BR Naidu | అవన్నీ ఏఐ, నకిలీ డీప్ ఫేక్ వీడియోలు : టీటీడీ చైర్మన్
BR Naidu | టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఓ మహిళతో సన్నిహితంగా ఉన్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్న సంగతి తెలిసిందే. ఈ వీడియోలపై బీఆర్ నాయుడు స్పందించారు. అవన్నీ ఏఐ, నకిలీ డీప్ ఫేక్ వీడియోలు అని స్పష్టం చేశారు.
BR Naidu | త్రినేత్ర.న్యూస్ : టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఓ మహిళతో సన్నిహితంగా ఉన్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్న సంగతి తెలిసిందే. ఈ వీడియోలపై బీఆర్ నాయుడు స్పందించారు. అవన్నీ ఏఐ, నకిలీ డీప్ ఫేక్ వీడియోలు అని స్పష్టం చేశారు. ఏఐ సాంకేతికతను వాడుకుని, నకిలీ డీప్ ఫేక్ వీడియోలతో నాపై దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. దీని వెనుక రాజకీయ దురుద్దేశం ఉంది.. ఈ కుట్రపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాను అని బీఆర్ నాయుడు తెలిపారు.
వ్యక్తిగతంగా నన్ను అప్రతిష్ట పాలు చేసేందుకు, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను దిగజార్చేందుకు కుట్రలు చేస్తున్నారు. ఏఐ సాంకేతికతను వాడుకుని నా రూపం అనుకరించే విధంగా వీడియోలు తయారు చేసి ప్రచారం చేస్తున్నారు. ఈ కంటెంట్ మొత్తం అసత్యమైనది, వక్రీకరించినది.. ఇది టీటీడీ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు పన్నిన పథకం. దీని వెనుక రాజకీయ దురుద్దేశం ఉంది. వైసీపీకి చెందిన కొందరు ఈ తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు. దీనిపై నేను చట్ట ప్రకారం ముందుకెళ్తాను. నాపై సోషల్ మీడియాలో సాగుతున్న దుష్ప్రచారం వెనుక ఉన్న కుట్రను తేల్చాలని సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాను. నా వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ టీటీడీ ప్రతిష్టను దెబ్బతీస్తున్న వ్యక్తులను, దుష్ట శక్తులను వదిలేది లేదు అని బీఆర్ నాయుడు హెచ్చరించారు.
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






