Ayodhya To Janakpur | ఇక అయోధ్య నుంచి జనక్‌పూర్‌కి నేరుగా రైలు సర్వీసు.. కీలక వివరాలు ఇవే
Ayodhya To Janakpur | శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్య నుంచి సీతాదేవి జన్మస్థలమైన జనక్‌పూర్ ధామ్ (Ayodhya To Janakpur)ను కలుపుతూ కొత్త వీక్లీ రైలు సరయూ-కమలా ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఇవాళ ప్రారంభించారు. ఆ రైలు వివరాలు మీకోసం..
Ayodhya To Janakpur | త్రినేత్ర న్యూస్ : భారత్, నేపాల్ మధ్య ఆధ్యాత్మిక, సాంస్కృతిక బంధాన్ని మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక అడుగు పడింది. శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్య నుంచి సీతాదేవి జన్మస్థలమైన జనక్‌పూర్ ధామ్ (Ayodhya To Janakpur)ను కలుపుతూ కొత్త వీక్లీ రైలు సరయూ-కమలా ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఇవాళ ప్రారంభించారు. భారత పర్యటనలో ఉన్న నేపాల్ ప్రధాని బాలేంద్ర షా (Balendra Shah)తో కలిసి జెండా ఊపి గ్రాండ్‌గా ప్రారంభించారు. ఈ రైలు సేవలతో ఇరు దేశాల మధ్య రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి.
604 కిలోమీటర్ల ప్రయాణం.. 19 గంటల సమయం
అయోధ్య ప్రసిద్ధి చెందిన సరయూ నది, జనక్‌పూర్ ధామ్‌కు పేరుగాంచిన కమలా నది పేర్ల మీదుగా ఈ రైలుకు ‘సరయూ-కమల ఎక్స్‌ప్రెస్’ (Sarayu Kamala Express) అని నామకరణం చేశారు. వారానికి ఒకసారి నడిచే (Weekly) ఈ రైలు సేవలు నవంబర్ 28 నుండి సాధారణ ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. అయోధ్య కంటోన్మెంట్ నుంచి నేపాల్‌లోని జనక్‌పూర్ ధామ్ వరకు 604 కిలోమీటర్ల దూరాన్ని ఈ రైలు కేవలం 19 గంటల్లో చేరుకోనుంది. ప్రయాణికులు మార్గమధ్యలో ఎక్కడా రైలు మారాల్సిన అవసరం లేకుండా నేరుగా గమ్యస్థానానికి చేరుకోవచ్చు.
అయోధ్య To జనక్‌పూర్
ఈ రైలు ప్రతి సోమవారం సాయంత్రం 5:50 గంటలకు అయోధ్య నుండి బయలుదేరుతుంది. మరుసటి రోజు అంటే మంగళవారం మధ్యాహ్నం 12:40 గంటలకు జనక్‌పూర్ ధామ్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ప్రతి శనివారం మధ్యాహ్నం 1:10 గంటలకు (నేపాల్ స్థానిక కాలమానం ప్రకారం) జనక్‌పూర్ ధామ్ నుంచి బయల్దేరి.. ఆదివారం ఉదయం 8:10 గంటలకు అయోధ్య చేరుకుంటుంది.
మొత్తం 10 స్టాపులు
అయోధ్య - జనక్‌పూర్ మధ్య ప్రయాణంలో ఈ రైలు మొత్తం 10 రైల్వే స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తుంది. అయోధ్య ధామ్, మన్కాపూర్, బస్తీ, గోరఖ్‌పూర్, నర్కటియాగంజ్, రక్సౌల్, సీతామఢీ, శిశో, మధుబని, జయనగర్ స్టేషన్లలో రైలు ఆగనుంది. ఏసీ, స్లీపర్, ఇతర తరగతులతో కూడిన మొత్తం 17 ఆధునిక LHB బోగీలతో ఈ రైలు నడవనుంది. ఇందులో 8 ఏసీ కోచ్‌లు, 7 స్లీపర్ కోచ్‌లతో పాటు దివ్యాంగులకు అనుకూలంగా ఉండే లగేజీ కోచ్, పవర్ కార్ కూడా ఉంటాయి.
పర్యాటక, ఆర్థిక అభివృద్ధికి ఊతం
అయోధ్య శ్రీరాముడి జన్మస్థలంగా, జనక్ పూర్ సీతాదేవి జన్మస్థలంగా ప్రసిద్ధి చెందింది. ఈ రెండు ప్రాంతాల మధ్య నేరుగా రైలు సౌకర్యం అందుబాటులోకి రావడం వల్ల ఇరు దేశాల మధ్య మతపరమైన, సాంస్కృతిక, సామాజిక సంబంధాలు మరింత బలపడతాయని అధికారులు భావిస్తున్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాలకు ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యం కలగడంతో పాటు, ఇరు దేశాల ఉమ్మడి నాగరికత వారసత్వానికి ఇది నిదర్శనంగా నిలవనుంది.
రెండు ఆధ్యాత్మిక నగరాలను కలిపే ఈ రైలు 'రామాయణ సర్క్యూట్' పర్యాటకాన్ని భారీగా పెంచనుంది. దీనివల్ల స్థానిక హోటళ్లు, వ్యాపారాలు, రవాణా ఆపరేటర్లు, పర్యాటక రంగానికి భారీగా లబ్ధి చేకూరనుంది. భక్తులు, పర్యాటకులు ఈజీగా ఈ రెండు ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉంటుంది. అంతేకాదు, ఉత్తరప్రదేశ్, బీహార్, నేపాల్ సరిహద్దు ప్రాంతాల్లో హోటళ్లు, రవాణా, స్థానిక వ్యాపారాలు అభివృద్ధి చెందడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
Also Read..
‘బాహుబలి’లా ప్రవర్తించడం మానుకోండి.. సెషన్స్ జడ్జిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం
సలైవా వాడకంపై బ్యాన్ ఎత్తేయండి.. ఐసీసీకి గిల్ రిక్వెస్ట్..!
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bandi Sanjay | మోదీ నిప్పులాంటోడు.. టచ్ చేస్తే మాడి మసైపోతావ్..
- ●Shubman Gill | సలైవా వాడకంపై బ్యాన్ ఎత్తేయండి.. ఐసీసీకి గిల్ రిక్వెస్ట్..!
- ●Telangana Gold Man IT Raid | తెలంగాణ 'గోల్డ్ మ్యాన్' కేసులో ఐటీ శాఖ కొరడా: రాయదుర్గంలో రూ.3.2 లక్షల అద్దె వచ్చే బినామీ భవనం అటాచ్
- ●Motkupalli Narasimhulu | రేవంత్ రెడ్డికి దళితులంటే చులకన భావం : మోత్కుపల్లి నర్సింహులు
- ●Etala Rajendar | రియల్ ఎస్టేట్ కంపెనీలకు భూములు అమ్మనివ్వం.. అవి ప్రజావసరాలకే ఉండాలి
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో భారీ పతనం.. రూ.6.39 లక్షల కోట్ల సంపద ఆవిరి..

Bandi Sanjay | మోదీ నిప్పులాంటోడు.. టచ్ చేస్తే మాడి మసైపోతావ్..

Shubman Gill | సలైవా వాడకంపై బ్యాన్ ఎత్తేయండి.. ఐసీసీకి గిల్ రిక్వెస్ట్..!

Telangana Gold Man IT Raid | తెలంగాణ 'గోల్డ్ మ్యాన్' కేసులో ఐటీ శాఖ కొరడా: రాయదుర్గంలో రూ.3.2 లక్షల అద్దె వచ్చే బినామీ భవనం అటాచ్

Motkupalli Narasimhulu | రేవంత్ రెడ్డికి దళితులంటే చులకన భావం : మోత్కుపల్లి నర్సింహులు






