త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Special Trains | పండుగ వేళ ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. చర్లపల్లి–శ్రీకాకుళం మధ్య ప్రత్యేక రైళ్లు

Special Trains | పండుగల వేళ సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే తీపికబురు చెప్పింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని చర్లపల్లి–శ్రీకాకుళం రోడ్‌ మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. మొత్తం 16 రైళ్లు ప్ర‌యాణికుల‌కు అందుబాటులో ఉంటాయ‌ని తెలిపింది.

P

Telangana | Published On Sep 19, 2026, 4.40 pm IST

Special Trains | పండుగ వేళ ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. చర్లపల్లి–శ్రీకాకుళం మధ్య ప్రత్యేక రైళ్లు
Advertisement

Special Trains | పండుగల వేళ సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే తీపికబురు చెప్పింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని చర్లపల్లి–శ్రీకాకుళం రోడ్‌ మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. మొత్తం 16 రైళ్లు ప్ర‌యాణికుల‌కు అందుబాటులో ఉంటాయ‌ని తెలిపింది. 07037 నంబర్‌ రైలు చర్లపల్లి నుంచి శ్రీకాకుళం రోడ్‌కు ప్రతి మంగళవారం నడుస్తుంది. అక్టోబర్‌ 6, 13, 20, 27 తేదీలతో పాటు నవంబర్‌ 3, 10, 17, 24 తేదీల్లో రైలు రాక‌పోక‌లు సాగిస్తుంది. అదేవిధంగా 07038 నంబర్‌ రైలు శ్రీకాకుళం రోడ్‌ నుంచి చర్లపల్లికి ప్రతి బుధవారం నడుస్తుంది. అక్టోబర్‌ 7, 14, 21, 28, నవంబర్‌ 4, 11, 18, 25 తేదీల్లో ఈ ప్రత్యేక రైలు సేవలు అందించనుంది. ఈ రైలు నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు జంక్షన్, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ, సింహాచలం, కొత్త‌వలస, విజయనగరం, చీపురుపల్లి స్టేషన్లలో ఆగుతుంద‌ని వివ‌రించింది. ప్రత్యేక రైళ్లలో ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్, స్లీపర్‌ క్లాస్, జనరల్‌ సెకండ్‌ క్లాస్‌ కోచ్‌లు అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. పూజా పండుగల సందర్భంగా పెరిగే రద్దీని దృష్టిలో పెట్టుకుని అద‌నంగా ఈ ప్ర‌త్యేక రైళ్ల‌ను న‌డిపిస్తున్న‌ట్లు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే పేర్కొంది. ఆయా రైళ్ల సేవ‌ల‌ను ఉప‌యోగించుకోవాల‌ని సూచించింది.

Advertisement
Advertisement