Karthik Reddy | బహదూర్‌గూడా రైతుల పరిస్థితి ప్యారడైజ్ సినిమా లెక్కనే ఉంది
Karthik Reddy | బుల్లెట్ ట్రైన్ కోసం వెయ్యెకరాలు అవసరం లేదని.. బహదూర్ గూడాలో ఉన్న ప్రైవేట్ భూములను రేవంత్ ప్రభుత్వ భూములను చెప్తున్నాడని రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఇంచార్జి పట్లోళ్ల కార్తీక్ రెడ్డి మండిపడ్డారు.
- బుల్లెట్ ట్రైన్ కోసం వెయ్యెకరాలు అవసరం లేదు
- ప్రైవేట్ భూములను ప్రభుత్వ భూములని రేవంత్ అంటున్నడు
- రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఇంచార్జి పట్లోళ్ల కార్తీక్ రెడ్డి ఫైర్
Karthik Reddy | త్రినేత్ర న్యూస్: బుల్లెట్ ట్రైన్ కోసం వెయ్యెకరాలు అవసరం లేదని.. బహదూర్ గూడాలో ఉన్న ప్రైవేట్ భూములను రేవంత్ ప్రభుత్వ భూములను చెప్తున్నాడని రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఇంచార్జి పట్లోళ్ల కార్తీక్ రెడ్డి మండిపడ్డారు. ఇక్కడి రైతుల పరిస్థితి ప్యారడైజ్ సినిమా లెక్కనే ఉందన్నారు. పార్టీలు మారుతూ పబ్బం గడుపుతున్న ప్రకాష్ గౌడ్.. కేటీఆర్, కేసీఆర్, కలెక్టర్ కు రాసిన లేఖలు చూపించాలన్నారు. సోమవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైరయ్యారు.
బహదూర్ గూడా భూములు ప్రైవేట్ భూములు. కానీ రేవంత్ రెడ్డి అడ్డగోలుగా ప్రభుత్వ భూమి అని చెప్తున్నాడు. కేసీఆర్ ఈ భూముల వైపు ఎన్నడూ చూడలే. పార్టీలు మారుతూ ప్రకాష్ గౌడ్ పబ్బం గడుపుతున్నారు. రైతుల ఉసురు కచ్చితంగా తగులుతుంది. రైతులను కబ్జాదారులు అంటే మట్టి కొట్టుకుపోతారు అని కార్తీక్ రెడ్డి శాపనార్థాలు పెట్టారు.
కేసీఆర్ పాస్‌బుక్కులు ఇచ్చిన భూమిని రేవంత్ తీసుకుంటున్నడు:
మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా
ఈ భూములన్ని అమ్మి పెద్దలకు కట్టబెట్టేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. బహదూర్ గూడ కష్టం, సమస్యలు నాకు తెలుసు. ఇంద్రారెడ్డి, నేను, నా కొడుకు మీకు అండగా ఉంటున్నాం. భూ సేకరణ చేయాలంటే ఒక పద్ధతి ఉంటుంది. చట్టాన్ని మార్చి అయినా సరే పేదలకు న్యాయం చేయాలని కేసీఆర్ ఎప్పుడూ చెప్తూ ఉంటారు.
కేసీఆర్ పాస్ బుక్స్ ఇచ్చిన భూమిని రేవంత్ రెడ్డి తీసుకుంటున్నారు. మీరు వస్తుంటే పోలీసులను పెట్టి మిమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీ భూమి మీద మీకు హక్కు లేకుండా చేయడం ఎందుకు? పేదవాడికి ఒక న్యాయం, పెద్ద వాడికి ఒక న్యాయం అవలంబిస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మీరు సర్వే చేసిన భూమి ఎంత ఉందో అంతే తీసుకోండి. రైతుల భూములు ఎలా తీసుకుంటున్నారు? ఎలక్షన్ రావడం వల్ల ఆనాడు పట్టాలు సిద్ధం అయ్యాక ఇవ్వలేకపోయం. బుల్లెట్ ట్రైన్ కోసం ఎంత భూమి కావాలో రేవంత్ రెడ్డికి క్లారిటీ లేదు. మెట్రో రైల్ అనుమతులు ఇస్తే ఎందుకు రేవంత్ రెడ్డి ఆపారు? 200 ఎకరాలు ఒకచోట రేవంత్ రెడ్డి సోదరులు కడుతున్నారని మా భూమి లాక్కున్నారు అని బాధితులు చెప్తున్నారు. కోర్టు నుంచైనా కొట్లాడుదాం. మీరు అంత కలిసి కట్టుగా ఉండండి.. ఏ ఒక్కరూ కూడా నిరాశ పడొద్దు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●TGPSC | టీజీపీఎస్సీ పరీక్షల షెడ్యూల్ విడుదల.. అక్టోబర్ 24 నుంచి నవంబర్ 13 వరకు నియామక పరీక్షలు
- ●Telangana Graduate MLC Voter Registration | గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు నమోదు షురూ: అర్హతలు ఇవే.. ఫోన్ నుంచే ఫారమ్-18 కు ఎలా దరఖాస్తు చేసుకోవాలి
- ●MLA Sanjay | ప్రమీల చాలా మంది పసిబిడ్డలను కాపాడారు
- ●Asian Games | ఆసియా గేమ్స్‌లో దాయాదుల సమరం.. అక్టోబర్ 1న హైవోల్టేజ్ మ్యాచ్
- ●Ashika Ranganath | ఏజ్ గ్యాప్‌పై ట్రోల్స్ - అజిత్ సినిమా నుంచి శ్రీలీల ఔట్ - కన్నడ బ్యూటీకి ఛాన్స్
- ●Supreme Court | టీఎంసీ పార్టీ గుర్తు, పేరుపై వివాదం.. ఎన్నికల సంఘానికి సుప్రీం కీలక ఆదేశాలు

TGPSC | టీజీపీఎస్సీ పరీక్షల షెడ్యూల్ విడుదల.. అక్టోబర్ 24 నుంచి నవంబర్ 13 వరకు నియామక పరీక్షలు

Telangana Graduate MLC Voter Registration | గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు నమోదు షురూ: అర్హతలు ఇవే.. ఫోన్ నుంచే ఫారమ్-18 కు ఎలా దరఖాస్తు చేసుకోవాలి

MLA Sanjay | ప్రమీల చాలా మంది పసిబిడ్డలను కాపాడారు

Asian Games | ఆసియా గేమ్స్‌లో దాయాదుల సమరం.. అక్టోబర్ 1న హైవోల్టేజ్ మ్యాచ్





