త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Special Trains | చ‌ర్ల‌ప‌ల్లి, హైద‌రాబాద్ నుంచి ప్ర‌త్యేక రైళ్లు.. ప‌లు స‌ర్వీసులు పొడిగింపు..

Special Trains | దీపావ‌ళి పండుగ నేప‌థ్యంలో ప్ర‌యాణికుల సౌక‌ర్యం కోసం ద‌క్షిణ మ‌ధ్య రైల్వే (SCR) వ‌న్‌వే స్పెష‌ల్ రైళ్ల‌ను (Special Trains) న‌డుపుతున్న‌ది. అదేవిధంగా ఇప్ప‌టికే న‌డుస్తున్న కొన్ని ప్ర‌త్యేక రైల్ స‌ర్వీసుల‌ను పొడిగించింది.

G

Telangana | Published On Oct 25, 2026, 9.07 am IST

Special Trains | చ‌ర్ల‌ప‌ల్లి, హైద‌రాబాద్ నుంచి ప్ర‌త్యేక రైళ్లు.. ప‌లు స‌ర్వీసులు పొడిగింపు..
Advertisement

Special Trains | త్రినేత్ర న్యూస్‌: దీపావ‌ళి పండుగ నేప‌థ్యంలో ప్ర‌యాణికుల సౌక‌ర్యం కోసం ద‌క్షిణ మ‌ధ్య రైల్వే (SCR) వ‌న్‌వే స్పెష‌ల్ రైళ్ల‌ను (Special Trains) న‌డుపుతున్న‌ది. అదేవిధంగా ఇప్ప‌టికే న‌డుస్తున్న కొన్ని ప్ర‌త్యేక రైల్ స‌ర్వీసుల‌ను పొడిగించింది. చ‌ర్ల‌ప‌ల్లి-ప్ర‌యాగ్‌రాజ్‌, హైద‌రాబాద్-పార్వ‌తీపురం మ‌ధ్య వ‌న్‌వే రైళ్ల‌ను (One way Trains) న‌డుపుతున్న‌ది.

చర్లపల్లి - ప్రయాగ్‌రాజ్ (రైలు నంబరు 07077): ఈ ప్రత్యేక రైలు అక్టోబర్ 25న (ఆదివారం) ఉదయం 10 గంటలకు చర్లపల్లి స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. మరుసటి రోజు (సోమవారం) ఉదయం 10.35 గంటలకు ప్రయాగ్‌రాజ్ చేరుకుంటుంది. ఇది కాజీపేట, మంచిర్యాల, సిర్పూర్ కాగజ్‌నగర్, బల్లార్షా, చంద్రపూర్, నాగపూర్, జుఝార్‌పూర్, ఇటార్సీ, జబల్‌పూర్, కట్నీ, సత్నా, మాణిక్‌పూర్ స్టేషన్లలో ఆగుతుంది.

హైదరాబాద్ - పార్వతీపురం (రైలు నంబరు 07078): ఇది అక్టోబర్ 27 మంగళవారం మధ్యాహ్నం 15.30 (3.30) గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి, మరుసటి రోజు (బుధవారం) ఉదయం 7 గంటలకు పార్వతీపురం చేరుకుంటుంది. ఇది మార్గమధ్యంలో చర్లపల్లి, నల్ల‌గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ, విజయనగరం స్టేషన్లలో ఆగుతుంది.

ఈ రైళ్లు పొడిగింపు..

జాల్నా - ఛప్రా (రైలు నంబ‌ర్‌ 07651): బుధవారం నడిచే ఈ ప్రత్యేక రైలు సర్వీసులను నవంబర్ 11, నవంబర్ 18, నవంబర్ 25 తేదీల్లో మరో 3 ట్రిప్పుల పాటు పొడిగించింది.

ఛప్రా - జాల్నా(రైలు నంబర్ 07652): శుక్రవారం నడిచే ఈ రైలు సర్వీసులను నవంబర్‌ 13, నవంబర్ 20, నవంబర్ 27 తేదీల్లో మరో 3 ట్రిప్పుల పాటు పొడిగించింది. పండుగ ప్రయాణాలు చేసేవారు ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

Advertisement
Advertisement