త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TRANSCO Recruitment | ట్రాన్స్‌కోలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టులు.. ఈ నెల 30 నుంచి ద‌ర‌ఖాస్తులు

TRANSCO Recruitment | ఇంజినీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులకు ఏపీ ట్రాన్స్‌కో (APTRANSCO) గుడ్​న్యూస్ చెప్పింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న‌ 200 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(AEE) పోస్టుల భర్తీకి నోటిఫికేష‌న్ (TRANSCO Recruitment) విడుద‌ల చేసింది.

G

National | Published On Jun 27, 2026, 6.16 am IST

TRANSCO Recruitment | ట్రాన్స్‌కోలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టులు.. ఈ నెల 30 నుంచి ద‌ర‌ఖాస్తులు
Advertisement

TRANSCO Recruitment | త్రినేత్ర‌.న్యూస్‌: ఇంజినీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులకు ఏపీ ట్రాన్స్‌కో (APTRANSCO) గుడ్​న్యూస్ చెప్పింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న‌ 200 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(AEE) పోస్టుల భర్తీకి నోటిఫికేష‌న్ (TRANSCO Recruitment) విడుద‌ల చేసింది. అర్హత క‌ల‌గిన‌ అభ్యర్థులు ఈ నెల 30 నుంచి జూలై 20 వ‌ర‌కు దరఖాస్తు చేసుకోవ‌చ్చు. ఈ పోస్టులు ఎల‌క్ట్రిక‌ల్‌, సివిల్‌, టెలికాం విభాగాల్లో ఉన్నాయి. రాత ప‌రీక్ష ద్వారా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు. రెండేండ్లు ప్రొబేషన్ పీరియ‌డ్ ఉంటుంది. అనంత‌రం రెగ్యుల‌రైజ్ చేస్తారు. ప్రొబేష‌న్ కాలంలో నెలకు రూ.75,000 జీతం ఇస్తారు. ఆ తర్వాత పే-స్కేల్ ప్రకారం రూ.86,245 నుంచి రూ. 2,08,915 వరకు అందుతుంది.

మొత్తం పోస్టులు: 200
ఇందులో ఏఈఈ ఎలక్ట్రికల్ 167, ఏఈఈ సివిల్ 23, ఏఈఈ టెలికాం 10 చొప్పున ఉన్నాయి.

జోన్ల వారీగా

విశాఖ‌ప‌ట్నం- 34
రాజ‌మండ్రి- 24
విజ‌య‌వాడ‌- 22
అమ‌రావ‌తి- 35
క‌డ‌ప‌- 40
క‌ర్నూల్‌- 45

అర్హ‌త‌లు: సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్స్, సివిల్ ఇంజినీరింగ్‌లో బీఈ లేదా బీటెక్ ఉత్తీర్ణ సాధించాలి. అభ్యర్థులు 2026 జూలై 1 నాటికి 18 ఏండ్ల‌ నుంచి 42 ఏండ్ల‌ మధ్య వయసు కలిగి ఉండాలి. బీసీ, ఎస్టీ, ఎస్సీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం..
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(CBT) ద్వారా. ఈ పరీక్షలో వచ్చిన మార్కులు, జోనల్ లోకల్ కేటగిరీ, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థుల సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది.

దరఖాస్తులు: ఆన్‌లైన్‌లో
అప్లికేషన్ ఫీజు: రూ.1000
దరాఖాస్తులు ప్రారంభం: జూన్ 30
అప్లికేషన్ల‌​కు చివ‌రి తేదీ: జూలై 20
వెబ్‌సైట్‌: https://aptransco.gov.in (or) https://apvidyutrecruitment.apcfss.in.

పూర్తివివ‌రాల‌కు ఇక్క‌డ క్లిక్ చేయండి..

Advertisement
Advertisement