Ravi Teja | ఇవేం బూతులు బాబోయ్ – ఇరుముడి ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై నెటిజన్ల ట్రోల్స్
రవితేజ హీరోగా నటించిన ఇరుముడి మూవీ ఆగస్ట్ 21న థియేటర్లలోకి రాబోతుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ ఈవెంట్‌లో రవితేజతో పాటు నటుడు అజయ్ ఘోష్ బూతులు మాట్లాడటంపై నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
Entertainment | Published On Aug 17, 2026, 12.57 pm IST
Ravi Teja | ఇరుముడి ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై నెటిజన్లు ఫైర్ అవుతోన్నారు. హీరోతో పాటు ఇతర యాక్టర్లు బూతులు మాట్లాడటంపై ట్రోల్ చేస్తున్నారు. రవితేజ హీరోగా నటించిన ఈ మూవీ ఆగస్ట్ 21న థియేటర్లలోకి రాబోతుంది. తండ్రీకూతుళ్ల అనుబంధానికి మైథాలజీ ఎలిమెంట్స్ జోడించి దర్శకుడు శివ నిర్వాణ ఈ సినిమాను తెరకెక్కించారు. ఇరుముడిలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటించింది.
రవితేజ, అజయ్ ఘోష్...
ఇరుముడి ప్రమోషన్స్‌లో భాగంగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ వేడుకలో రవితేజతో పాటు అజయ్ ఘోష్ స్పీచ్‌లో బూతులు దొర్లాయి. వాటిపై నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఎర్రి***కా...
ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన నక్షత్రకు ముద్దు పేరు ఏదైతే బాగుంటుందని యాంకర్ అడిగిన ప్రశ్నకు రవితేజ ముదురు***డా అంటూ బదులిచ్చారు. చిన్నారిని ఉద్దేశించి రవితేజ వ్యాఖ్యలు చాలా అనుచితంగా ఉన్నాయంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అంతకుముందు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడిన అజయ్ ఘోష్ కూడా తన స్పీచ్‌లో చాలానే బూతులు మాటలు వాడారు. రవితేజ గురించి గొప్పగా చెప్పే క్రమంలో ఎర్రి ***కా....అవతలికి దెం***వోయ్ వంటి పదాలు వాడారు. . అజయ్ ఘోష్ కామెంట్లపై చిత్ర యూనిట్ కూడా కొంత ఇబ్బంది పడ్డారు. అవేం బూతులు అంటూ రవితేజ కూడా మందలించారు.
క్షమాపణలు చెప్పాల్సిందే...
అయ్యప్పస్వామి భక్తల పవిత్రంగా భావించే ఇరుముడి అనే పదాన్ని టైటిల్‌గా పెట్టుకొని ఇలా బూతులు మాట్లాడటం సరికాదంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఈ బూతులపై చిత్రయూనిట్ క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. నెటిజన్ల కామెంట్లపై మేకర్స్ ఎలా రియాక్ట్ అవుతారన్నది చూడాల్సిందే.
జీవీ ప్రకాష్ కుమార్....
ఇరుముడిలో సాయికుమార్, స్వాసిక, అజయ్ ఘోష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నారు. వరుస ఫ్లాపుల్లో ఉన్న రవితేజతో పాటు డైరెక్టర్ శివనిర్వాణను ఇరుముడి అయినా గట్టెక్కిస్తుందా? లేదా? అన్నది టాలీవుడ్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Short Film | నో లాంగర్ హ్యూమన్ షార్ట్ ఫిల్మ్‌పై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ప్రశంసలు
ఆగస్టు 8, 2026

Tejeswini | తేజస్విని సినీ ఎంట్రీకి రంగం సిద్ధం..! కథను సిద్ధం చేస్తున్న లేడి డైరెక్టర్..!
ఆగస్టు 5, 2026

Tollywood | ఆగస్ట్ బరిలో స్టార్స్ – టాక్సిక్ తో పాటు ఈ నెలలో రిలీజ్ కానున్న సినిమాలు ఇవే
ఆగస్టు 1, 2026
తాజావార్తలు
- ●Ramchandar Rao | వందేమాతర గేయాన్ని అవమానించారు.. కాంగ్రెస్‌వాళ్లకు సిగ్గు మిగిలి ఉంటే క్షమాపణ చెప్పాలి
- ●Malavika Sharma | బీఫ్ ఇష్టమా? - మలయాళ మూవీ ప్రమోషన్స్‌లో టాలీవుడ్ హీరోయిన్‌కు ప్రశ్న - నెటిజన్లు ఫైర్
- ●Air India | మరో ఇద్దరు ఎయిర్ ఇండియా పైలట్లకు డ్రగ్స్ పాజిటివ్
- ●MLC Ramana | అర్హులైన చేనేత కార్మికులకు చేయూత పెన్షన్ ఇవ్వండి..: ఎల్ రమణ
- ●Dasoju Sravan Kumar | నిన్ను కూల్చనీకి కేసీఆర్ అక్కర్లేదు.. నీకు నీవే కూల్చుకునే అసలైన భస్మాసురుడివి నువ్
- ●Rahul Gandhi | తప్పులు ఎన్టీఏ చేస్తే.. శిక్ష మాత్రం విద్యార్థులు అనుభవిస్తున్నారు.. మోదీ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ ఫైర్

Ramchandar Rao | వందేమాతర గేయాన్ని అవమానించారు.. కాంగ్రెస్‌వాళ్లకు సిగ్గు మిగిలి ఉంటే క్షమాపణ చెప్పాలి

Malavika Sharma | బీఫ్ ఇష్టమా? - మలయాళ మూవీ ప్రమోషన్స్‌లో టాలీవుడ్ హీరోయిన్‌కు ప్రశ్న - నెటిజన్లు ఫైర్

Air India | మరో ఇద్దరు ఎయిర్ ఇండియా పైలట్లకు డ్రగ్స్ పాజిటివ్

MLC Ramana | అర్హులైన చేనేత కార్మికులకు చేయూత పెన్షన్ ఇవ్వండి..: ఎల్ రమణ



