Bullet train | మే నాటికి బుల్లెట్ ట్రైన్ ట్రయల్ రన్ : రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్
Bullet train | ముంబై-అహ్మదాబాద్ (Mumbai To Ahmedabad) బుల్లెట్ రైలు పనులు శరవేగంగా జరుగుతున్నాయని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwani Vaishnaw) వెల్లడించారు. వచ్చే ఏడాది మే నెలలో బుల్లెట్ ట్రైన్ ట్రయల్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
Bullet train | త్రినేత్ర న్యూస్ : దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హైస్పీడ్ బుల్లెట్ రైలు (Bullet Train) ప్రాజెక్టుకు సంబంధించి రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwani Vaishnaw) కీలక అప్‌డేట్ ఇచ్చారు. ముంబై-అహ్మదాబాద్ (Mumbai To Ahmedabad) బుల్లెట్ రైలు పనులు శరవేగంగా జరుగుతున్నట్లు చెప్పారు. ఈ మార్గంలోని ఫస్ట్ సెక్షన్ ఆల్‌మోస్ట్ రెడీ అయ్యిందని (Bullet train first section almost ready) తెలిపారు. వచ్చే ఏడాది మే నెలలో బుల్లెట్ ట్రైన్ ట్రయల్ నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. ఈ రైలు గంటకు 280 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనున్నట్లు చెప్పారు.
ఇవాళ నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. "ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ తొలి ట్రయల్ రన్‌కు సిద్ధమవుతోంది. ఈ కారిడార్‌లోని 50 కిలోమీటర్ల సూరత్-బిలిమోరా (Surat-Bilimora section) సెక్షన్ 2027 మే నాటికి పరీక్షలకు సిద్ధమవుతోంది. ఈ మార్గంలో విద్యుదీకరణ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. సిగ్నలింగ్ పనులు జనవరి నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది" అని కేంద్ర మంత్రి వెల్లడించారు.
సముద్రగర్భ సొరంగంతో (అండర్ సీ టన్నెల్) సహా మహారాష్ట్ర పరిధిలోని విభాగాల నిర్మాణ పనులు ఆశాజనకంగా సాగుతున్నాయని మంత్రి వివరించారు. ముంబై-అహ్మదాబాద్ నగరాల మధ్య అత్యంత వేగవంతమైన ప్రయాణ సౌకర్యాన్ని కల్పించే లక్ష్యంతో భారతదేశపు తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టుగా ఈ హై-స్పీడ్ రైల్ కారిడార్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టును దశలవారీగా ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. అహ్మదాబాద్-వాపి విభాగాన్ని 2027 చివరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. 2029 నాటికి బుల్లెట్ రైలు థానే వరకూ చేరుకుంటుందని ఆయన వెల్లడించారు.
ఈ ట్రయల్ రన్‌లో ఉపయోగించే 'B28' బుల్లెట్ రైలును పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో బెంగళూరులోని BEML, చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) సంయుక్తంగా తయారు చేస్తున్నాయి. ఈ రైల్లో మొత్తం 8 కోచ్‌లు (7 స్టాండర్డ్ క్లాస్, 1 ఎగ్జిక్యూటివ్ క్లాస్) ఉంటాయి. ఒకేసారి సుమారు 557 మంది ప్రయాణికులు ప్రయాణించొచ్చు. పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాక ఈ రైలు గరిష్ఠంగా గంటకు 320 కి.మీ వేగంతో ప్రయాణించగలదు.
అహ్మదాబాద్-ముంబై ఈ హై-స్పీడ్ కారిడార్ మొత్తం 508 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలను అనుసంధానిస్తూ సాగే ఈ మార్గంలో మొత్తం 12 స్టేషన్లను నిర్మించనున్నారు. 1.98 లక్షల కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మిస్తున్న ఈ మార్గం ఎనిమిది హై-స్పీడ్ రైల్ ప్రాజెక్టుల్లో మొట్టమొదటిది. ఈ ప్రాజెక్టులో అనేక ఇంజనీరింగ్ సవాళ్లు ఉన్నాయి. ఈ కారిడార్‌లో మొత్తం 8 పర్వత సొరంగాలు (Mountain Tunnels) నిర్మిస్తున్నారు. వీటిలో 7 మహారాష్ట్రలో ఉండగా, ఒక్కటి గుజరాత్‌లో ఉంది. కేవలం పర్వతాలే కాదు, సముద్ర గర్భం నుంచి కూడా రైలు వెళ్లేలా థానే క్రీక్ వద్ద ప్రత్యేక సొరంగాన్ని నిర్మిస్తున్నారు. 2017 సెప్టెంబర్‌లో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు.
Also Read..
ఇక అయోధ్య నుంచి జనక్‌పూర్‌కి నేరుగా రైలు సర్వీసు.. కీలక వివరాలు ఇవే
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Doodimetla Balaraju Yadav | మీకు దక్కేది.. కోటి తిట్లు 9 సీట్లు
- ●Super El Niño | సూపర్ ఎల్‌నినో విధ్వంసం..!
- ●Jangaon Medical College | త్వరలోనే జనగాం మెడికల్ కాలేజీ భవనం ప్రారంభం
- ●ULIP | యులిప్‌లతో పెట్టుబడులా? బీమా ముసుగులో తగ్గుతున్న మీ లాభాలు!
- ●West Bengal Renamed Paschim Banga | వెస్ట్ బెంగాల్ ఇకపై 'పశ్చిమ బంగ'.. డిసెంబర్ 9న అసెంబ్లీలో కీలక తీర్మానం
- ●Bhatti Vikramarka | పార్టీలో విభేదాలేం లేవ్.. ఊహాజనిత ప్రచారాలను పట్టిచ్చుకోం

Doodimetla Balaraju Yadav | మీకు దక్కేది.. కోటి తిట్లు 9 సీట్లు

Super El Niño | సూపర్ ఎల్‌నినో విధ్వంసం..!

Jangaon Medical College | త్వరలోనే జనగాం మెడికల్ కాలేజీ భవనం ప్రారంభం

ULIP | యులిప్‌లతో పెట్టుబడులా? బీమా ముసుగులో తగ్గుతున్న మీ లాభాలు!






