Aviation | ఎయిర్ ఇండియా పైలట్‌కు ‘డోప్’ టెస్ట్‌లో పాజిటివ్?
Aviation | ఫుకెట్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో తీవ్ర కుదుపులు చోటుచేసుకున్న ఘటనలో మరో అంశం తెరపైకి వచ్చింది. విమానం ఢిల్లీ చేరుకున్న అనంతరం పైలట్‌కు నిర్వహించిన సైకోయాక్టివ్ సబ్‌స్టాన్స్ (డోప్) టెస్ట్‌లో పాజిటివ్‌గా వచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అయితే. ఈ విషయంపై ఎయిర్ ఇండియా ఇప్పటి వరకు ధ్రువీకరించలేదు. టెస్ట్ ఫలితాలు తమకు అందలేదని ఎయిర్‌లైన్స్ స్పష్‌టం చేసింది.
- ఫుకెట్-ఢిల్లీ విమానంలో తీవ్ర కుదుపులు..
- ఘటనపై డీజీసీఏ దర్యాప్తు
Aviation | ఫుకెట్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో తీవ్ర కుదుపులు చోటుచేసుకున్న ఘటనలో మరో అంశం తెరపైకి వచ్చింది. విమానం ఢిల్లీ చేరుకున్న అనంతరం పైలట్‌కు నిర్వహించిన సైకోయాక్టివ్ సబ్‌స్టాన్స్ (డోప్) టెస్ట్‌లో పాజిటివ్‌గా వచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అయితే. ఈ విషయంపై ఎయిర్ ఇండియా ఇప్పటి వరకు ధ్రువీకరించలేదు. టెస్ట్ ఫలితాలు తమకు అందలేదని ఎయిర్‌లైన్స్ స్పష్‌టం చేసింది. ఎయిర్ ఇండియా తెలిపిన వివరాల ప్రకారం.. నిబంధనల మేరకు విమానం ఢిల్లీ చేరుకున్న తర్వాత సిబ్బందికి పోస్ట్-ఫ్లైట్ స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించారు. అయితే, పరీక్ష ఫలితాలను తమకు ఇంకా అందజేయలేదని పేర్కొంది. అందువల్ల ఫలితాలపై ప్రస్తుతం ఎలాంటి వ్యాఖ్య చేయలేమని స్పష్టం చెప్పింది. సివిల్ ఏవియేషన్ నిబంధనల ప్రకారం.. విమాన సిబ్బందికి ఎయిర్ ఇండియా క్రమం తప్పకుండా డ్రగ్ పరీక్షలు నిర్వహిస్తుందని సంస్థ తెలిపింది. నిర్దిష్ట విమానం, ఘటనతో సంబంధం లేకుండా కూడా ఈ పరీక్షలు జరుగుతాయని వెల్లడించింది. అవసరమైతే సంబంధిత అధికారులకు దర్యాప్తులో పూర్తిగా సహకరిస్తామని పేర్కొంది.
విమానంలో తీవ్ర కుదుపులు
ఫ్లైట్ AI-2379 మంగళవారం ఉదయం 8.41 గంటలకు థాయ్‌లాండ్‌లోని ఫుకెట్ నుంచి ఢిల్లీకి బయలుదేరింది. విమానంలో 134 మంది ప్రయాణికులు ఉన్నారు. ఢిల్లీకి చేరుకునే ముందు క్రూజ్ దశలో విమానం తీవ్ర కుదుపులకు గురైంది. దాదాపు రెండు నుంచి మూడు నిమిషాల పాటు విమానం బలంగా ఊగినట్లు ప్రయాణికులు తెలిపారు. కుదుపుల తీవ్రతకు విమానం క్యాబిన్ సీలింగ్ సైతం దెబ్బతిన్నట్లు సమాచారం. ఘటన అనంతరం విమానం సురక్షితంగా ఢిల్లీలో ల్యాండ్ అయింది. ఈ ఘటనపై పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తోంది. కుదుపుల సమయంలో పైలట్లు పరిస్థితిని ఎంత సమర్థంగా ఎదుర్కొన్నారు? ప్రతికూల వాతావరణం కారణంగానే ఘటన జరిగిందా? లేక మరేదైనా కారణం ఉందా? కుదుపుల ప్రభావంతో విమానం హైడ్రాలిక్ వ్యవస్థపై ఏమైనా ప్రభావం పడిందా? వంటి అంశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. అంతేకాకుండా సమీపంలోని వారణాసి, లక్నో వంటి విమానాశ్రయాల్లో విమానాన్ని దారి మళ్లించకుండా ఢిల్లీకి తీసుకురావడానికి గల కారణాలపైనా దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
దర్యాప్తు పూర్తయ్యే వరకు గ్రౌండింగ్
ప్రస్తుత నిబంధనలు, ప్రొటోకాల్స్ ప్రకారం ఇలాంటి ఘటనల్లో సంబంధిత విమాన సిబ్బందిని దర్యాప్తు పూర్తయ్యే వరకు విమాన విధులకు దూరంగా ఉంచుతారు. ఈ ఘటనలోనూ విమాన పైలట్లను ఫ్లయింగ్ విధుల నుంచి తప్పించినట్లు సమాచారం. అయితే, పైలట్ డోప్ పరీక్షలో పాజిటివ్‌గా వచ్చినట్లు వస్తున్న సమాచారం అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. డీజీసీఏ దర్యాప్తు, పరీక్ష ఫలితాల ఆధారంగానే ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Varun Batchigari | అమెరికాలో ప్రియురాలిని చంపి ఇండియాకు పారిపోతుండగా.. జర్మనీలో దొరికిపోయిన ఇండియన్ స్టూడెంట్!
- ●Anasuya | గుమ్మడి కాయ దొంగ అంటూ అనసూయ పోస్ట్ - ఆ హీరోకు కౌంటర్ అంటోన్న నెటిజన్లు
- ●August 15 | నిఘానీడలో ఎర్రకోట.. పంద్రాగస్టుకు కట్టుదిట్టబమైన భద్రత
- ●Harish Rao | నిరుపేదలను డాక్టర్లను చేసే బాధ్యత నాదే.. పట్టుదలతో చదివి గొప్ప ఆఫీసర్లుగా ఎదగండి
- ●NALSAR Students vs CJI Surya Kant | కాన్వకేషన్‌కు 'చీఫ్ గెస్ట్'గా సీజేఐ సూర్యకాంత్ వద్దే వద్దు: నల్సార్ విద్యార్థుల సంచలన నిర్ణయం
- ●Aircraft Crash | బరామతిలో కూలిన ట్రైయినీ విమానం.. ఇద్దరు పైలట్లు సేఫ్

Varun Batchigari | అమెరికాలో ప్రియురాలిని చంపి ఇండియాకు పారిపోతుండగా.. జర్మనీలో దొరికిపోయిన ఇండియన్ స్టూడెంట్!

Anasuya | గుమ్మడి కాయ దొంగ అంటూ అనసూయ పోస్ట్ - ఆ హీరోకు కౌంటర్ అంటోన్న నెటిజన్లు

August 15 | నిఘానీడలో ఎర్రకోట.. పంద్రాగస్టుకు కట్టుదిట్టబమైన భద్రత

Harish Rao | నిరుపేదలను డాక్టర్లను చేసే బాధ్యత నాదే.. పట్టుదలతో చదివి గొప్ప ఆఫీసర్లుగా ఎదగండి





