త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Air India | మ‌రో ఇద్ద‌రు ఎయిర్ ఇండియా పైల‌ట్ల‌కు డ్ర‌గ్స్ పాజిటివ్‌

Air India | పుకెట్ నుంచి ఢిల్లీ వ‌చ్చిన ఎయిరిండియా విమానం పైలట్‌కు (Air India Pilots) డోప్‌ టెస్టు నిర్వహించగా.. పాజిటివ్‌గా తేలిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు మ‌రో ఇద్ద‌రు ఎయిర్ ఇండియా పైల‌ట్లు డ్రగ్స్ పరీక్షలో (Drug Test) విఫలమయ్యారు.

D

National | Published On Aug 17, 2026, 1.15 pm IST

Air India | మ‌రో ఇద్ద‌రు ఎయిర్ ఇండియా పైల‌ట్ల‌కు డ్ర‌గ్స్ పాజిటివ్‌
Advertisement

Air India | త్రినేత్ర‌.న్యూస్ : టాటా ఆధీనంలోని ప్ర‌ముఖ దేశీయ విమాన‌యాన సంస్థ ఎయిర్ ఇండియా (Air India) ఇటీవ‌లే వ‌రుస వివాదాల‌తో స‌త‌మ‌త‌మ‌వుతోంది. గ‌తేడాది అహ్మ‌దాబాద్ ప్ర‌మాదం త‌ర్వాత‌ వరుస ఘటనలు, సాంకేతిక లోపాలు, భద్రతా ఆందోళనలతో ఎయిర్ ఇండియా నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఇప్పుడు మ‌రోసారి హెడ్‌లైన్స్‌లో నిలిచింది. ఇటీవలే పుకెట్ నుంచి ఢిల్లీ వ‌చ్చిన ఎయిరిండియా విమానం పైలట్‌కు (Air India Pilots) డోప్‌ టెస్టు నిర్వహించగా.. పాజిటివ్‌గా తేలిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు మ‌రో ఇద్ద‌రు ఎయిర్ ఇండియా పైల‌ట్లు డ్రగ్స్ పరీక్షలో (Drug Test) విఫలమయ్యారు. అయితే, తుది పరీక్ష ఫలితాలు రావాల్సి ఉంది. ఈ లోపు ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌గా ఆ ఇద్ద‌రు పైల‌ట్ల‌ను విధులకు దూరంగా ఉంచారు.

ఈ నెల 4న పుకెట్ నుంచి ఢిల్లీ వ‌చ్చిన ఎయిర్ ఇండియా విమానం గాల్లో ఉండ‌గా అక‌స్మాత్తుగా 300 అడుగుల కింద‌కు జారిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌లో దాదాపు 15 నుంచి 20 మంది ప్ర‌యాణికుల‌కు తీవ్ర గాయాల‌య్యాయి. ఈ ఘ‌ట‌న‌ను సీరియ‌స్‌గా తీసుకున్న డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) సంస్థ సీఈవోకు నోటీసులు జారీ చేసింది. ఇక విమానం ఢిల్లీ ఎయిర్‌పోర్టులో సుర‌క్షితంగా ల్యాండ్ అయింది. విమానం ల్యాండ్ అయిన తర్వాత నిబంధనల ప్రకారం పైలట్లకు డోప్ పరీక్షలు నిర్వహించారు. మొదట చేసిన స్క్రీనింగ్ టెస్టులోనూ, ఆ తర్వాత ల్యాబొరేటరీకి పంపిన రెండో కన్ఫర్మేటరీ పరీక్షలోనూ పైలట్ గంజాయి తీసుకున్నట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో అప్ర‌మత్త‌మైన టాటా య‌జ‌మాన్యంలోని ఎయిర్ ఇండియా సంస్థ స్క్రీనింగ్ ప్రక్రియను చేపట్టింది. ఇందులో భాగంగానే ఇప్ప‌టి వ‌ర‌కూ సుమారు 400 మంది పైల‌ట్ల‌కు ప‌రీక్ష‌లు నిర్వ‌హించింది.

Also Read..

తప్పులు ఎన్‌టీఏ చేస్తే.. శిక్ష మాత్రం విద్యార్థులు అనుభ‌విస్తున్నారు.. మోదీ ప్ర‌భుత్వంపై రాహుల్ గాంధీ ఫైర్‌

ఈ రిక్షా బ్యాట‌రీ పేలి భారీ అగ్నిప్ర‌మాదం.. ఇద్ద‌రు మృతి

అర్హులైన చేనేత కార్మికుల‌కు చేయూత పెన్ష‌న్‌ ఇవ్వండి..: ఎల్ ర‌మ‌ణ‌

Advertisement
Advertisement