Trisha | దళపతి విజయ్‌తో బంధానికి చెన్నై క్వీన్ తెగతెంపులు? – సీఎంను అన్‌ఫాలో చేసిన త్రిష
తమిళనాడు సీఎం దళపతి విజయ్ పుట్టినరోజు సందర్భంగా బాలీవుడ్‌తో పాటు దక్షిణాది సినీ ప్రముఖులు అతడికి స్పెషల్‌గా విషెస్ చెప్పారు. కానీ విజయ్‌కి త్రిష పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పకపోవడం ఆసక్తికరంగా మారింది. ఇన్‌స్టాగ్రామ్‌లో విజయ్‌ని అన్‌ఫాలో చేసింది. విజయ్, త్రిష బంధానికి ముగింపు పడినట్లు ప్రచారం జరుగుతోంది.
Entertainment | Published On Jun 23, 2026, 12.06 pm IST
Trisha |తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించిన దళపతి విజయ్ సీఎంగా పదవి చేపట్టారు. ఎన్నికల టైమ్‌లో విజయ్ కంటే త్రిష ఎక్కువగా వార్తల్లో నిలిచింది. ఎన్నికల ముందు విజయ్ నుంచి విడాకులు కోరుతూ అతడి భార్య సంగీత కోర్టును ఆశ్రయించింది. విజయ్‌కి ఓ నటితో వివాహేతర సంబంధం ఉందంటూ ఆరోపణలు చేసింది. ఆ నటి త్రిషనే అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ రూమర్లకు బలం చేకూరుస్తూ ఓ నిర్మాత కొడుకు పెళ్లి వేడుకతో పాటు అజిత్ ఇంటికి విజయ్, త్రిష జంటగానే వెళ్లారు. ఎన్నికల రిజల్ట్ రోజు విజయ్ ఇంటికి వెళ్లిన త్రిష అతడికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పడం, ప్రమాణం స్వీకారం వేడుకకు హాజరుకావడం కూడా కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.
షాకిచ్చిన త్రిష...
సంగీతకు విడాకులు ఇచ్చి త్రిషను విజయ్ పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా సోమవారం దళపతి విజయ్ బర్త్‌డే సందర్భంగా సీఎంకు కోలీవుడ్, బాలీవుడ్‌తో పాటు ఇతర భాషల సినీ ప్రముఖులు విషెస్ చెప్పారు. విజయ్ పుట్టినరోజు సందర్భంగా త్రిష ఎలాంటి పోస్ట్ పెడుతుందోనని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూశారు. కానీ వారికి త్రిష పెద్ద షాకిచ్చింది. స్పెషల్ పోస్ట్ సంగతి పక్కనపెడితే కనీసం విషెస్ కూడా చెప్పలేదు. అంతే కాకుండా ఇన్‌స్టాగ్రామ్‌లో విజయ్‌ని అన్‌ఫాలో చేసింది. త్రిష ఫాలోవర్స్ లిస్ట్‌లో విజయ్ కనిపించకపోవడం హాట్‌టాపిక్‌గా మారింది. విజయ్‌తో త్రిష ప్రేమ బంధానికి బ్రేకప్ పడిందని పలువురు నెటిజన్లు ట్వీట్స్, పోస్ట్‌లు పెడుతున్నారు. విజయ్ ప్రతి పుట్టినరోజుకు అతడితో అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఫొటోలు, పోస్ట్‌లు పెట్టేది త్రిష. ఈ సారి విష్ చేయకపోవడానికి కారణమేమిటి? ఎందుకు సడెన్‌గా అతడిని అన్‌ఫాలో చేసిందన్నది నెట్టింట చర్చనీయాంశంగా మారింది.
రాజీ ప్రయత్నాలు
అభిప్రాయభేదాలను పక్కనపెట్టి భార్య సంగీతతో కలిసి బతకాలని విజయ్ నిర్ణయించుకున్నారట. విజయ్ తల్లిదండ్రులతో పాటు సంగీత బంధువులు వీరిద్దరిని కలిపేందుకు కొన్నాళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. రాజీ ప్రయత్నాలు దాదాపు సక్సెస్ అయినట్లు చెబుతున్నారు. మరోసారి తన వల్ల విజయ్ ఫ్యామిలీలో మనస్పర్థలు రావడం ఇష్టం లేకనే త్రిష...విజయ్‌కి బర్త్‌డే విషెస్ చెప్పలేదని అంటున్నారు. అనవసరపు వివాదాలు, రూమర్లకు తావు లేకుండా ఉండాలనే విజయ్‌ని అన్‌ఫాలో చేసినట్లు చెబుతున్నారు. మరికొందరు నెటిజన్లు మాత్రం భార్యతో విజయ్ కలిసుండాలనే నిర్ణయంపై త్రిష హర్ట్ అయిందని అంటున్నారు. ఈ కారణం వల్లే విజయ్‌తో బంధానికి గుడ్‌బై చెప్పాలని చెన్నై క్వీన్ నిర్ణయించుకుందని కామెంట్లు పెడుతున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●ITR Filing | ఐటీఆర్ ఫైలింగ్ సులభమే.. తొలిసారి రిటర్న్స్ దాఖలు చేసేవారికి పూర్తి గైడ్..
- ●Vijay-Trisha | విజయ్ - త్రిష బంధానికి బ్రేకప్ పడిందా..? నెట్టింట కొత్త చర్చ
- ●Micro Plastics | తాగునీటిలో మైక్రోప్లాస్టిక్స్.. ఆర్వో ప్యూరిఫైయర్స్ అవసరం అంటున్న నిపుణులు..
- ●Basara Temple | బాసర ఆలయంలో భారీ చోరీ.. అమ్మవారి కిరీటం ఎత్తుకెళ్లిన దొంగలు
- ●Gold And Silver Prices Today | భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. బులియన్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత..
- ●Telegram | టెలిగ్రామ్ సేవలు పునఃప్రారంభం

ITR Filing | ఐటీఆర్ ఫైలింగ్ సులభమే.. తొలిసారి రిటర్న్స్ దాఖలు చేసేవారికి పూర్తి గైడ్..

Vijay-Trisha | విజయ్ - త్రిష బంధానికి బ్రేకప్ పడిందా..? నెట్టింట కొత్త చర్చ

Micro Plastics | తాగునీటిలో మైక్రోప్లాస్టిక్స్.. ఆర్వో ప్యూరిఫైయర్స్ అవసరం అంటున్న నిపుణులు..

Basara Temple | బాసర ఆలయంలో భారీ చోరీ.. అమ్మవారి కిరీటం ఎత్తుకెళ్లిన దొంగలు





