Super El Niño | సూపర్ ఎల్‌నినో విధ్వంసం..!
Super El Niño | ప్రపంచ వాతావరణంలో కీలక మార్పులకు కారణమయ్యే ఎల్‌నినో ప్రభావం ఈసారి మరింత తీవ్రంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. 1950 తర్వాత నమోదయ్యే అత్యంత శక్తిమంతమైన ఎల్‌నినోల్లో ఒకటిగా ఇది మారవచ్చన్న అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
- పలుచోట్ల వరదలు, కొండచరియలకు ముప్పు
- 1950 తర్వాత తొలిసారి తొలిసారిగా అత్యంత తీవ్రంగా ఎల్‌నినో
- హిమాలయ ప్రాంతాల్లోనూ భారీ విపత్తు
- హెచ్చరించిన వాతావరణ నిపుణులు
Super El Niño | ప్రపంచ వాతావరణంలో కీలక మార్పులకు కారణమయ్యే ఎల్‌నినో ప్రభావం ఈసారి మరింత తీవ్రంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. 1950 తర్వాత నమోదయ్యే అత్యంత శక్తిమంతమైన ఎల్‌నినోల్లో ఒకటిగా ఇది మారవచ్చన్న అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. దీని ప్రభావంతో హిందూకుష్ హిమాలయ ప్రాంతంలోని పలు దేశాలకు వరదలు, కొండచరియలు విరిగిపడటం, మంచు చరియలు విరుచుకుపడటం వంటి ముప్పు పొంచి ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
హిమాలయాలకు ముప్పు..
నేపాల్, అఫ్గానిస్థాన్, పాకిస్థాన్, ఉత్తర భారతదేశం, బంగ్లాదేశ్ ప్రాంతాల్లో ఎల్‌నినో ప్రభావం కనిపించే అవకాశశం ఉన్నది. కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం, ఎగువ ప్రాంతాల్లో భారీగా మంచు కురిసే ప్రమాదం ఉందని 'హిందూకుష్ హిమాలయ వింటర్ ఔట్‌లుక్-2026' నివేదిక వెల్లడించింది. దీంతో వరదలు, కొండచరియలు, మంచు చరియల ముప్పు పెరగవచ్చని పేర్కొంది. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదై కరువు పరిస్థితులు, అడవుల్లో కార్చిచ్చు ప్రమాదం తలెత్తవచ్చని అంచనా వేసింది.
1950 తర్వాత అత్యంత తీవ్రంగా..
అమెరికాకు చెందిన నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ (NOAA) బలమైన, అత్యంత శక్తివంతమైన ఎల్‌నినో ఏర్పడే అవకాశాలున్నట్లు అంచనా వేసింది. ఇది 1950 తర్వాత నమోదైన అత్యంత శక్తిమంతమైన ఎల్‌నినో ఘటనల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి. దీని ప్రభావంతో హిమాలయ పర్వత పాద ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక వర్షాలు, ఎత్తైన ప్రాంతాల్లో ఎక్కువ మంచు కురిసే అవకాశముందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ వాతావరణ అంచనాలను ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటెన్ డెవలప్‌మెంట్ (ICIMOD), బీజింగ్ నార్మల్ యూనివర్సిటీ, చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌కు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అట్మాస్ఫియరిక్ ఫిజిక్స్ సంయుక్తంగా రూపొందించాయి.
గతంలోనూ భారీ నష్టం..
హిమాలయ ప్రాంత దేశాలు గతంలోనూ ప్రకృతి విపత్తులతో తీవ్రంగా నష్టపోయాయి. ముఖ్యంగా నేపాల్, భూటాన్‌లలో ఇటీవలి సంవత్సరాల్లో రుతుపవనాల ప్రభావంతో భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టించాయి. నేపాల్‌లో వరదల కారణంగా దాదాపు 1,500 మంది ప్రాణాలు కోల్పోగా, 5,000 మందికి పైగా ఆచూకీ గల్లంతైనట్లు సమాచారం. సహాయక చర్యలు, పునరావాసం, పునర్నిర్మాణం కోసం సుమారు 4.7 బిలియన్ డాలర్లు అవసరమవుతాయని అంచనా.
ముందస్తు అప్రమత్తతే కీలకం
రానున్న కాలంలో అఫ్గానిస్థాన్, పాకిస్థాన్, ఉత్తర భారతదేశం, నేపాల్‌లోని కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే అధికంగా మంచు కురిసే అవకాశముందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో హిమాలయ ప్రాంత ప్రజలు, ప్రభుత్వ యంత్రాంగం ముందుగానే అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందని.. వరదలు, కొండచరియలు, మంచు చరియలు, కరువు వంటి విపత్తులను ఎదుర్కొనేందుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచిస్తున్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Doodimetla Balaraju Yadav | మీకు దక్కేది.. కోటి తిట్లు 9 సీట్లు
- ●Jangaon Medical College | త్వరలోనే జనగాం మెడికల్ కాలేజీ భవనం ప్రారంభం
- ●ULIP | యులిప్‌లతో పెట్టుబడులా? బీమా ముసుగులో తగ్గుతున్న మీ లాభాలు!
- ●West Bengal Renamed Paschim Banga | వెస్ట్ బెంగాల్ ఇకపై 'పశ్చిమ బంగ'.. డిసెంబర్ 9న అసెంబ్లీలో కీలక తీర్మానం
- ●Bhatti Vikramarka | పార్టీలో విభేదాలేం లేవ్.. ఊహాజనిత ప్రచారాలను పట్టిచ్చుకోం
- ●Niharika Konidela | మెగా డాటర్ నిహారిక కొణిదెల కొత్త బిజినెస్

Doodimetla Balaraju Yadav | మీకు దక్కేది.. కోటి తిట్లు 9 సీట్లు

Jangaon Medical College | త్వరలోనే జనగాం మెడికల్ కాలేజీ భవనం ప్రారంభం

ULIP | యులిప్‌లతో పెట్టుబడులా? బీమా ముసుగులో తగ్గుతున్న మీ లాభాలు!

West Bengal Renamed Paschim Banga | వెస్ట్ బెంగాల్ ఇకపై 'పశ్చిమ బంగ'.. డిసెంబర్ 9న అసెంబ్లీలో కీలక తీర్మానం






