త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

forcibly kissing | చిన్నారులను బలవంతంగా ముద్దుపెట్టుకోవడం ప్రేమ అనిపించుకోదు.. ముంబై కోర్టు సంచ‌ల‌న తీర్పు

forcibly kissing | ఓ వ్య‌క్తి చిన్నారిని బ‌ల‌వంతంగా ముద్దుపెట్టుకోవ‌డం (forcibly kissing), కొర‌క‌డాన్ని ప్రేమ, ఆప్యాయ‌త‌గా భావించ‌లేమ‌ని ముంబై (Mumbai)లోని ప్ర‌త్యేక పోక్సో కోర్టు (special POCSO court) స్ప‌ష్టం చేసింది.

D

National | Published On Oct 21, 2026, 2.51 pm IST

forcibly kissing | చిన్నారులను బలవంతంగా ముద్దుపెట్టుకోవడం ప్రేమ అనిపించుకోదు.. ముంబై కోర్టు సంచ‌ల‌న తీర్పు
Advertisement

forcibly kissing | త్రినేత్ర న్యూస్ : ఓ వ్య‌క్తి చిన్నారిని బ‌ల‌వంతంగా ముద్దుపెట్టుకోవ‌డం (forcibly kissing), కొర‌క‌డాన్ని ప్రేమ, ఆప్యాయ‌త‌గా భావించ‌లేమ‌ని ముంబై (Mumbai)లోని ప్ర‌త్యేక పోక్సో కోర్టు (special POCSO court) స్ప‌ష్టం చేసింది. ఈ కేసుకు సంబంధించి 50 ఏళ్ల వ్య‌క్తిని దోషిగా నిర్ధారించిన కోర్టు.. ఐదేళ్ల క‌ఠిన కారాగార శిక్ష విధిస్తూ సంచ‌ల‌న తీర్పు వెలువరించింది.

ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే..

గ‌తేడాది మార్చిలో నాలుగేళ్ల చిన్నారి త‌న త‌ల్లితో క‌లిసి గుడికి వెళ్లింది. ఆ స‌మ‌యంలో త‌ల్లి కంటే చిన్నారి కొన్ని అడుగులు ముందు న‌డుస్తుండ‌గా ఓ అప‌రిచిత వ్య‌క్తి బాలిక‌ను గ‌ట్టిగా ప‌ట్టుకుని ముద్దుపెట్టుకున్నాడు. అంతేకాకుండా బుగ్గ‌పై, మెడ వెనుక భాగంలో కొరికాడు. దీంతో ఆ చిన్నారి భ‌యంతో గ‌ట్టిగా ఏడ్చేసింది. అప్ర‌మ‌త్త‌మైన స్థానికులు నిందితుడిని ప‌ట్టుకుని పోలీసుల‌కు అప్ప‌గించారు. అప్ప‌టి నుంచి అత‌డు క‌స్ట‌డీలోనే ఉన్నాడు. ఈ కేసుపై పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఈ కేసుకు సంబంధించి 2025 మే 9న కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయ‌గా.. 2026 ఏప్రిల్ 8న అభియోగాలు మోపారు.

ప్రేమ‌తోనే ముద్దు పెట్టా

ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరఫున బాధితురాలిని (బాలిక‌), ఆమె తల్లి, ప్రత్యక్ష సాక్షి, నిందితుడిని పట్టుకున్న స్థానికుడు, దర్యాప్తు అధికారులు, వైద్యురాలు స‌హా ఎనిమిది మంది సాక్షులను విచారించారు. విచార‌ణ సంద‌ర్భంగా తాను కేవ‌లం ప్రేమ‌తోనే చిన్నారికి ముద్దు పెట్టిన‌ట్లు నిందితుడు వాదించాడు. త‌న‌పై వ‌చ్చిన లైంగిక ఆరోప‌ణ‌ల‌ను తీవ్రంగా ఖండించాడు. త‌న‌ను ఈ కేసులో ఇరికించారంటూ పేర్కొన్నాడు. ఫిర్యాదుదారు ఇంటికి తాను నిర్మాణ పనులు చేశానని, ఆమె భర్త తనకు రూ.70,000 రూపాయలు ఇవ్వాల్సి ఉందని ఆరోపించాడు. అయితే ఈ విషయాన్ని నిందితుడు కేవలం తన చివరి వాంగ్మూలంలో మాత్రమే లేవనెత్తాడని కోర్టు గుర్తుచేసింది. దీనికి సంబంధించి ఎలాంటి పత్రాలు కానీ, సాక్షులు కానీ లేకపోవడంతో న్యాయమూర్తి దీనిని చివ‌రి నిమిషంలో అల్లిన‌ క‌ట్టుక‌థ‌గా అభివర్ణించింది.

సమాజానికి ఒక గట్టి సందేశం

మ‌రోవైపు చిన్నారి మాట్లాడుతూ.. తెలిసిన వారు తనను ఎత్తుకుని ముద్దాడిన‌ త‌ర్వాత తన తల్లికి అప్పగించేవారని బాలిక కోర్టుకు చెప్పింది. బాలిక మాట‌ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న కోర్టు.. పరిచయమున్నవారైతే అలానే ప్రవర్తిస్తారని, కానీ ఈ కేసులో నిందితుడు అపరిచితుడని పేర్కొంది. ఈ సంద‌ర్భంగా నిందితుడి వాద‌న‌ను న‌మ్మ‌శ‌క్యంగా లేద‌ని కోర్టు కొట్టిపారేసింది. బలవంతంగా ముద్దుపెట్టుకోవడం ప్రేమ అనిపించుకోదని వ్యాఖ్యానించింది. నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడి అనేది అత్యంత తీవ్రమైన నేరమని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఇలాంటి నేరాలను ప్రారంభ దశలోనే అడ్డుకుని నిందితుల‌ను క‌ఠినంగా శిక్షించాల‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. అప్పుడే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సమాజానికి ఒక గట్టి సందేశం వెళ్తుందని పేర్కొన్నారు.

నిందితుడి వ‌య‌సు, అత‌ని గ‌త నేర‌చ‌రిత్ర‌ను ప‌రిశీలించిన కోర్టు.. అత‌డికి ఐదేళ్ల క‌ఠిన కారాగార శిక్ష‌ను విధించింది. దీంతోపాటూ రూ.10,000 జ‌రిమానా కూడా విధించింది. ఒకవేళ జరిమానా చెల్లించడంలో విఫలమైతే మరో రెండు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంద‌ని స్ప‌ష్టం చేసింది. బాధితురాలైన బాలికకు రూ.5,000 నష్ట‌ప‌రిహారం ఇవ్వాల‌ని ఆదేశించింది.

Also Read..

స‌నాత‌న ధ‌ర్మాన్ని పాటించే వారే అమ్మ‌వారి విగ్ర‌హాల‌ను తాకాలి.. బెంగాల్ సీఎం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల కేసులో క్రైమ్ థ్రిల్లర్: మహిళలతో గన్ డెలివరీ.. ఆ ఒక్క ఫోన్ కాల్‌తో షూటర్ల ఎస్కేప్ ప్లాన్ ఖతం

ప్ర‌పంచంలోనే.. మీథేన్ గ్యాస్ విడుద‌ల‌లో జ‌వ‌హ‌ర్‌న‌గ‌ర్ డంప్ యార్డ్ నాలుగో స్థానం

Advertisement
Advertisement