త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Cyber Fraud | బీజేపీ ఎమ్మెల్యే ఖాతా నుంచి రూ.1.50 ల‌క్ష‌లు మాయం

Cyber Fraud | ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే (BJP MLA) పూజా పాల్ (Pooja Pal) సైబ‌ర్ మోస‌గాళ్ల బారిన ప‌డ్డారు. ఆమె ఖాతా నుంచి కేటుగాళ్లు సుమారు రూ.1,55,000 న‌గ‌దు కాజేశారు.

D

National | Published On Sep 19, 2026, 5.06 pm IST

Cyber Fraud | బీజేపీ ఎమ్మెల్యే ఖాతా నుంచి రూ.1.50 ల‌క్ష‌లు మాయం
Advertisement

Cyber Fraud | త్రినేత్ర‌.న్యూస్ : దేశవ్యాప్తంగా సైబర్‌ నేరాలు (Cyber Fraud) విప‌రీతంగా పెరిగిపోయాయి. రోజుకో తరహా స్కామ్‌తో సైబర్‌ నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. డిజిటల్ అరెస్టు వంటి సైబర్ నేరాలపై ప్రభుత్వాలు ఎంతగా అవగాహన కల్పిస్తున్నా ప్ర‌జ‌లు ప‌దేప‌దే మోస‌పోతూనే ఉన్నారు. సామాన్య ప్ర‌జ‌ల‌తోపాటూ ప‌లువురు రాజ‌కీయ‌, సినీ ప్ర‌ముఖులు కూడా సైబ‌ర్ ఉచ్చులోప‌డి రూ.ల‌క్ష‌లు, రూ.కోట్లు పోగొట్టుకున్న ఉదంతాలు అనేకం వెలుగుచూశాయి.

తాజాగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్ కౌశంబీ జిల్లాలోని చైల్ నియోజ‌క‌వ‌ర్గ బీజేపీ ఎమ్మెల్యే (BJP MLA) పూజా పాల్ (Pooja Pal) సైబ‌ర్ మోస‌గాళ్ల బారిన ప‌డ్డారు. ఆమె ఖాతా నుంచి కేటుగాళ్లు సుమారు రూ.1,55,000 న‌గ‌దు కాజేశారు. ఆగ‌స్టు 22 నుంచి సెప్టెంబ‌ర్ 13 మ‌ధ్య ఫోన్‌పే, యూపీఐ ద్వారా ఆమె ప్ర‌మేయం లేకుండానే విడ‌త‌ల‌వారీగా న‌గ‌దు డ్రా చేశారు. ఈనెల 14న త‌న ఖాతా నుంచి న‌గ‌దు బ‌దిలీ అవుతున్నట్లు గుర్తించిన ఆమె త‌న‌ బ్యాంకు స్టేట్‌మెంట్‌ను ప‌రిశీలించారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతా నుంచి త‌న ప్రేమ‌యం లేకుండానే పెద్ద మొత్తంలో న‌గ‌దు లావాదేవీలు జ‌రిగిన‌ట్లు గుర్తించింది.

అప్ర‌మ‌త్త‌మైన ఎమ్మెల్యే వెంట‌నే పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఐఫోన్ 17ను ఎవరో హ్యాక్ చేసి ఈ అనధికార లావాదేవీలు నిర్వహించి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఫోన్‌పే, యూపీఐ లావాదేవీల‌పై ద‌ర్యాప్తు చేయాల‌ని సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌ను కోరారు. త‌న మొబైల్ ఫోన్‌కు టెక్నిక‌ల్ ఆడిట్ నిర్వ‌హించ‌డంతోపాటూ అన్ని ట్రాన్సాక్ష‌న్ ఐడీలు, బ్యాంకు ఖాతాల స‌మాచారాన్ని ప‌రిశీలించాల‌ని ఫిర్యాదులో విజ్ఞ‌ప్తి చేశారు. ఎమ్మెల్యే ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. సైబర్ సెల్ సహకారంతో పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

Also Read..

భార్య‌కు బిజినెస్ టూర్ అని చెప్పి ప్రియురాలితో విదేశీ ట్రిప్‌.. ఎయిర్‌పోర్టులో వ్యాపారికి ఊహించిన షాక్‌

ఫిరంగి నాళాను ఆక్ర‌మించి జన్వాడ ఫామ్‌హౌస్ క‌ట్టారు

లావా బోల్డ్ ఎన్4 ప్రొ 5జి.. రూ.13,999కే.. 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ..

Advertisement
Advertisement