త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rain Update | అర్నాబ్ తుఫాన్ ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో అతి భారీ వ‌ర్షాలు.. రెడ్ అల‌ర్ట్ జారీ

Rain Update | తుఫాను ప్ర‌భావంతో రాష్ట్రంలో వాతావ‌ర‌ణం కొద్దిగా మారింది. శీత‌ల గాలులు వీస్తుండ‌టంతో వాతావ‌ర‌ణం చ‌ల్ల‌బ‌డింది. బంగాళాఖాతంలో ఏర్ప‌డిన తీవ్ర వాయుగుండం అర్నాబ్ తుఫానుగా (Arnab Cyclone) బ‌ల‌ప‌డింది. సోమ‌వారం అర్ధ‌రాత్రికి అది తీవ్ర తుఫాన్‌గా, మంగ‌ళ‌వారం అతి తీవ్ర తుఫానుగా బ‌ల‌ప‌డ‌నుంది.

G

Telangana | Published On Oct 26, 2026, 10.01 am IST

Rain Update | అర్నాబ్ తుఫాన్ ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో అతి భారీ వ‌ర్షాలు.. రెడ్ అల‌ర్ట్ జారీ
Advertisement

Rain Update | త్రినేత్ర న్యూస్‌: తుఫాను ప్ర‌భావంతో రాష్ట్రంలో వాతావ‌ర‌ణం కొద్దిగా మారింది. శీత‌ల గాలులు వీస్తుండ‌టంతో వాతావ‌ర‌ణం చ‌ల్ల‌బ‌డింది. బంగాళాఖాతంలో ఏర్ప‌డిన తీవ్ర వాయుగుండం అర్నాబ్ తుఫానుగా (Arnab Cyclone) బ‌ల‌ప‌డింది. సోమ‌వారం అర్ధ‌రాత్రికి అది తీవ్ర తుఫాన్‌గా, మంగ‌ళ‌వారం అతి తీవ్ర తుఫానుగా బ‌ల‌ప‌డ‌నుంది. దీంతో మంగ‌ళ‌వారం (అక్టోబ‌ర్ 27) రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు (Rain Update) కురుస్తాయని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం (IMD Hyderabad) తెలిపింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్ల‌గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హ‌నుమ‌కొండ‌, జనగామ, సిద్దిపేట, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.

ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్…

ఇక అక్టోబర్ 28న (బుధ‌వారం) చాలా చోట్ల మోస్తరు నుండి విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ అతి భారీ వర్షాలు (Very Heavy Rains) కురిసే అవ‌కాశం ఉంద‌ని వెల్ల‌డించింది. ఈ నేప‌థ్యంలో ఆయా జిల్లాల‌కు రెడ్ అలర్ట్ (Red Alert) జారీ చేసింది. అదేవిధంగా భూపాలపల్లి, వరంగల్, సూర్యాపేట, నల్ల‌గొండ, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి చాలా భారీ వర్షాలు కురుస్తాయ‌ని చెప్పింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీచేసింది.

ఇక కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్ల‌గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హ‌నుమ‌కొండ‌ జిల్లాల్లో గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంద‌ని తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీచేసింది.

గురువారం (అక్టోబ‌ర్ 29న‌) రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అడ‌క్క‌డ‌క‌డ భారీ వర్షాలు పడే అవకాశం ఉంద‌ని తెలిపింది. అదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో 30-40 కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయ‌ని వెల్ల‌డించింది.

Advertisement
Advertisement