమండలి (jalmandali) జనరల్ మేనేజర్ కుమార్ నివాసంలో ఏసీబీ సోదాలు (ACB Raids) నిర్వహిస్తున్నది. మంగళవారం తెల్లవారుజాము నుంచి మల్లాపూర్‌లోని ఆయన నివాసంలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఆయన బంధువుల ఇండ్లల్లోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి సహా మొత్తం 8 ప్రాంతాల్లో అధికారులు ఏక కాలంలో దాడులు నిర్వహించారు,
ఇప్పటి వరకు దాదాపు రూ.కోటి నగదు గుర్తించారు. కుమార్‌కు పలు ప్రాంతాల్లో ఉన్న స్థిరాస్తులను గుర్తించిన అధికారులు, వాటికి సంబంధించిన పత్రాలను పరిశీలిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తనిఖీలు చేస్తున్నట్టు సమాచారం.
ఈ తనిఖీల్లో భారీగా అక్రమాస్తులు గుర్తించారు. అతడికి రూ.100 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. కుమార్ నివాసంతో పాటు ఆయన బంధువుల ఇంట్లో సైతం సోదాలు చేపట్టి తనిఖీలు చేస్తున్నారు.
కిలో బంగారం స్వాధీనం..
సోదాల సమయంలో జీఎం కుమార్ ఇంట్లో అక్రమాస్తులను చూసి అధికారులు షాక్ అయ్యారు. అతడి నివాసంలో రూ.1.10 కోట్ల నగదు, సుమారు కిలో బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అతడికి హైదరాబాద్ గేటెడ్ కమ్యూనిటీలో 3 ఫ్లాట్స్, 6 ఓపెన్ ప్లాట్లు ఉన్నట్లు గుర్తించారు. నిజామాబాద్ (Nizamabad)లో 3 ఎకరాల భూమి ఉన్నట్లు తెలిపారు. ఇంకా పలు బ్యాంక్‌ల్లో లాకర్లు ఉన్నట్లు పేర్కొన్నారు. బ్యాంక్ లాకర్లు ఓపెన్ చేస్తే మరిన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
సంబంధిత వార్తలు

Saggam Anantha Laxmi Kumar | వాటర్ ట్యాంకర్లతో వంద కోట్ల స్కామ్: రోజుకు 50 వేల సంపాదన.. ఏసీబీ వలలో జలమండలి రెడ్ హిల్స్ జీఎం ఆస్తుల చిట్టా
మే 19, 2026

HMWSSB | జలమండలిలో ఎలాంటి నియామకాల్లేవు.. అది అసత్య ప్రచారమే..
మే 19, 2026

HMWSSB | వారణాసి నిర్మాతలకు జలమండలి ‘నో’.. సందిగ్ధంలో సినిమా యూనిట్!
మే 3, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



