త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ramchander Rao | ఓయూ ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి

Ramchander Rao | ఓయూ ఉద్యోగుల స‌మస్య‌ల‌ను త‌క్ష‌ణ‌మే ప‌రిష్క‌రించాల‌ని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ఎన్ రామ‌చంద‌ర్ రావు డిమాండ్ చేశారు. ఓపీఎస్ అమ‌లు చేయ‌డంతో పాటు పెన్ష‌న్, రిటైర్‌మెంట్ బెనిఫిట్స్, మెడిక‌ల్ స‌దుపాయాల‌ను క‌ల్పించాల‌న్నారు.

S

Telangana | Published On Nov 4, 2026, 7.18 pm IST

Ramchander Rao | ఓయూ ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి
Advertisement

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్‌రావు డిమాండ్‌

Ramchander Rao | త్రినేత్ర న్యూస్ : ఓయూ ఉద్యోగుల స‌మస్య‌ల‌ను త‌క్ష‌ణ‌మే ప‌రిష్క‌రించాల‌ని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ఎన్ రామ‌చంద‌ర్ రావు డిమాండ్ చేశారు. ఓపీఎస్ అమ‌లు చేయ‌డంతో పాటు పెన్ష‌న్, రిటైర్‌మెంట్ బెనిఫిట్స్, మెడిక‌ల్ స‌దుపాయాల‌ను క‌ల్పించాల‌న్నారు. ఓయూలో విధులు నిర్వ‌ర్తిస్తున్న రెగ్యులర్, కాంట్రాక్టు, టైమ్‌స్కేల్, పార్ట్‌టైమ్ ఉద్యోగులు, సాంకేతిక సిబ్బంది తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం పోరాడుతున్నార‌ని రామ‌చంద‌ర్ రావు తెలిపారు.

ఉద్యోగుల సమస్యలు ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయని, పరిష్కరిస్తామని హామీలు ఇస్తున్నప్పటికీ ఆచరణలో చర్యలు తీసుకోవడం లేదని మండిప‌డ్డారు. ఉద్యోగులు ప్రజాస్వామ్య పద్ధతిలో హక్కుల కోసం పోరాడుతుంటే వీసీ, పరిపాలన అధికారులు వారి పోరాటాన్ని నిర్వీర్యం చేయ‌డం సరికాదన్నారు. గతంలో ఉద్యోగుల సమస్యలపై గొంతెత్తిన అధ్యక్షుడు మనోహర్‌ను సస్పెండ్ చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ఓయూ ఉద్యోగుల సమ్మెకు బీజేపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

Advertisement
Advertisement