HMWSSB | నీటి సంరక్షణలో బీమా ప్రైడ్ అపార్ట్‌మెంట్ చొరవ.. స్విమ్మింగ్ పూల్ మూసివేత..
HMWSSB | నీటి వనరుల సంరక్షణ, సమర్థ వినియోగం దిశగా కొంపల్లిలోని బీమా ప్రైడ్ అపార్ట్‌మెంట్ అసోసియేషన్ తీసుకున్న ముందస్తు నిర్ణయాలను జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి అభినందించారు.
ఫ్లోర్ క్లీనింగ్, వాహనాల కడుగుదలపై నిషేధం
తాగునీటి అవసరాలకే తొలి ప్రాధాన్యం
అసోసియేషన్ అధ్యక్షుడు సంపత్ రెడ్డి, నివాసితులకు
లమండలి ఎండీ కె. అశోక్ రెడ్డి ప్రత్యేక అభినందనలు
ఇతర గేటెడ్ కమ్యూనిటీలు సైతం నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలి
HMWSSB | త్రినేత్ర న్యూస్ : నీటి వనరుల సంరక్షణ, సమర్థ వినియోగం దిశగా కొంపల్లిలోని బీమా ప్రైడ్ అపార్ట్‌మెంట్ అసోసియేషన్ తీసుకున్న ముందస్తు నిర్ణయాలను జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి అభినందించారు. ఎల్-నినో.. వర్షాభావ పరిస్థితులు, భూగర్భ జలమట్టాల తగ్గుదల, రానున్న నెలల్లో నీటి అవసరాలు పెరిగే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని అపార్ట్‌మెంట్ అసోసియేషన్ స్వచ్ఛందంగా నీటి పొదుపు చర్యలు చేపట్టడం ప్రశంసనీయమని పేర్కొన్నారు.
ఎల్-నినో వల్ల వర్షపాతం తగ్గడం.. భూగర్భ జలాల సహజ పునరుద్ధరణపై ప్రభావం పడే అవకాశం ఉండటం, భూగర్భ జలాల వినియోగం పెరిగితే నీటిమట్టాలు మరింత తగ్గే ప్రమాదం ఉండటం, రానున్న వేసవిలో నీటి డిమాండ్ పెరిగే అవకాశాలు ఉండటం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని అసోసియేషన్ ముందస్తు చర్యలకు నిర్ణయించినట్లు తెలిపారు.
ముఖ్యంగా రానున్న ఎనిమిది నెలల కాలంలో నివాసితుల రోజువారీ తాగునీటి, గృహ అవసరాలకు సరిపడా నీటి లభ్యతను కాపాడుకోవడం, అందుబాటులో ఉన్న నీటి వనరులపై ఒత్తిడిని తగ్గించడం, అనవసర వినియోగాన్ని నియంత్రించడం ఈ నిర్ణయాల ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో కమ్యూనిటీ స్విమ్మింగ్ పూల్‌ను తక్షణమే మూసివేయడంతో పాటు ఫ్లోర్ క్లీనింగ్, వాహనాల కడుగుదల వంటి అవసరం లేని కార్యకలాపాలకు నీటి వినియోగాన్ని నిషేధించడం సమయోచితమైన నిర్ణయమని ఎండీ ప్రశంసించారు. వ్యక్తిగత సౌకర్యాల కంటే తాగునీటి అవసరాలకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వడం సామాజిక బాధ్యతకు నిదర్శనమని అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా బీమా ప్రైడ్ అపార్ట్‌మెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు సంపత్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు, నివాసితులందరికీ ఎండీ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. నీటి వనరుల పరిరక్షణ కోసం ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావడం హర్షణీయమని, ఇటువంటి నిర్ణయాలు సమాజంలో నీటి సంరక్షణపై అవగాహన పెంపొందించేందుకు దోహదపడతాయని పేర్కొన్నారు.
హైదరాబాద్ మహానగర పరిధిలోని ఇతర గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్ అసోసియేషన్లు కూడా తమ పరిధిలో నీటి వినియోగాన్ని సమీక్షించుకుని, వృథాను అరికట్టేందుకు తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. ముఖ్యంగా లీకేజీల నివారణ, నీటి వినియోగంపై పర్యవేక్షణ, పునర్వినియోగానికి అనువైన నీటిని వినియోగించడం, వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థల నిర్వహణపై దృష్టి సారించాలని కోరారు.
తాజావార్తలు
- ●Jagga Reddy Gangakatwa Canal | ఆనాడు నిజాం.. నేడు జగ్గారెడ్డి
- ●Shraddha Kapoor | ప్రసవ వేదనలోనూ నాట్యమే ప్రాణం!.. 30న శ్రద్ధా కపూర్ ‘ఈతా’ ట్రైలర్
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లకు నష్టాలు.. సెన్సెక్స్ 353 పాయింట్లు డౌన్..
- ●Banjara Hills SI Vijay Arrest | చీటింగ్ కేసులో అరెస్ట్ చేయను కానీ.. 10 లక్షలు ఇవ్వు
- ●OBC Declaration | 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని తొలగించాలి
- ●Errolla Srinivas | బూతు పురాణాలకు గాంధీ భవన్ అడ్డాగా మారింది : ఎర్రోళ్ల శ్రీనివాస్

Jagga Reddy Gangakatwa Canal | ఆనాడు నిజాం.. నేడు జగ్గారెడ్డి

Shraddha Kapoor | ప్రసవ వేదనలోనూ నాట్యమే ప్రాణం!.. 30న శ్రద్ధా కపూర్ ‘ఈతా’ ట్రైలర్

Stock Markets | స్టాక్ మార్కెట్లకు నష్టాలు.. సెన్సెక్స్ 353 పాయింట్లు డౌన్..

Banjara Hills SI Vijay Arrest | చీటింగ్ కేసులో అరెస్ట్ చేయను కానీ.. 10 లక్షలు ఇవ్వు





