త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Doodimetla Balaraju Yadav | మీకు దక్కేది.. కోటి తిట్లు 9 సీట్లు

Doodimetla Balaraju Yadav | వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌కు వ‌చ్చేది కోటి ఓట్లు, 90 సీట్లు కాద‌ని.. కోటి తిట్లు, 9 సీట్ల‌ని కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ (Doodimetla Balaraju Yadav) ఎద్దేవా చేశారు.

S

Telangana | Published On Nov 23, 2026, 4.56 pm IST

Doodimetla Balaraju Yadav | మీకు దక్కేది.. కోటి తిట్లు 9 సీట్లు
Advertisement
  • కోటి ఓట్లు, 90 సీట్లు కాదు
  • చంద్రబాబుకు రేవంత్ రెడ్డి చెప్రాసీలా వ్యవహరిస్తున్నారు
  • నీళ్ల‌న్నీ ఏపీకి వ‌దిలి రావ‌ణాసురిడిలా మారిండు
  • కృష్ణా జలాల కోసం డిసెంబర్ 10న నల్లగొండలో కేటీఆర్ సింహగర్జన ఉంటుంది
  • కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్

Doodimetla Balaraju Yadav | త్రినేత్ర న్యూస్: వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌కు వ‌చ్చేది కోటి ఓట్లు, 90 సీట్లు కాద‌ని.. కోటి తిట్లు, 9 సీట్ల‌ని కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ (Doodimetla Balaraju Yadav) ఎద్దేవా చేశారు. చంద్ర‌బాబుకు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) చెప్రాసీలా ప‌ని చేస్తున్నార‌న్నారు. తెలంగాణ‌లో ఆంధ్రప్ర‌దేశ్ పాల‌న న‌డుస్తోందన్నారు. నీళ్ల‌న్నీ ఏపీకి వ‌దిలి రేవంత్ రావ‌ణాసురిడిలా మారార‌ని ఆరోపించారు. కృష్ణా జ‌లాల కోసం వ‌చ్చే డిసెంబర్ 10న న‌ల్ల‌గొండ‌లో కేటీఆర్ సింహ‌గ‌ర్జ‌న స‌భ ఉంటుంద‌ని వెల్ల‌డించారు. సోమ‌వారం తెలంగాణ భ‌వ‌న్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

తెలంగాణ కోసం పోరాటం చేసి రాష్ట్రాన్ని తెచ్చిన కేసీఆర్‌పై, సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదు. సిట్ లు వేసినా అరెస్టు చేసినా కేసీఆర్ సైనికులుగా భయపడేది లేదు. అరెస్టు చేయాల్సి వస్తే దిగజారుడు భాష మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి నే అరెస్టు చేయాలి. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి బాధ్యతాయుతంగా మాట్లాడాలి.

కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చెప్పినట్లుగా రేవంత్ రెడ్డి మానసిక స్థితి సరిగా లేదు. రేవంత్ రెడ్డి పరిస్థితి ఆహా నా పెళ్ళంట సినిమా లో అన్ని మరచిపోయే నూతన్ ప్రసాద్ లా మారింది. రేవంత్ రెడ్డి తెలంగాణలో నేను తెలంగాణ బిడ్డను అని చెప్పుకునే పరిస్థితి వచ్చింది. రేవంత్ తెలంగాణ బిడ్డ అని రాష్ట్ర ప్రజలు నమ్మడం లేదు. తెలంగాణ రాష్ట్ర నీళ్లను పల్నాడు వాటర్ గ్రిడ్ పేరుతో ఆంధ్రప్రదేశ్‌కు తరలించుకుపోతున్నారు. తెలంగాణ హక్కుల కోసం ప్రశ్నించే వాళ్లను ఆక్రమ అరెస్ట్ లు చేస్తున్నారు.

ఇంటర్ విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్న సీఎం.. ఇంటర్ బోర్డును రద్దు చేసే దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి రాముడు కాదు రావణాసురుడు. తనకు హిట్లర్ ఆదర్శమన్నవాడు రాముడు ఎట్లా అవుతాడు? చెరువుల్లో నీళ్లు లేవు, కాలువల్లో నీళ్లు లేవు, పంప్‌హౌస్‌లు ఎందుకు నడపడం లేదు? రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న ప్రభుత్వం రేవంత్ ది. అందుకే ఆయన రావణాసురుడు. ఆంధ్రప్రదేశ్‌కు నీళ్లు తరలిపోతుంటే రేవంత్ రెడ్డి చోద్యం చూస్తున్నారు. కేటీఆర్, హరీశ్ రావు నీళ్లు తరలిపోతున్నాయని పదేపదే హెచ్చరిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

రేవంత్‌పై సిట్ వేయాలి

నిరుద్యోగులకు రూ.4 వేల భృతి, వికలాంగులకు రూ.6 వేల పెన్షన్ హామీలు ఏమయ్యాయి? రైతుల విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రావణాసురుడిలా వ్యవహరిస్తోంది. సిట్ వేయాల్సి వస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సిట్ వేయాలి. 2028లో ప్రజలు ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారు. పల్నాడు వాటర్ గ్రిడ్ పేరుతో తెలంగాణ నీటిని తరలించేందుకు కుట్ర జరుగుతోంది. కేఆర్‌ఎంబీ వద్దకు వెళ్తున్న వారిని అక్రమంగా అరెస్టులు చేయడాన్ని ఖండిస్తున్నా. నాగార్జునసాగర్ నుంచి నీటిని తరలించుకుంటూ తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారు.

తెలంగాణలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అధికారులను తీసుకొచ్చి కీలక పదవుల్లో అధికారులుగా నియమిస్తున్నారు. ప్రైవేట్ భూముల వ్యవహారాల్లో కమిషన్లు ఎలా సంపాదించుకోవాలో ముఖ్యమంత్రి ని చూసి అవినీతిపరులు నేర్చుకుంటున్నారు. తెలంగాణ జలాల విషయంలో ఆదిత్యనాథ్ దాస్ వ్యవహారశైలి రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా ఉంది.

క్షుద్ర పూజలు చేస్తున్నారు అని అన్న మహేష్ కుమార్ గౌడ్ ను అరెస్ట్ చెయ్యాలి. ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్, అద్దంకి దయాకర్ ను అరెస్ట్ చెయ్యాలి. కాంగ్రెస్ ప్రభుత్వనికి ప్రశ్నినిస్తే సిట్ వేస్తారా?

ఈ స‌మావేశంలో ఉపేంద్ర చారి, అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి, దేవరి మల్లప్ప, బైండ్ల విజయ్ కుమార్, కృష్ణ పాల్గొన్నారు.

Advertisement
Advertisement