Ward Officers | ఘన వ్యర్థాల నిర్వహణపై వార్డు అధికారులకు శిక్షణ
Ward Officers | మున్సిపాలిటీల పరిధుల్లోని వార్డుల్లో పారిశుద్ధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణపై వార్డు అధికారులకు సీడీఎంఏ( CDMA ), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్‌మెంట్ (NIUM) సమన్వయంతో శిక్షణ ఇచ్చారు.
Ward Officers | త్రినేత్ర న్యూస్ : మున్సిపాలిటీల పరిధుల్లోని వార్డుల్లో పారిశుద్ధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణపై వార్డు అధికారులకు సీడీఎంఏ( CDMA ), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్‌మెంట్ (NIUM) సమన్వయంతో శిక్షణ ఇచ్చారు. ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్‌సీయూఈఎస్‌లో మూడు రోజుల పాటు శిక్షణ కొనసాగింది. తొలి విడతలో 40 మున్సిపాలిటీల పరిధిలో పని చేస్తున్న వార్డు అధికారులు ఈ శిక్షణలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎంఏయూడీ కార్యదర్శి డాక్టర్ టీకే శ్రీదేవి మాట్లాడుతూ.. ప్రజారోగ్యాన్ని పరిరక్షించడంలో భాగంగా పారిశుద్ధ్య వ్యవస్థతో పాటు ఘన వ్యర్థాల నిర్వహణను మెరుగుపరచాలని నొక్కి చెప్పారు. పారిశుద్ధ్య నిర్వహణను జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుందన్నారు. ఘన వ్యర్థాల నిర్వహణను సమర్థవంతంగా నిర్వహిస్తే.. పట్టణాల్లో పారిశుద్ధ్యం మెరుగుపడుతుందన్నారు.

శిక్షణలో భాగంగా సాంకేతికతతో పాటు ప్రదర్శనలు, క్షేత్రస్థాయి చర్చలు నిర్వహించారు. వార్డు అధికారులందరికీ ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు, స్వచ్ఛ భారత్ మిషన్–అర్బన్ 2.0, వ్యర్థాల విభజన, సేకరణ, మార్గ ప్రణాళిక, క్షేత్రస్థాయి పర్యవేక్షణపై అవగాహన కల్పించారు. ఈ సమావేశాలలో ఘన వ్యర్థాల శుద్ధి, వనరుల పునరుద్ధరణ, మల వ్యర్థాలు, సెప్టేజ్ నిర్వహణ, నమస్తే కార్యక్రమం కింద పారిశుధ్య కార్మికుల భద్రత, గౌరవం, ఇంకా జీపీఎస్ ఆధారిత పర్యవేక్షణ, ఎంఐఎస్ ప్లాట్‌ఫారమ్‌లు,యు డాష్‌బోర్డ్‌లతో సహా డిజిటల్ సాధనాలపై కూడా అవగాహన కల్పించారు.

శిక్షణా ముగింపు కార్యక్రమంలో ఆర్‌సీయూఈఎస్ డైరెక్టర్ నాగేశ్, ఆర్డీఎంఏ జే శ్రీనివాస్ రావు, ఎన్ఐయూఎం డైరెక్టర్ వేణుగోపాల్ పాల్గొన్నారు.
తాజావార్తలు
- ●Revanth Reddy | గాంధీ పరివార్ కోసం ప్రాణం కూడా త్యాగం చేస్తా
- ●హాఫ్‌టైమ్ ముగిసింది.. కేసీఆర్ సైలెంట్ మోడ్ పార్టీకి ప్లస్సా? మైనస్సా?
- ●Kalki 2 | డార్లింగ్ ఫ్యాన్స్‌కి పూనకాలే - కల్కి 2 సెట్స్‌లోకి ప్రభాస్ ఎంట్రీ అప్పుడే
- ●Bandi Sanjay | జవాన్ల నివాస భవనాలను ప్రారంభించడం సంతోషంగా ఉంది
- ●Gujarat Handicrafts | శిల్పారామంలో గుజరాత్ హ్యాండీక్రాఫ్ట్స్ ఉత్సవ్ మేళా
- ●పదేళ్లలో ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు : మంత్రి ఉత్తమ్

Revanth Reddy | గాంధీ పరివార్ కోసం ప్రాణం కూడా త్యాగం చేస్తా

హాఫ్‌టైమ్ ముగిసింది.. కేసీఆర్ సైలెంట్ మోడ్ పార్టీకి ప్లస్సా? మైనస్సా?

Kalki 2 | డార్లింగ్ ఫ్యాన్స్‌కి పూనకాలే - కల్కి 2 సెట్స్‌లోకి ప్రభాస్ ఎంట్రీ అప్పుడే

Bandi Sanjay | జవాన్ల నివాస భవనాలను ప్రారంభించడం సంతోషంగా ఉంది






