KAC Trust | విద్యార్థులకు కామరాజు అన్నపూర్ణమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆర్థిక పురస్కారం
KAC Trust | ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించేందుకు కామరాజు అన్నపూర్ణమ్మ చారిటబుల్ ట్రస్ట్ (KAC Trust) ప్రత్యేక ఆర్థిక పురస్కారాలను అందజేస్తున్నది. పదో తరగతి పరీక్షల్లో 500, అంతకంటే ఎక్కువ మార్కులు సాధించినవారికి రూ.50 వేల నగదు బహుమతిని ప్రదానం చేస్తున్నది.
KAC Trust | త్రినేత్ర న్యూస్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించేందుకు కామరాజు అన్నపూర్ణమ్మ చారిటబుల్ ట్రస్ట్ (KAC Trust) ప్రత్యేక ఆర్థిక పురస్కారాలను అందజేస్తున్నది. విద్యార్థుల్లో పోటీతత్వాన్ని, ఉన్నత లక్ష్యాలను పెంపొందించేందుకు పదో తరగతి పరీక్షల్లో 500 లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించినవారికి రూ.50 వేల నగదు బహుమతిని ప్రదానం చేస్తున్నది. ఇందులో భాగంగా 2025-26 విద్యా సంవత్సరంలో పదో తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన 43 మందికి ఆర్థిక సహాయం (Merit Award) అందించనుంది. ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున మొత్తం రూ.21,50,000 నగదు అందజేస్తున్నది.
ఈ నెల 10న మధ్యాహ్నం 2 గంటలకు మేడ్చల్ జిల్లా నిజాంపేటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల-1లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ (Naveen Nicolas) చేతుల మీదుగా విద్యార్థులకు ఆర్థిక పురస్కారం అందజేయనుంది. ఈ మేరకు కేఏసీ ట్రస్టు చైర్మన్ నరేంద్ర కుమార్ కామరాజు వెల్లడించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●FII Buying | భారత మార్కెట్లకు పోటెత్తుతున్న విదేశీ పెట్టుబడులు.. అత్యధికంగా కొంటున్న స్టాక్స్ ఇవే..
- ●Niranjan Reddy | డ్రామాగా మారిన రైతు భరోసా.. ఆ మెసేజ్లు సర్కారు వైఫల్యానికి నిదర్శనం: నిరంజన్ రెడ్డి
- ●Uttar Pradesh | వివాహేతర సంబంధం.. భార్యను కుర్చీకి కట్టేసి సజీవ దహనం చేసిన భర్త
- ●Ramayana Review | రావణుడి కోణంలో సాగే రామాయణం - నితీష్ తివారీ కథలో ఫిక్షన్ ఎంత?
- ●Padmashali Bhavan | కోకాపేటలో పద్మశాలి ఆత్మగౌరవ భవన నిర్మాణం.. రూ.5 కోట్లు మంజూరు
- ●Supreme Court | విచారణ పేరుతో అక్రమ నిర్బంధాలకు అడ్డుకట్ట.. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు

FII Buying | భారత మార్కెట్లకు పోటెత్తుతున్న విదేశీ పెట్టుబడులు.. అత్యధికంగా కొంటున్న స్టాక్స్ ఇవే..

Niranjan Reddy | డ్రామాగా మారిన రైతు భరోసా.. ఆ మెసేజ్లు సర్కారు వైఫల్యానికి నిదర్శనం: నిరంజన్ రెడ్డి

Uttar Pradesh | వివాహేతర సంబంధం.. భార్యను కుర్చీకి కట్టేసి సజీవ దహనం చేసిన భర్త

Ramayana Review | రావణుడి కోణంలో సాగే రామాయణం - నితీష్ తివారీ కథలో ఫిక్షన్ ఎంత?






