DA, DR hike | విద్యుత్ ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. డీఏ, డీఆర్ పెంపు
DA, DR hike | రాష్ట్ర విద్యుత్ సంస్థ (Power Corporation)ల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లకు కరువు భత్యం (DA), కరువు ఉపశమనం (DR) పెంచుతున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) తెలిపారు.
- సీఎండీలను ఆదేశించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- 19.272 నుంచి 21.815 శాతానికి పెంపు.. జూలై 1 నుంచే వర్తింపు
- 71,360 మందికి ప్రయోజనం
- విద్యుత్ సంస్థలపై నెలకు రూ.14.63 కోట్ల అదనపు భారం
DA, DR hike | త్రినేత్ర న్యూస్: రాష్ట్ర విద్యుత్ సంస్థ (Power Corporation)ల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లకు కరువు భత్యం (DA), కరువు ఉపశమనం (DR) పెంచుతున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) తెలిపారు. ఈమేరకు పెంపు ప్రతిపాదనలు తయారు చేయాలని విద్యుత్ సంస్థల సీఎండీలను ఆదేశించినట్లు చెప్పారు. ప్రస్తుతం 19.272 శాతంగా ఉన్న డీఏ, డీఆర్‌ను 2.543 శాతం పాయింట్లు పెంచి 21.815 శాతానికి సవరించనున్నామన్నారు. ఈ పెంపు ఈ ఏడాది జూలై 1 నుంచే వర్తించనున్నట్లు భట్టి పేర్కొన్నారు. ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్ల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందన్నారు.
కార్మిక శాఖ పరిధిలోని లేబర్ బ్యూరో ప్రకటించే అఖిల భారత ధరల సూచీ ఆధారంగా డీఏ, డీఆర్‌ను సవరిస్తారు. ధరల సూచీలో వచ్చే మార్పులకు అనుగుణంగా ప్రతి ఆరు నెలలకు ఒకసారి జనవరి, జూలై నెలల్లో ఈ సవరణ చేపడుతున్నారు. తాజాగా చేపట్టిన ప్రతిపాదిత పెంపునకు ఆమోదం లభించి అమల్లోకి వస్తే రాష్ట్రంలోని నాలుగు విద్యుత్ సంస్థల పరిధిలో 71,360 మంది ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుంది. ఇందుకోసం విద్యుత్ సంస్థలపై నెలకు సుమారు రూ.14.63 కోట్ల అదనపు ఆర్థిక భారం పడనుంది.
ఏయే సంస్థలో ఎంతమందికంటే..
టీజీ ట్రాన్స్‌కో పరిధిలో 3,081 మంది ఉద్యోగులు, 3,644 మంది ఆర్టిజన్లు, 2,469 మంది పెన్షనర్లు కలిపి మొత్తం 9,194 మందికి ప్రయోజనం కలగనుంది. టీజీ జెన్‌కోలో 7,197 మంది ఉద్యోగులు, 3,544 మంది ఆర్టిజన్లు, 3,426 మంది పెన్షనర్లు కలిపి 14,167 మంది లబ్ధి పొందనున్నారు. టీజీ ఎస్పీడీసీఎల్‌లో 11,719 మంది ఉద్యోగులు, 8,493 మంది ఆర్టిజన్లు, 8,269 మంది పెన్షనర్లు కలిపి 28,481 మందికి, టీజీ ఎన్పీడీసీఎల్‌లో 9,936 మంది ఉద్యోగులు, 3,435 మంది ఆర్టిజన్లు, 6,147 మంది పెన్షనర్లు కలిపి 19,518 మందికి ప్రయోజనం చేకూరనుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●IDBI Deal | కాంగ్రెస్ పార్టీ బ్యాంకులను తమ వ్యక్తిగత ఆస్తిలా వాడుకుంది
- ●Binance | క్రిప్టో కరెన్సీ చోరీ జరిగితే నష్టం ఎవరు చెల్లిస్తారు.. బైనాన్స్ చెబుతున్నది జరిగేనా..?
- ●Ponguleti Srinivas Reddy | మియాపూర్ భూములు అమ్మి.. పేదింటి ఆడబిడ్డలకు ఇళ్లు కట్టిస్తాం
- ●Meta | మెటా నుంచి ఏఐ ఫ్యాషన్ యాప్.. మీ దగ్గరున్న దుస్తులతోనే కొత్త లుక్స్..
- ●Kollywood | కోలీవుడ్ నటి వత్సల రాజగోపాల్ కన్నుమూత - అదుర్స్‌లో ఎన్టీఆర్ బామ్మగా...
- ●Arshdeep Singh | టీ20ల్లో అర్ష్‌దీప్ సింగ్ అరుదైన ఘనత!

IDBI Deal | కాంగ్రెస్ పార్టీ బ్యాంకులను తమ వ్యక్తిగత ఆస్తిలా వాడుకుంది

Binance | క్రిప్టో కరెన్సీ చోరీ జరిగితే నష్టం ఎవరు చెల్లిస్తారు.. బైనాన్స్ చెబుతున్నది జరిగేనా..?

Ponguleti Srinivas Reddy | మియాపూర్ భూములు అమ్మి.. పేదింటి ఆడబిడ్డలకు ఇళ్లు కట్టిస్తాం

Meta | మెటా నుంచి ఏఐ ఫ్యాషన్ యాప్.. మీ దగ్గరున్న దుస్తులతోనే కొత్త లుక్స్..





