త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BR Naidu | 30 ఏళ్లుగా ఆమెతో ప‌రిచ‌యం.. త‌ప్పేముంది..! బీఆర్ నాయుడు కీల‌క వ్యాఖ్య‌

BR Naidu | టీటీడీ చైర్మ‌న్‌గా నిస్వార్థంగా ప‌ని చేస్తుంటే త‌న‌పై కొంద‌రు ఉద్దేశ‌పూర్వ‌కంగా బుర‌ద జ‌ల్లుతున్నార‌ని బీఆర్ నాయుడు మండిప‌డ్డారు. ఓ వీడియోతో త‌న‌పై త‌ప్పుడు ప్ర‌చారాలు చేస్తున్న ఘ‌ట‌న‌పై తిరుప‌తిలో బీఆర్ నాయుడు ఆదివారం మీడియాతో మాట్లాడారు.

S

National | Published On Mar 1, 2026, 6.37 pm IST

BR Naidu | 30 ఏళ్లుగా ఆమెతో ప‌రిచ‌యం.. త‌ప్పేముంది..! బీఆర్ నాయుడు కీల‌క వ్యాఖ్య‌
Advertisement

మార్ఫింగ్ కూడా స‌రిగా చేయ‌లేక‌పోయారు
అస‌లు ఆ వీడియోలో అభ్యంత‌రం ఏముంది?
అస‌త్య ప్ర‌చారాల‌కు నేనేమీ బెద‌ర‌ను
భూమ‌న‌, వైవీకి హెచ్చ‌రిక‌
ఎవ‌ర్నీ కూడా వ‌దిలిపెట్టే ప్ర‌స‌క్తే లేదు
తేల్చిచెప్పిన బీఆర్ నాయుడు

BR Naidu | త్రినేత్ర‌.న్యూస్ : టీటీడీ చైర్మ‌న్‌గా నిస్వార్థంగా ప‌ని చేస్తుంటే త‌న‌పై కొంద‌రు ఉద్దేశ‌పూర్వ‌కంగా బుర‌ద జ‌ల్లుతున్నార‌ని బీఆర్ నాయుడు మండిప‌డ్డారు. ఓ వీడియోతో త‌న‌పై త‌ప్పుడు ప్ర‌చారాలు చేస్తున్న ఘ‌ట‌న‌పై తిరుప‌తిలో బీఆర్ నాయుడు ఆదివారం మీడియాతో మాట్లాడారు.

కుంభ‌కోణాల‌కు పాల్ప‌డి ఇరుక్కున్న వారు త‌న‌పై దుష్ప్ర‌చారాలు చేస్తున్నారు.నాకు ఈ పదవి బతుకుదెరువు కాదు.. టీటీడీని ప్రక్షాళన చేద్దామనే ఇక్కడికి వచ్చా. సామాన్య భక్తులకు పెద్దపీట వేయాలని సీఎం నన్ను నియమించారు. దానికి అనుగుణంగా పనిచేస్తున్నా. అసత్య ప్రచారాలకు నేనేమీ బెదరను.. నా పని నేను చేసుకుంటూ వెళ్తా. అసలు ఆ వీడియోలో తప్పు, అసభ్యత ఏముంది? ఆ వీడియోలో ఉన్నవారు నా కుటుంబ స్నేహితులు. 30 ఏళ్లుగా ఆమెతో, ఆ కుటుంబంతో పరిచయం ఉంది. వీడియోలో కొంత భాగం మార్ఫింగ్‌ చేశారు. అది కూడా స‌రిగా చేయ‌లేక‌పోయారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని తేలిగ్గా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశానని బీఆర్‌ నాయుడు తెలిపారు.

భూమ‌న‌, వైవీ సుబ్బారెడ్డికి హెచ్చ‌రిక‌

మ‌హిళ‌తో బీఆర్ నాయుడు స‌న్నిహితంగా ఉన్న వీడియోల‌పై వైఎస్సార్‌సీపీ నేత‌లు భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలు స్పందిస్తూ.. త‌క్ష‌ణ‌మే టీటీడీ చైర్మ‌న్ ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్య‌ల‌పై బీఆర్ నాయుడు ఘాటుగా స్పందించారు. నేను మీడియాలో ఉన్నా.. మీరిద్ద‌రూ ఏమేమీ చేశారో నాకు తెలుసు. హైద‌రాబాద్ న‌గ‌రం న‌డిబొడ్డున వ్యాపారాలు చేస్తున్నా.. చుక్క‌లు చూపిస్తానని నాయుడు హెచ్చ‌రించారు.

ట్యాగ్స్:

Advertisement
Advertisement