త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nagastra-2 | సైన్యం చేతికి నాగాస్త్ర-2.. శ‌త్రువుల‌కు వ‌ణుకే

Nagastra-2 | భారత సైన్యం (Indian Army) అమ్ముల పొదిలోకి మరో శక్తిమంతమైన స్వదేశీ అస్త్రం చేరింది. సైన్యం చేతికి నాగాస్త్ర -2 (Nagastra-2) అందింది.

D

National | Published On Oct 23, 2026, 3.00 pm IST

Nagastra-2 | సైన్యం చేతికి నాగాస్త్ర-2.. శ‌త్రువుల‌కు వ‌ణుకే
Advertisement

Nagastra-2 | త్రినేత్ర న్యూస్ : భార‌త ర‌క్ష‌ణ రంగం రోజురోజుకూ మ‌రింత బ‌లంగా మారుతోంది. ఈ నేప‌థ్యంలోనే తాజాగా భారత సైన్యం (Indian Army) అమ్ముల పొదిలోకి మరో శక్తిమంతమైన స్వదేశీ అస్త్రం చేరింది. సైన్యం చేతికి నాగాస్త్ర -2 (Nagastra-2) అందింది. పూర్తి స్వ‌దేశీ ప‌రిజ్ఞానంతో త‌యారైన ఈ నాగాస్త్ర‌-2 యాంటీ ట్యాంక్ లాయిట‌రింగ్ మ్యూనిష‌న్ వ్య‌వ‌స్థ‌ను నాగ్‌పూర్ (Nagpur)కు చెందిన సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ సంస్థ (Solar Defence and Aerospace Ltd) రూపొందించింది.

నాగాస్త్ర-2 ఒక‌సారి గాల్లోకి ఎగిరితే ఏకధాటిగా 60 నిమిషాల పాటు గాల్లోనే ఎగ‌ర‌గ‌ల‌దు. శ‌త్రువుల క‌దలిక‌ల‌ను క‌నిపెట్ట‌డంతో పాటు, యుద్ధ ట్యాంకుల‌పై ఆత్మాహుతి దాడికి పాల్ప‌డి వాటిని నాశ‌నం చేస్తుంది. పగలు, రాత్రి వేళల్లో శత్రువుల కదలికలపై నిఘా పెట్టేందుకు వీలుగా హై-టెక్ డే-అండ్-నైట్ సర్వైవలెన్స్ కెమెరాలను అమర్చారు. 50 కిలోమీటర్ల దూరంలోని శత్రు స్థావరాలను ఇది కచ్చితత్వంతో ఛేదించగలదు. నాలుగు కిలోల వార్‌హెడ్‌ను మోస్తూ 650 మిల్లీమీట‌ర్ల మందం ఉన్న శ‌త్రు యుద్ధ ట్యాంకుల‌ను కూడా తుత్తునియ‌లు చేస్తుంది. దీనికి సంబంధించిన అన్ని సాంకేతిక ప‌రీక్ష‌లు రాజ‌స్థాన్‌లోని మ‌హాజ‌న్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌లో ఆగ‌స్టులో పూర్త‌య్యాయి. ఆధునిక యుద్ధ రంగంలో శత్రువులు ప్రయోగించే జీపీఎస్ జామింగ్ (GPS Jamming), కమ్యూనికేషన్ జామింగ్, స్పూఫింగ్ వంటి ముప్పులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా ఇందులో ECCM (Electronic Counter-Countermeasures) సాంకేతికతను జోడించారు.

Also Read..

విభజన శక్తులకు వ్య‌తిరేకంగా ఐక్యంగా పోరాడాలి.. ప్రధాని మోదీ పిలుపు

బీజేపీవి దృష్టి మ‌ళ్లింపు రాజ‌కీయాలు: ఎంపీ మ‌ల్లు ర‌వి

అరుణాచల్ ప్రదేశ్ స‌రిహ‌ద్దు వెంబ‌డి చైనాతో ఘ‌ర్ష‌ణ‌లు కొన‌సాగుతున్నాయి : ఐటీబీపీ చీఫ్

Advertisement
Advertisement