త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Regina Cassandrra | ద‌క్షిణాది న‌టులంటే బాలీవుడ్‌లో చుల‌క‌నే – జాన్వీక‌పూర్‌కు రెజీనా కౌంట‌ర్‌

ఇటీవల తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌పై జాన్వీక‌పూర్‌, రాధిక ఆప్టే చేసిన విమ‌ర్శ‌ల‌పై త‌మిళ హీరోయిన్ రెజీనా కౌంట‌ర్ ఇచ్చింది. బాలీవుడ్‌లోనూ ద‌క్షిణాది న‌టుల‌పై వివ‌క్ష ఎక్కువేన‌ని అన్న‌ది. అక్ష‌య్‌కుమార్‌తో ఓ సినిమా చేసినా ప్ర‌మోష‌న్స్‌లో తన పేరు ఎక్క‌వ క‌నిపించ‌కుండా చేశార‌ని అన్న‌ది.

N

Entertainment | Published On Nov 5, 2026, 3.06 pm IST

Regina Cassandrra | ద‌క్షిణాది న‌టులంటే బాలీవుడ్‌లో చుల‌క‌నే – జాన్వీక‌పూర్‌కు రెజీనా కౌంట‌ర్‌
Advertisement

Regina Cassandrra |  ఇటీవ‌ల తెలుగు ఇండ‌స్ట్రీపై బాలీవుడ్ హీరోయిన్లు జాన్వీక‌పూర్‌తో పాటు రాధిక ఆప్టే చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి. కెమెరా యాంగిల్స్‌, క‌థ , సీన్లు గురించి హీరోయిన్ల‌కు వివ‌రించే సంస్కృతి టాలీవుడ్‌లో క‌నిపించ‌ద‌ని జాన్వీక‌పూర్ అన్న‌ది. ద‌క్షిణాదిలో పురుషాధిక్య‌త ఎక్కువ‌ని, త‌న‌కంటే వ‌య‌సులో చాలా పెద్ద న‌టుడితో రొమాన్స్ చేయ‌డం క‌ష్ట‌మైందంటూ రాధిక ఆప్టే చెప్పింది. ఈ ఇద్ద‌రి హీరోయిన్ల కామెంట్ల‌ను టాలీవుడ్ వ‌ర్గాలు త‌ప్పుప‌ట్టాయి. అవ‌కాశాలు వ‌చ్చేవ‌ర‌కు తెలుగు ద‌ర్శ‌కులు, హీరోల‌పై పొగ‌డ్త‌లు కురిపించి..సినిమాలు చేసిన త‌ర్వాత విమ‌ర్శ‌లు చేయ‌డం స‌రికాదంటూ ఫైర్ అవుతోన్నారు.

రెజీనా కౌంట‌ర్‌...

ఈ బాలీవుడ్ హీరోయిన్ల‌కు కోలీవుడ్ బ్యూటీ రెజీనా కౌంట‌ర్ ఇచ్చింది. బాలీవుడ్‌లో తాను చాలా వివ‌క్ష‌ను ఎదుర్కొన్న‌ట్లు చెప్పింది. అక్ష‌య్‌కుమార్ లాంటి స్టార్ హీరోతో సినిమా చేసినా త‌న పేరును ప్ర‌మోష‌న్స్‌లో ఎక్క‌డ క‌నిపించ‌కుండా చేశార‌ని అన్న‌ది.

చుల‌క‌న‌గా...

"బాలీవుడ్‌లో ద‌క్షిణాది న‌టుల‌ను చుల‌క‌న‌గా చూస్తారు. అందుకు నా కెరీర్‌లో జ‌రిగిన ఓ సంఘ‌ట‌నే ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ‌. క‌ర‌ణ్ జోహార్‌కు చెందిన ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌లో హిందీలో ఓ సినిమా చేశాం. అందులో అక్ష‌య్‌కుమార్ భార్య‌గా న‌టించా. అగ్ర నిర్మాణ సంస్థ‌, పెద్ద హీరోతో సినిమా అన‌గానే సంతోష‌ప‌డ్డా. షూటింగ్ వ‌ర‌కు అంత‌గా బాగానే జ‌రిగింది. ఆ త‌ర్వాతే అస‌లు స‌మ‌స్య‌లు మొద‌ల‌య్యాయి. సినిమా ప్ర‌మోష‌న్స్‌లో ఎక్క‌డ నా పేరు క‌నిపించ‌కుండా చేశారు. నాపై షూట్ చేసిన ఓ పాట‌ను రిలీజ్ చేశారు. కానీ నా పేరు కూడా ట్యాగ్ చేయ‌లేదు. సినిమాల‌కు సంబంధించిన ఈవెంట్‌ల‌కు నాకు ఆహ్వానం అంద‌లేదు. క‌నీసం అందుకు కార‌ణం ఏమిట‌న్న‌ది కూడా చెప్ప‌లేదు. ఆ సంఘ‌ట‌న న‌న్ను చాలా బాధ‌పెట్టింది. ద‌క్షిణాది న‌టి అనే ఒకే ఒక్క కార‌ణంగానే న‌న్ను చిన్న‌చూపు చూశార‌ని అనుకోవ‌చ్చా?" అంటూ రెజీనా ఫైర్ అయ్యింది.

ద‌క్షిణాది సినీ ప‌రిశ్ర‌మ గురించి బాలీవుడ్ హీరోయిన్లు చేసే విమ‌ర్శ‌లు, చీప్ కామెంట్ల వ‌ల్లే ఇండ‌స్ట్రీల మ‌ధ్య విభ‌జ‌న‌లు వ‌స్తున్నాయ‌ని రెజీనా అన్న‌ది. స‌మ‌స్య ఉంద‌ని అనుకుంటే ఆ సినిమాల నుంచి త‌ప్పుకుంటే ఎవ‌రికి ఇబ్బంది ఉండ‌ద‌ని చెప్పింది.

 

Advertisement
Advertisement