త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

e-rickshaw battery blast | ఈ రిక్షా బ్యాట‌రీ పేలి భారీ అగ్నిప్ర‌మాదం.. ఇద్ద‌రు మృతి

e-rickshaw battery blast | ఈ రిక్షా బ్యాట‌రీ పేలి (e-rickshaw battery blast) భారీ అగ్నిప్ర‌మాదం చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు వ్య‌క్తులు ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీలోని ర‌ఘుబీర్ న‌గ‌ర్‌లో సోమ‌వారం ఉద‌యం ఈ ఘ‌ట‌న‌ చోటు చేసుకుంది.

D

National | Published On Aug 17, 2026, 11.56 am IST

e-rickshaw battery blast | ఈ రిక్షా బ్యాట‌రీ పేలి భారీ అగ్నిప్ర‌మాదం.. ఇద్ద‌రు మృతి
Advertisement

e-rickshaw battery blast | త్రినేత్ర‌.న్యూస్ : ఈ రిక్షా బ్యాట‌రీ పేలి (e-rickshaw battery blast) భారీ అగ్నిప్ర‌మాదం చోటు చేసుకుంది. ఈ ప్ర‌మాదంలో ఇద్ద‌రు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘ‌ట‌న ప‌శ్చిమ ఢిల్లీ (Delhi)లోని ర‌ఘుబీర్ న‌గ‌ర్‌లో (Raghubir Nagar) సోమ‌వారం ఉద‌యం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. మోతీ న‌గ‌ర్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని మ‌సీద్‌ గురుద్వారా రోడ్డులో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

ఆర్-17ఏ భ‌వ‌నం మొదటి అంత‌స్తులోని గోదాములో (Delhi godown) ఈ రిక్షా బ్యాట‌రీ ఒక్క‌సారిగా పేలిపోయింది. దీంతో పెద్ద ఎత్తున మంట‌లు చెల‌రేగాయి. క్ష‌ణాల్లోనే మంట‌లు బిల్డింగ్ మొత్తం వ్యాపించాయి. అప్ర‌మ‌త్త‌మైన స్థానికులు అగ్నిమాప‌క సిబ్బందికి స‌మాచారం అందించారు. వెంట‌నే మూడు ఫైర్ ఇంజిన్లతో ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న అగ్నిమాప‌క సిబ్బంది స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. మంట‌ల‌ను అదుపుచేసేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ ప్ర‌మాదంలో 17 ఏళ్ల సుఫైద్‌, 38 ఏళ్ల మొహ‌మ్మ‌ద్ సామిద్ ప్రాణాలు కోల్పోయారు. మ‌రో ఇద్ద‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. క్ష‌త‌గాత్రుల‌ను గురు గోవింగ్ సింగ్ ( Guru Gobind Singh Hospital) ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌మాదానికి గ‌ల క‌చ్చిత‌మైన కార‌ణాలు తెలియ‌రాలేదు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Also Read..

మొన్న‌ సీజేపీ.. ఇప్పుడు గ్రౌండ్‌లోకి దిమాగీ న‌క్స‌ల్ పార్టీ..

మ‌ళ్లీ ప‌రుగులు పెడుతున్న ప‌సిడి.. పెట్టుబ‌డిదారుల ఆస‌క్తి..

త‌ప్పుడుగాండ్ల‌ను పార్టీ నుంచి బ‌య‌ట‌కు పంపాలి.. లేదంటే నేను మ‌రో జీవ‌న్ రెడ్డి కావాల్సివ‌స్త‌ది: చిన్నారెడ్డి

Advertisement
Advertisement