MLC Ramana | అర్హులైన చేనేత కార్మికులకు చేయూత పెన్షన్ ఇవ్వండి..: ఎల్ రమణ
MLC Ramana | రాష్ట్రంలోని అర్హులైన చేనేత కార్మికులకు చేనేత పథకం ద్వారా పెన్షన్ అందించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్. రమణ (MLC Ramana) డిమాండ్ చేశారు. అర్హులైన ఏ ఒక్క చేనేత కార్మికుడు (Handloom Workers) కూడా పథకానికి దూరం కాకుండా చేయూత పథకాన్ని (Cheyutha Pension) అమలు చేయాలన్నారు.
MLC Ramana | త్రినేత్ర.న్యూస్: రాష్ట్రంలోని అర్హులైన చేనేత కార్మికులకు చేనేత పథకం ద్వారా పెన్షన్ అందించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్. రమణ (MLC Ramana) డిమాండ్ చేశారు. అర్హులైన ఏ ఒక్క చేనేత కార్మికుడు (Handloom Workers) కూడా పథకానికి దూరం కాకుండా చేయూత పథకాన్ని (Cheyutha Pension) అమలు చేయాలన్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి, చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావుకు లేఖ రాశారు.
తరతరాలుగా వేలాది కుటుంబాలకు చేనేత రంగం జీవనోపాధిగా ఉందని చెప్పారు. అయితే వృద్ధాప్యం, ఆదాయలేమి, వృత్తిపరమైన ఇబ్బందులతో అనేక మంది చేనేత కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అలాంటి అర్హులైన చేనేత కార్మికులకు సామాజిక భద్రత కల్పించేందుకు చేయూత పథకం ద్వారా పింఛన్ అందించడం ఎంతో అవసరమన్నారు. కొత్తగా చేయూత పథకం అమలు చేస్తున్నకారణంగా ఇప్పటికే ఆసరా పెన్షన్ (Asara Pension) పొందుతున్న కార్మికులకు ఎలాంటి నష్టం, అన్యాయం జరుగకుండా చూడాలన్నారు.
అదేవిధంగా చేనేత సహకార సంఘంలో సభ్యత్వం కలిగి 50 ఏండ్లు నిండిన, అర్హత కలిగిన పేద కార్మికులకు కొత్తగా చేయూత ద్వారా పింఛన్ అందించాలన్నారు. దీనికోసం ఇటీవల జరిగిన చేనేత సహకార సంఘాల ఎన్నికలలో చేనేత జౌళి శాఖ ధ్రువీకరించిన జాబితాను ఆధారంగా తీసుకోవాలని చెప్పారు. తద్వారా అర్హులైన లబ్ధిదారులను గుర్తించడం సులభమవుతుందని, పారదర్శకంగా, వేగంగా ప్రక్రియ పూర్తి చేయవచ్చని వెల్లడించారు.
చేనేత రంగంలో పనిచేస్తున్న ప్రతి కార్మికుడు సహకార సంఘంలో సభ్యుడై ఉండాలని ఏమీ లేదు. అందువల్ల జియో ట్యాగ్ (Geo Tag) కలిగి, చేనేత వృత్తిలో కొనసాగుతున్న అర్హులైన నేతన్నలకు ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాల ఆధారంగా చేయూత పథకాన్ని వర్తింపచేయాలన్నారు. దీంతో సహకార సంఘంలో సభ్యత్వం లేనప్పటికీ, చేనేత వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్న అర్హులైన నేతన్నలకు కూడా సామాజిక భద్రత కల్పించవచ్చన్నారు.
సంబంధిత వార్తలు

Dasoju Sravan Kumar | నిన్ను కూల్చనీకి కేసీఆర్ అక్కర్లేదు.. నీకు నీవే కూల్చుకునే అసలైన భస్మాసురుడివి నువ్
ఆగస్టు 17, 2026

Harish Rao | ఆలోచన, ఆచరణ కేసీఆర్‌ది.. ప్రచారం కాంగ్రెస్‌ది: హరీశ్ రావు
ఆగస్టు 17, 2026

Chinnareddy | తప్పుడుగాండ్లను పార్టీ నుంచి బయటకు పంపాలి.. లేదంటే నేను మరో జీవన్ రెడ్డి కావాల్సివస్తది: చిన్నారెడ్డి
ఆగస్టు 17, 2026
తాజావార్తలు
- ●Malavika Sharma | బీఫ్ ఇష్టమా? - మలయాళ మూవీ ప్రమోషన్స్‌లో టాలీవుడ్ హీరోయిన్‌కు ప్రశ్న - నెటిజన్లు ఫైర్
- ●Air India | మరో ఇద్దరు ఎయిర్ ఇండియా పైలట్లకు డ్రగ్స్ పాజిటివ్
- ●Ravi Teja | ఇవేం బూతులు బాబోయ్ - ఇరుముడి ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై నెటిజన్ల ట్రోల్స్
- ●Dasoju Sravan Kumar | నిన్ను కూల్చనీకి కేసీఆర్ అక్కర్లేదు.. నీకు నీవే కూల్చుకునే అసలైన భస్మాసురుడివి నువ్
- ●Rahul Gandhi | తప్పులు ఎన్టీఏ చేస్తే.. శిక్ష మాత్రం విద్యార్థులు అనుభవిస్తున్నారు.. మోదీ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ ఫైర్
- ●Income Tax | విదేశీ ఆస్తులున్న పన్ను చెల్లింపుదారులకు గుడ్‌న్యూస్.. డిసెంబర్ 31 వరకు అవకాశం

Malavika Sharma | బీఫ్ ఇష్టమా? - మలయాళ మూవీ ప్రమోషన్స్‌లో టాలీవుడ్ హీరోయిన్‌కు ప్రశ్న - నెటిజన్లు ఫైర్

Air India | మరో ఇద్దరు ఎయిర్ ఇండియా పైలట్లకు డ్రగ్స్ పాజిటివ్

Ravi Teja | ఇవేం బూతులు బాబోయ్ - ఇరుముడి ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై నెటిజన్ల ట్రోల్స్

Dasoju Sravan Kumar | నిన్ను కూల్చనీకి కేసీఆర్ అక్కర్లేదు.. నీకు నీవే కూల్చుకునే అసలైన భస్మాసురుడివి నువ్



