త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tirumala | తిరుమ‌ల క్యూలైన్‌లో పాముల క‌ల‌క‌లం.. భ‌యంతో భ‌క్తుల ప‌రుగులు

Tirumala | క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవం శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామివారు కొలువైన తిరుమ‌ల‌లో (Tirumala) రెండు భారీ పాములు క‌ల‌క‌లం సృష్టించాయి. భక్తులు వేచి ఉండే క్యూ లైన్ల (Queue Lines) వద్ద‌ పాములు రావడం భ‌యాందోళనల‌కు గురిచేసింది.

G

National | Published On Mar 21, 2026, 9.21 am IST

Tirumala | తిరుమ‌ల క్యూలైన్‌లో పాముల క‌ల‌క‌లం.. భ‌యంతో భ‌క్తుల ప‌రుగులు
Advertisement

Tirumala | త్రినేత్ర‌.న్యూస్‌: క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవం శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామివారు కొలువైన తిరుమ‌ల‌లో (Tirumala) రెండు భారీ పాములు క‌ల‌క‌లం సృష్టించాయి. భక్తులు వేచి ఉండే క్యూ లైన్ల (Queue Lines) వద్ద‌ పాములు రావడం భ‌యాందోళనల‌కు గురిచేసింది. శ్రీవారి దర్శనం కోసం శిలాతోరణం వరకు విస్తరించిన క్యూ లైన్ల సమీపంలో రెండు భారీ పాములు కనిపించాయి. అందులో ఒకటి 8 అడుగులు ఉండగా, మరొకటి 6 అడుగుల పొడవు ఉంది. దీంతో భక్తులు పరుగులు తీశారు. అప్ర‌మ‌త్త‌మైన టీటీడీ (TTD) సిబ్బంది అట‌వీ అధికారులకు సమాచారం ఇచ్చారు. స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు వాటిని బంధించారు. అనంత‌రం వాటిని అట‌వీ సిబ్బందికి అందించారు.

నేడు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల..

శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల‌ను శ‌నివారం ఉద‌యం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, జ్యేష్ఠాభిషేకం టికెట్లు ఆన్‌లైన్ అందుబాటులో ఉంచ‌నుంది. అదేవిధంగా వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటా టికెట్లు కూడా మధ్యాహ్నం 3 గంటలకు విడుద‌ల చేయ‌నుంది.

Advertisement
Advertisement