త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Six dies in Road Accident | ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఆరుగురు సంగీత క‌ళాకారుల‌ దుర్మ‌ర‌ణం

Six dies in Road Accident | ఛత్తీస్‌గఢ్‌ బలోద్ జిల్లాలో శుక్ర‌వారం ఘోర‌ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న వాహ‌నాన్ని 16 టైర్ల భారీ ట్ర‌క్కు వేగంగా వ‌చ్చి ఢికొట్టిన ఘ‌ట‌న‌లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.

S

National | Published On Sep 25, 2026, 6.03 pm IST

Six dies in Road Accident | ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఆరుగురు సంగీత క‌ళాకారుల‌ దుర్మ‌ర‌ణం
Advertisement
  • మ‌రో ఏడుగురికి తీవ్ర‌ గాయాలు.. రాయ్‌పూర్ ఆస్ప‌త్రికి త‌ర‌లింపు

Six dies in Road Accident | త్రినేత్ర న్యూస్: ఛత్తీస్‌గఢ్‌ బలోద్ జిల్లాలో శుక్ర‌వారం ఘోర‌ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న వాహ‌నాన్ని 16 టైర్ల భారీ ట్ర‌క్కు వేగంగా వ‌చ్చి ఢికొట్టిన ఘ‌ట‌న‌లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్ర‌మాదంలో మ‌రో ఏడుగురికి తీవ్ర గాయాల‌య్యాయి. బాధితుల‌ను మెరుగైన చికిత్స కోసం రాయ్‌పూర్ ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

బలోద్ అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ చంద్రకాంత్ గోవర్ణ వివ‌రాల ప్ర‌కారం.. 'ధుమాల్' మ్యూజిక్ బ్యాండ్‌కు చెందిన కళాకారులు తమ సంగీత వాయిద్యాలతో చిన్న స‌ర‌కు ర‌వాణా చేసే వాహ‌నంలో కబీర్‌ధామ్ జిల్లా నుంచి జగదల్‌పూర్ వైపు వెళ్తున్నారు. బలోద్ జిల్లాలోని పురూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ధమతరి-కంకేర్ మధ్య జాతీయ రహదారి 30పై 'మర్కాటోలా ఘాట్' ప్రాంతంలో వారి వాహ‌నం పాడవడంతో రోడ్డు పక్కన నిలిపి ఉంచారు. ఈ స‌మ‌యంలో రాయ్‌పూర్ నుంచి జగదల్‌పూర్ వైపు వరి ధాన్యం లోడుతో వేగంగా వెళ్తున్న 16 టైర్ల భారీ ట్రక్కు వారు ఉన్న వాహనాన్ని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది.

ఢీకొట్టిన వెంట‌నే ప్ర‌మాద తీవ్రతకు ఆ ట్రక్కు రోడ్డుపైనే బోల్తా పడింది. దీంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో నలుగురు మృతి చెందారు. గాయపడిన మరో ఏడుగురిని మెరుగైన చికిత్స కోసం రాయ్‌పూర్ ఆసుపత్రికి తరలించిన‌ట్లు పోలీసులు తెలిపారు.

ప్రమాదం జరిగిన తర్వాత ట్రక్కు డ్రైవర్ ఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. ఈ ఘ‌ట‌న‌పై కేసు నమోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నామ‌ని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండ‌గా ఆ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా రోడ్డు బుర‌ద‌మ‌యంగా ఉండటమే ప్రమాదానికి కారణం కావచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.

Advertisement
Advertisement