త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

HMDA e-Auction | కోకాపేట‌లో మ‌రోసారి రికార్డు ధ‌ర‌.. ఎక‌రం రూ.120 కోట్లు!

HMDA e-Auction | న‌గ‌రంలోని భూములు, ప్లాట్ల‌ను విక్ర‌యించేందుకు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (HMDA) మ‌రోసారి ఈ -వేలం (HMDA e-Auction) నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇందులో భాగంగా కోకాపేటలోని (Kokapet) నియోపోలిస్ లేఅవుట్‌లోని సర్వే నంబరు 239, 240లోని 4.59 ఎకరాలు అమ్మ‌కానికి ఉంచింది.

G

Hyderabad | Published On Oct 25, 2026, 8.42 am IST

HMDA e-Auction | కోకాపేట‌లో మ‌రోసారి రికార్డు ధ‌ర‌.. ఎక‌రం రూ.120 కోట్లు!
Advertisement

HMDA e-Auction | త్రినేత్ర న్యూస్‌: న‌గ‌రంలోని భూములు, ప్లాట్ల‌ను విక్ర‌యించేందుకు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (HMDA) మ‌రోసారి ఈ -వేలం (HMDA e-Auction) నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇందులో భాగంగా కోకాపేటలోని (Kokapet) నియోపోలిస్ లేఅవుట్‌లోని సర్వే నంబరు 239, 240లోని 4.59 ఎకరాలు అమ్మ‌కానికి ఉంచింది. ఇక్కడ రికార్డు స్థాయిలో ఎకరా కనీస ధర రూ.120 కోట్లుగా నిర్ణయించింది. గతంలో ఈ భూమి ఈ వేలం ద్వారా విక్రయానికి పెట్టినా..సింగిల్‌ బిడ్‌ రావడంతో తిరస్కరించి మళ్లీ ఈ-వేలం నిర్వ‌హిస్తున్న‌ది.

దీంతోపాటు మూసాపేటలోని 3.15 ఎకరాల స్థ‌లాన్ని కూడా వేలం వేయ‌నుంది. ఇక్కడ ఎకరా కనీస ధర రూ.99 కోట్లుగా నిర్ధారించింది. కోకాపేట్, రాయ‌దుర్గం నౌఖల్సా, కాప్రా, బాచుపల్లి (Bachupally), అమీన్‌పూర్‌లోని 302 చదరపు గజాల నుంచి 8,591 చదరపు గజాల వరకు మొత్తం 9 ప్రాంతాల్లో భూ విభాగాలను ఈ-వేలం (e-Auction) ద్వారా విక్రయించనుంది. ఇక్కడ కనీస ధర చదరపు గజానికి రూ.30 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు ఖ‌రారు చేసింది.

మరోవైపు నివాస ప్లాట్ల ఈ-వేలానికి సంబంధించి కూడా హెచ్‌ఎండీఏ ప్రకటన జారీచేసింది. రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఇస్నాపూర్ హెచ్‌ఎండీఏ లేఅవుట్‌లో 185 నుంచి 900 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న 45 ప్లాట్లను అమ్మకానికి పెట్టింది. గజానికి కనీస ధర రూ.15 వేలుగా నిర్ణయించింది. గతంలో ఇక్కడ గరిష్ఠంగా గజానికి రూ.20 వేల వరకు పలికింది. మేడ్చల్ జిల్లా బాచుపల్లి లేఅవుట్‌లో 268 నుంచి 400 గజాల విస్తీర్ణం కలిగిన 50 ప్లాట్లకు గజం కనీస ధర రూ.45 వేలుగా నిర్ణ‌యించింది. షేక్‌పేట్ మండలం హకీంపేటలో (Hakimpet) 1,084 నుంచి 1,497 గజాల విస్తీర్ణం ఉన్న‌ 6 భారీ ప్లాట్లను చదరపు గజం రికార్డు స్థాయిలో రూ.2 లక్షల కనీస ధరతో వేలానికి తీసుకువ‌చ్చింది. వచ్చే నెల 12వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఈ భూములు, ప్లాట్ల ఈ-వేలం ప్రక్రియ ఆన్‌లైన్ ద్వారా జరగనుంది. పూర్తి వివరాల కోసం హెచ్‌ఎండీఏ హెల్ప్‌లైన్ నంబర్లు 74168 85522, 74161 68858 సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.

Advertisement
Advertisement