Stock Markets | స్టాక్ మార్కెట్లలో నీరసం.. స్వల్ప లాభాలతో ముగిసిన సూచీలు..
Stock Markets | భారత స్టాక్ మార్కెట్లు సోమవారం పెద్దగా ఉత్సాహం లేకుండా ముగిశాయి. టైటాన్, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి కొన్ని భారీ కంపెనీల షేర్లలో లాభాలు నమోదైనప్పటికీ, ఎస్‌బీఐ, రిలయన్స్ షేర్లలో వచ్చిన నష్టాలు వాటిని దాదాపుగా భర్తీ చేశాయి.
Stock Markets | భారత స్టాక్ మార్కెట్లు సోమవారం పెద్దగా ఉత్సాహం లేకుండా ముగిశాయి. టైటాన్, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి కొన్ని భారీ కంపెనీల షేర్లలో లాభాలు నమోదైనప్పటికీ, ఎస్‌బీఐ, రిలయన్స్ షేర్లలో వచ్చిన నష్టాలు వాటిని దాదాపుగా భర్తీ చేశాయి. భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, పెరిగిన ముడి చమురు ధరల కారణంగా మార్కెట్‌లలో మదుపరుల సెంటిమెంట్ జాగ్రత్తగా కొనసాగింది. దీంతో వివిధ షేర్లు, రంగాల వారీగా భిన్నమైన కదలికలు కనిపించాయి. సెన్సెక్స్ 43 పాయింట్లు అత్యంత స్వల్పంగా (0.06 శాతం) పెరిగి 78,542 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 50 కూడా 13 పాయింట్లు (0.05 శాతం) స్వల్పంగా లాభపడి 24,583.80 వద్ద ముగిసింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 సూచీ 0.62 శాతం లాభపడగా, స్మాల్‌క్యాప్ 100 సూచీ 0.27 శాతం నష్టపోయింది.
భారీగా పెరిగిన చమురు ధరలు..
కాగా ముడి చమురు ధరలు కూడా మార్కెట్‌లపై ఒత్తిడిని పెంచాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ధర 1.82 శాతానికి పైగా పెరిగి 86 డాలర్లకు చేరింది. డబ్ల్యూటీఐ క్రూడ్ ధర 1.84 శాతం వరకు పెరిగి బ్యారెల్‌కు 78 డాలర్ల వద్ద స్థిరపడింది. ఫారెక్స్ మార్కెట్‌లో భారత రూపాయి విలువ మరోమారు తగ్గింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే 0.10 శాతం నష్టపోయిన రూపాయి 95.29 వద్ద నిలిచింది. మీడియా నివేదికల ప్రకారం.. హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవాలంటే ఇరాన్ విధించిన అన్ని షరతులను అమెరికా అంగీకరించాల్సి ఉంటుందని తెలిసింది. ఇరాన్‌పై విధించిన ఆంక్షలను ఎత్తివేయడంతోపాటు యుద్ధం వల్ల జరిగిన నష్టానికి పరిహారం అందించాలని అప్పుడే జలసంధిని తెరుస్తామని అమెరికాకు ఇరాన్ స్పష్టంగా చెప్పినట్లు సమాచారం.
విస్తృత స్థాయి మార్కెట్లకు మద్దతు..
జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ మాట్లాడుతూ కార్పొరేట్ ఫలితాలు విస్తృత స్థాయి మార్కెట్లకు మద్దతును ఇస్తున్నాయని తెలిపారు. అందువల్లే సూచీలు పతనమవకుండా నిలబడ్డాయని అన్నారు. అయితే యుద్ధ ఉద్రిక్తతలు పెరగడం లేదా జలసంధి తెరుచుకోకపోతే మార్కెట్‌లలో మళ్లీ బలహీనత కనిపించే అవకాశాలు ఉంటాయని అన్నారు.
సంబంధిత వార్తలు

Stock Markets | స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు.. స్టాక్ మార్కెట్లలో కొనసాగుతున్న అస్థిరత..
ఆగస్టు 10, 2026

Stock Markets | చమురు ధరల ఆందోళనతో కుదేలైన మార్కెట్లు.. సెన్సెక్స్, నిఫ్టీ మళ్లీ నష్టాల్లో..
ఆగస్టు 7, 2026

Stock Markets | ఐటీ షేర్ల జోష్.. మార్కెట్లకు మళ్లీ బ్రేక్.. సెన్సెక్స్ 242 పాయింట్లు డౌన్..
ఆగస్టు 7, 2026
తాజావార్తలు
- ●Tribunals Reforms Bill | విపక్షాల నిరసనల మధ్యే.. ట్రైబ్యునల్స్ సంస్కరణల బిల్లుకు లోక్‌సభ ఆమోదం
- ●Ponguleti Srinivas Reddy | హుజూరాబాద్‌లో 394 ఇళ్ల పట్టాలు ఇచ్చాం.. ప్రతిపక్షాలు పొర్లుదండాలు పెట్టినా పథకాలు ఆపం
- ●CM Vikarabad Tour | 15న సంగారెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి
- ●Tamil Thai Vazthu | వందేమాతరం కాదు.. తమిళ్ తాయ్ వాళ్తు ఫస్ట్.. తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం
- ●Harish Rao - Peddi Sudarshan Reddy | నా ప్రాణాలు కాపాడిన చేతులే విగతజీవిగా.. ఆనాటి ఘటన తలచుకొని కన్నీరుమున్నీరైన హరీశ్ రావు
- ●TPCC | ఎస్ఐఆర్పై కాంగ్రెస్ అనుమానాలు

Tribunals Reforms Bill | విపక్షాల నిరసనల మధ్యే.. ట్రైబ్యునల్స్ సంస్కరణల బిల్లుకు లోక్‌సభ ఆమోదం

Ponguleti Srinivas Reddy | హుజూరాబాద్‌లో 394 ఇళ్ల పట్టాలు ఇచ్చాం.. ప్రతిపక్షాలు పొర్లుదండాలు పెట్టినా పథకాలు ఆపం

CM Vikarabad Tour | 15న సంగారెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి

Tamil Thai Vazthu | వందేమాతరం కాదు.. తమిళ్ తాయ్ వాళ్తు ఫస్ట్.. తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం



