MP Chamala Kirankumar Reddy | ఫిరంగి నాళాను ఆక్రమించి జన్వాడ ఫామ్‌హౌస్ కట్టారు
MP Chamala Kirankumar Reddy | జన్వాడ ఫామ్‌హౌస్ 111 జీవో పరిధిలో ఉందని.. ఫిరంగి నాళాను ఆక్రమించి ఫామ్‌హౌస్‌ను కట్టారని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. 111 జీవోలో ఉన్న సత్యం రామలింగరాజు కంపెనీ భూములను కేటీఆర్ ఎట్లా ఓనర్‌షిప్ తీసుకుంటారని ప్రశ్నించారు.
- ఆ ఫామ్‌హౌస్ 111 జీవో పరిధిలో ఉంది
- 111 జీవోలో ఉన్న సత్యం రామలింగరాజు కంపెనీ భూములను కేటీఆర్ ఎట్లా ఓనర్‌షిప్ తీసుకుంటారు
- ఐటీ ట్రిబ్యునల్‌లో కేసు ఉండగానే భూమిని బదలాయించారు
- కేటీఆర్, ప్రదీప్ రెడ్డి మధ్య ఎలాంటి అగ్రిమెంట్ లేదు
- నిన్న హరీశ్‌రావు, ఈరోజు కేటీఆర్ బాగోతం చూపించాం
- జన్వాడ ఫామ్‌హౌస్ వద్ద మీడియాతో భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యలు
MP Chamala Kirankumar Reddy | త్రినేత్ర.న్యూస్: జన్వాడ ఫామ్‌హౌస్ 111 జీవో పరిధిలో ఉందని.. ఫిరంగి నాళాను ఆక్రమించి ఫామ్‌హౌస్‌ను కట్టారని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. 111 జీవోలో ఉన్న సత్యం రామలింగరాజు కంపెనీ భూములను కేటీఆర్ ఎట్లా ఓనర్‌షిప్ తీసుకుంటారని ప్రశ్నించారు. ఐటీ ట్రిబ్యునల్‌లో కేసు ఉండగానే భూమిని బదలాయించుకున్నారని ఆరోపించారు. అసలు కేటీఆర్, ప్రదీప్‌రెడ్డి మధ్య ఎలాంటి అగ్రిమెంట్ లేదన్నారు. నిన్న హరీశ్‌రావు, ఈరోజు కేటీఆర్ బాగోతం చూపించామని వ్యాఖ్యానించారు. శనివారం జన్వాడ ఫామ్‌హౌస్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సంచలన విషయాలు వెల్లడించారు.
జన్వాడ భూములపై హైడ్రా కమిషనర్‌తో, మున్సిపల్ కమిషనర్‌తో మాట్లాడాను. ప్రయివేటు భూముల్లోకి రావాలనే ఉద్దేశం మాకు లేదు. కేసీఆర్ కుటుంబం అధికార దుర్వినియోగం ప్రజలకు తెలపాలని వచ్చాం. కేసీఆర్ కుటుంబం దోపిడీని ప్రజలకు తెలుపుతున్నాం. ప్రదీప్ రెడ్డి అనే వ్యక్తి గతంలో రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడుగా ఉంటే డ్రోన్ కేసు పెట్టి టెర్రరిస్ట్ లా జైలుకు పంపారు. కేటీఆర్ ఫామ్‌హౌస్‌లో ఉంటున్నారని ప్రదీప్ రెడ్డి కేసు పెట్టారు.
జన్వాడ భూములు సత్యం రామలింగరాజు బినామీ కంపెనీ శతభిష ఆగ్రో ప్రయువేట్ లిమిటెడ్ కంపెనీకి చెందినవి. శతభిష కంపెనీ 6 లక్షల షేర్లపై ఈడీ, ఐటీ నిషేధంలో పెట్టింది. 301, 311, 313 సర్వే నంబర్ల భూములును కేటీఆర్ బాల్య మిత్రుడు, ఇతరుల పేర్ల మీదకు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. డి.ఎన్.బీ అనే కంపెనీకి ట్రాన్స్ఫర్ చేశారు. డీ రాజేష్ అనే వ్యక్తి సత్యం రామలింగరాజు కుమారుడికి సన్నిహితుడు. అతని పేరు మీదకు ట్రాన్స్ఫర్ చేశారు.
కిషన్‌రెడ్డి, బండి సంజయ్ సమాధానం చెప్పాలి..
ఈడీ, ఐటీలో కేసులు ఉన్నా 13 ఎకరాలను ఎందుకు రిలీజ్ చేశారు. ప్రదీప్ రెడ్డికి ఎలా ట్రాన్స్ఫర్ చేశారో కిషన్ రెడ్డి, బండి సంజయ్ సమాధానం చెప్పాలి. సత్యం రామలింగరాజు కంపెనీ నుంచి వేరే కంపెనీకి భూములను ట్రాన్స్ఫర్ చేసి 13 ఎకరాల భూములను దక్కించుకున్నారు. హైకోర్టుకు ఐటీ, ఈడీ ఎందుకు పోలేదు.
అనుమతులు తీసుకోలే..
హరీష్ రావు ఇరిగేషన్ భూముల్లో ఫామ్‌హౌస్ కట్టుకున్నారు. 300 ఎకరాల్లో కేసీఆర్ ఫామ్‌హౌస్ ఉంది. ప్రదీప్ రెడ్డికి జూలైలో హైడ్రా నోటీసులు ఇచ్చింది. కేటీఆర్ మున్సిపల్ శాఖా మంత్రిగా ఉండి నాళాను ఆక్రమించిన ఫామ్ హౌస్‌లో ఎలా ఉన్నారు? ఫామ్‌హౌస్ అక్రమంగా కట్టారు. ఫామ్‌హౌస్ నిర్మాణానికి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు.
కేటీఆర్ సతీమణి, అత్త పేరు మీద భూమి ఉంది..
సత్యం రామలింగరాజు కంపెనీ 7 వేల కోట్లు ప్రజలను మోసం చేసి బ్లాక్ లిస్ట్ లో పెట్టింది. 301 సర్వే నంబర్ లో 3 ఎకరాల 2 గుంటలు కేటీఆర్ సతీమణి శైలిమ పేరు మీద భూమి ఉంది. కేటీఆర్ అత్త పాకాల శశిరేఖ పేరు మీద 18 గుంటలు భూమి ఉంది. ఈ భూములు అన్ని సత్యం రామలింగరాజు కంపెనీ భూములే. ఐటీ ట్రిబ్యునల్‌లో కేసు ఉండగానే భూమిని బదలాయించారు అని కిరణ్‌కుమార్ సంచలన విషయాలు వెల్లడించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Young man Suicide | బైక్ విషయంలో గొడవ.. యాదగిరిగుట్ట బోర్డు సభ్యురాలి మనవడి వేధింపులతో గిరిజన యువకుడి ఆత్మహత్య
సెప్టెంబర్ 19, 2026

Minister Ponnam Prabhakar | దశాబ్దం తర్వాత ఆర్టీసీ యూనియన్ ఎన్నికలు
సెప్టెంబర్ 19, 2026

Complaint on Producer C Kalyan | మా ల్యాండ్ కబ్జా చేశాడు.. ప్రొడ్యూసర్ సి.కళ్యాణ్‌పై చర్యలు తీసుకోండి
సెప్టెంబర్ 19, 2026
తాజావార్తలు
- ●Special Trains | పండుగ వేళ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. చర్లపల్లి–శ్రీకాకుళం మధ్య ప్రత్యేక రైళ్లు
- ●Lava Bold N4 Pro 5G | లావా బోల్డ్ ఎన్4 ప్రొ 5జి.. రూ.13,999కే.. 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ..
- ●Tirumala Brahmotsavam 2026 | మోహినీ రూపంలో మలయప్ప.. మంత్రముగ్ధులైన భక్తజనం..! ఫొటో గ్యాలరీ
- ●Tollywood | హీరోగా మారిన తెలుగు యూట్యూబర్ - ఆస్కార్ విన్నర్‌తో ప్రమోషన్స్
- ●Young man Suicide | బైక్ విషయంలో గొడవ.. యాదగిరిగుట్ట బోర్డు సభ్యురాలి మనవడి వేధింపులతో గిరిజన యువకుడి ఆత్మహత్య
- ●IPO | వచ్చే వారం 6 ఐపీఓలు.. రూ.3,824 కోట్ల ఆఫర్..

Special Trains | పండుగ వేళ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. చర్లపల్లి–శ్రీకాకుళం మధ్య ప్రత్యేక రైళ్లు

Lava Bold N4 Pro 5G | లావా బోల్డ్ ఎన్4 ప్రొ 5జి.. రూ.13,999కే.. 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ..

Tirumala Brahmotsavam 2026 | మోహినీ రూపంలో మలయప్ప.. మంత్రముగ్ధులైన భక్తజనం..! ఫొటో గ్యాలరీ

Tollywood | హీరోగా మారిన తెలుగు యూట్యూబర్ - ఆస్కార్ విన్నర్‌తో ప్రమోషన్స్







